మంత్రిమండలి
ఫాస్ఫేటిక్, పొటాషిక్ (పీ అండ్ కే) ఎరువులపై 2026 ఖరీఫ్ సీజను (01.04.2026 నుంచి 30.09.2026)కు పోషకాధారిత సబ్సిడీ (ఎన్‌బీఎస్) రేట్లకు మంత్రిమండలి ఆమోద ముద్ర
నాడు పోస్టు చేయడమైనది:
08 APR 2026 4:18PM by PIB Hyderabad
ఫాస్ఫేటిక్, పొటాషిక్ (పీ అండ్ కే) ఎరువులపై 2026 ఖరీఫ్ సీజను (01.04.2026 నుంచి 30.09.2026)కు పోషకాధారిత సబ్సిడీ (ఎన్‌బీఎస్) రేట్లను ఖరారు చేస్తూ ఎరువుల విభాగం చేసిన ప్రతిపాదనను కేంద్ర మంత్రిమండలి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అధ్యక్షతన ఈ రోజు సమావేశమై, ఆమోదించింది. 2026 ఖరీఫ్ సీజనుకు తాత్కాలికంగా దాదాపు రూ.41,533.81 కోట్లు అవసరమవుతాయి. ఇది 2025 సంవత్సర ఖరీఫ్ సీజను అవసరాలతో పోలిస్తే రూ.4,317 కోట్లు ఎక్కువ. 2026 ఖరీఫ్ సీజను బడ్జెటు రూ.37,216.15 కోట్లుగా ఉంది.
ప్రయోజనాలు:
రైతులకు చౌకయిన, గిట్టుబాటైన, హేతుబద్ధమైన ధరలకు ఎరువులు అందుబాటులోకి వస్తాయి.
ఎరువులు, ఇన్‌పుట్లకు సంబంధించిన అంతర్జాతీయ ధరల్లో ఇటీవలి ధోరణులను దృష్టిలో పెట్టుకొని ఫాస్ఫేట్, పొటాష్ ఎరువులపై సబ్సిడీని హేతుబద్ధీకరించారు.
కార్యాచరణ వ్యూహం, లక్ష్యాలు:
రైతులకు గిట్టుబాటు ధరల్లో ఈ ఎరువులను సజావుగా అందించడానికి గాను డీఏపీ, ఎన్‌పీకేఎస్ గ్రేడ్లకు చెందిన ఎరువులు సహా ఫాస్ఫేట్, పొటాష్ ఎరువులపై 2026 ఖరీఫ్‌కు ఆమోదించిన ధరల ఆధారంగా సబ్సిడీని సమకూరుస్తారు. (ఈ ధరలను 01.04.2026 మొదలు 30.09.2026 వరకు అమలు చేస్తారు).
నేపథ్యం:
ఎరువుల తయారీదారు సంస్థలు, దిగుమతి సంస్థల నుంచి రైతులకు సబ్సిడీ ధరలకు డీఏపీ సహా ఫాస్ఫేట్, పొటాష్ (పీ అండ్ కే) ఎరువుల్లో 28 గ్రేడ్లను అందుబాటులో ఉంచేందుకు కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. పీ అండ్ కే ఎరువులపై సబ్సిడీని 2021 ఏప్రిల్ 1 నుంచి పోషకాధారిత సబ్సిడీ (ఎన్‌బీఎస్) పథకంలో భాగంగా వర్తింపచేస్తున్నారు. రైతులకు మేలు చేసే దృష్టితో, గిట్టుబాటు ధరలకు ఫాస్ఫేట్, పొటాషియం ఎరువులను రైతులకు అందించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉంది.
ఎరువులతో పాటు యూరియా, డీఏపీ, ఎమ్ఓపీ, సల్ఫర్ వంటి ఇన్‌పుట్ల అంతర్జాతీయ ధరల్లో ఇటీవలి ధోరణులను గమనించి, 2026 ఖరీఫ్ సీజనుకు ఫాస్ఫేటిక్, పొటాషిక్ ఎరువులపై (డీఏపీ, ఎన్‌పీకేఎస్ గ్రేడ్లు సహా) పోషకాధారిత సబ్సిడీ రేట్లను 01.04.2026 నుంచి 30.09.2026 వరకు ఆమోదించాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించింది. రైతులకు ఎరువులు చౌక ధరలకు అందేటట్లు ఆమోదించిన ధరలతో పాటు నోటిఫై చేసిన ధరలకు అనుగుణంగా ఎరువుల కంపెనీలకు సబ్సిడీని సమకూరుస్తారు.
***
(రిలీజ్ ఐడి: 2250169)
సందర్శకుల సూచీ సంఖ్య : : 45
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
Kannada
,
Malayalam
,
Bengali
,
Bengali-TR
,
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia