ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా వ్యాధి నిరోధక, ఆరోగ్యాభివృద్ధి సేవలకు ప్రభుత్వం ఇస్తున్న ప్రాధాన్యం గురించి వివరించిన కేంద్ర ఆరోగ్యం, కుటుంబ వ్యవహారాలు, రసాయనాలు, ఎరువుల మంత్రి శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా


ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్య మంత్రి శ్రీ జేపీ నడ్డా శుభాకాంక్షలు

నాడు పోస్టు చేయడమైనది: 07 APR 2026 1:58PM by PIB Hyderabad

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా కేంద్ర ఆరోగ్యంకుటుంబ సంక్షేమంరసాయనాలుఎరువుల మంత్రి శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా శుభాకాంక్షలు తెలియజేశారు.

‘‘అందరికీ ప్రపంచ ఆరోగ్య దినోత్సవ శుభాకాంక్షలు!

మన ఆరోగ్యం పట్ల తగిన శ్రద్ధ వహించాలనిసమతుల్య జీవన విధానం అనుసరించాలని ఈ రోజు మనకు గుర్తు చేస్తుందిప్రాచీన విజ్ఞానాన్ని ఆధునిక శాస్త్రంతో మేళవించే భారతీయ విధానం.. మన దేశంతో పాటు ప్రపంచవ్యాప్తంగా ఉన్నవారి జీవితాలను మెరుగుపరిచేందుకు దోహదపడుతుంది.

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో చేపట్టిన ఆయుష్మాన్ భారత్పీఎం భారతీయ జన ఔషధి పరియోజన లాంటి పరివర్తనాత్మక పథకాలు ఆరోగ్య సేవల వ్యవస్థను బలోపేతం చేశాయిప్రతి పౌరునికి నాణ్యమైన చికిత్సను చవకగా అందుబాటులో తీసుకువచ్చాయివైద్యసేవల రంగాన్ని దృఢంగా నిలుపుతూ.. అంకితభావంతో పని చేస్తున్న వైద్యులునర్సులుఇతర క్షేత్రస్థాయి సిబ్బందికి హృదయపూర్వక కృతజ్ఞతలుఆరోగ్యకరమైనబలమైన దేశాన్ని నిర్మించే దిశగా మనందరం కలసి పనిచేద్దాం’’ అని సామాజిక మాధ్యమం ఎక్స్‌లో కేంద్ర ఆరోగ్యంకుటుంబ సంక్షేమంరసాయనాలుఎరువుల మంత్రి శ్రీ జగత్ ప్రకాశ్ నడ్డా పోస్టు చేశారు.

 

***


(రిలీజ్ ఐడి: 2249679) సందర్శకుల సూచీ సంఖ్య : : 23
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Gujarati , Kannada