ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

అంతర్జాతీయ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడం పట్ల నిబద్ధతను స్పష్టం చేసిన ప్రధానమంత్రి


శారీరక వ్యాయామ ప్రయోజనాలను తెలియజెప్పే సంస్కృత సుభాషితాన్నిపంచుకున్న పీఎం

प्रविष्टि तिथि: 07 APR 2026 9:33AM by PIB Hyderabad

 

ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఇతరుల సేవకు తమను తాము అంకితం చేసుకునిఆరోగ్యకరమైన ప్రపంచం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న వారందరికీ ప్రధానమంత్రి కృతజ్ఞతలు తెలియజేశారు.

ఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించాలనే జాతీయ నిబద్ధతను శ్రీ మోదీ పునరుద్ఘాటించారుఆరోగ్య సేవా వ్యవస్థలను బలోపేతం చేయడానికిప్రతి వ్యక్తి సంక్షేమానికి ప్రాధాన్యం ఇవ్వడానికి సమష్టి ప్రయత్నాలను కొనసాగించాలని పిలుపునిచ్చారు.

ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ప్రధానమంత్రి ఆకాంక్షించారుశారీరక దారుఢ్యాన్ని కాపాడుకొనేందుకు సాధ్యమైనంత మేర ప్రయత్నించాలని అందరికీ సూచించారుఈ నేపథ్యంలో శారీరక వ్యాయామ ప్రయోజనాలను తెలిపే సంస్కృత సుభాషితాన్ని ప్రధానమంత్రి పంచుకున్నారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి చేసిన పోస్టు:

‘‘ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా ఇతరులకు సేవ చేయడానికి తమను తాము అంకితం చేసుకునిఆరోగ్యకరమైన ప్రపంచం కోసం అవిశ్రాంతంగా కృషి చేస్తున్న వారందరికీ కృతజ్ఞతలుఆరోగ్యకరమైన సమాజాన్ని నిర్మించడం పట్ల మా చిత్తశుద్ధిని పునరుద్ఘాటిస్తున్నాంఆరోగ్య సేవా వ్యవస్థలను బలోపేతం చేయడానికిప్రతి ఒక్కరి శ్రేయస్సుకు ప్రాధాన్యం ఇవ్వడానికి మన సమష్టి ప్రయత్నాలను కొనసాగిద్దాం.’’

‘‘ప్రపంచ ఆరోగ్య దినోత్సవం సందర్భంగా దేశ ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షిస్తున్నానుఆరోగ్యంగా ఉండేందుకు అన్ని విధాల ప్రయత్నించాలని అందరినీ కోరుతున్నాను.

లాఘవం కర్మసామర్థ్యం దీప్తోగ్నిర్మేదసః క్షయః।

విభిక్తఘనగాతృత్వం వ్యాయామాదుపజాయతే।।’’

వ్యాయామం వల్ల పనిచేసే సామర్థ్యం పెరుగుతుందిజీర్ణశక్తి మెరుగవుతుందిఊబకాయం తగ్గుతుందిశరీరం దృఢంగానూచక్కని రూపురేఖలతోనూ ఉంటుంది.

 

***


(रिलीज़ आईडी: 2249628) आगंतुक पटल : 99
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Bengali , Bengali-TR , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam