లోక్‌సభ సచివాలయం
azadi ka amrit mahotsav

జాతీయ జనగణన- 2027లో పాల్గొన్న లోక్‌సభ స్పీకర్ డిజిటల్ సమాచార పత్రాన్ని పూర్తి చేసిన శ్రీ ఓం బిర్లా

నాడు పోస్టు చేయడమైనది: 03 APR 2026 4:50PM by PIB Hyderabad

నేడు లోక్‌సభ స్పీకర్ శ్రీ ఓం బిర్లా ఢిల్లీలోని అధికారిక నివాసంలో 'డిజిటల్ సమాచార పత్రాన్ని' పూర్తి చేయటం ద్వారా జాతీయ జనగణన 2027 తొలి దశలో పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈ జనగణన పరిపాలన వ్యవస్థలో ఒక కొత్త శకానికి నాంది అని పేర్కొన్నారు. భారత చరిత్రలో తొలిసారిగా జనాభా లెక్కింపు ప్రక్రియను పూర్తిగా డిజిటల్ పద్ధతిలో నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రతి ఒక్కరు తమ ఇంటి వివరాలను అత్యంత సురక్షితంగా ఖచ్చితత్వంతో సులభంగా నమోదు చేసుకునే సదుపాయం దీని ద్వారా లభిస్తుందని ఆయన చెప్పారు. 

డిజిటల్ గణన వైపు సాగిన ఈ మార్పు భారతదేశ సాంకేతిక పురోగతికి నిదర్శనమన్న లోక్‌సభ స్పీకర్.. దీనివల్ల జాతీయ గణాంకాలు మరింత ఖచ్చితంగా ఉండటమే కాకుండా అవి క్షేత్రస్థాయి వాస్తవాలను ప్రతిబింబిస్తాయని పేర్కొన్నారు.

‘జనగణన ద్వారా ప్రజా సంక్షేమం’ అనే సంకల్పాన్ని పునరుద్ఘాటించిన శ్రీ ఓం బిర్లా.. ఈ కీలకమైన జాతీయ ప్రక్రియలో ప్రజలంతా చురుగ్గా పాల్గొనాలని పిలుపునిచ్చారు. ప్రతి ఒక్కరూ తమ వివరాలను నమోదు చేయడమే కాకుండా ఇతరులను కూడా ఇందుకు ప్రోత్సహించాలని.. తద్వారా 'సశక్త్, సమృద్ధ భారత్' (బలమైన, సుసంపన్నమైన భారతదేశం) నిర్మాణానికి పునాది వేయాలని ఆయన కోరారు.

సమాచార పత్రాన్ని లోక్‌సభ స్పీకర్ నింపుతున్నప్పుడు వివరాల నమోదులో ఆయనకు భారత రిజిస్ట్రార్ జనరల్, సెన్సస్ కమిషనర్ శ్రీ మృత్యుంజయ్ కుమార్ నారాయణ్ ప్రత్యక్షంగా సహకరించారు.

***


(రిలీజ్ ఐడి: 2248864) సందర్శకుల సూచీ సంఖ్య : : 41
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Bengali , Bengali-TR , Punjabi , Gujarati , Odia , Kannada