పెట్రోలియం- సహజ వాయువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశవ్యాప్తంగా ఇంధన సరఫరా పరిస్థితిపై రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలతో సమీక్షా సమావేశం


నిర్వహించిన పెట్రోలియం, సహజ వాయువు మంత్రిత్వ శాఖ కార్యదర్శి

నాడు పోస్టు చేయడమైనది: 02 APR 2026 8:27PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఇంధన సరఫరా పరిస్థితిపై పెట్రోలియం శాఖ కార్యదర్శి ఈ రోజు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల అదనపు ప్రధాన కార్యదర్శులు, ఆహార, పౌర సరఫరాల శాఖ ముఖ్య కార్యదర్శులతో సమీక్షా సమావేశం నిర్వహించారు.

అవసరమైన పెట్రోలియం ఇంధనాల సరఫరాను సులభతరం చేయడానికి ప్రభుత్వం తీసుకున్న చర్యలను ఆయన రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు వివరించారు. అలాగే మారుతున్న పరిస్థితులను ఎదుర్కోవడంలో కేంద్ర ప్రభుత్వంతో కలిసి పనిచేస్తున్న ఆయా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను అభినందించారు.

గృహ వినియోగదారులకు, అత్యవసర విభాగాలకు ఎటువంటి అంతరాయం లేకుండా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు ఎల్‌పిజి పంపిణీని చురుగ్గా నిర్వహించాలని, ప్రాధాన్యత ఇవ్వాలని పెట్రోలియం శాఖ కార్యదర్శి స్పష్టం చేశారు. నిత్యావసర ఇంధనాల నిల్వ, మళ్లింపు, అనవసర భయాందోళనలకు దారితీసే తప్పుడు సమాచారం వ్యాప్తి చెందకుండా కఠిన నిఘా ఉంచాలని కూడా రాష్ట్రాలకు సూచించారు.

అక్రమాలను అరికట్టడానికి దాడులతో సహా చురుగ్గా చర్యలు తీసుకున్నందుకు ఉత్తరప్రదేశ్, గుజరాత్, హర్యానా, ఢిల్లీ, మహారాష్ట్ర, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలను అభినందించారు. ఇతర రాష్ట్రాలు కూడా పర్యవేక్షణ, అమలును మరింత బలోపేతం చేయాలని, ఉల్లంఘనదారులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. సరఫరాలకు సంబంధించి అసత్య ప్రచారాలు, వదంతులను అడ్డుకోవడానికి చురుగ్గా వ్యవహరించాలని కూడా రాష్ట్రాలను కోరారు.

వలస కార్మికులకు ఎఫ్‌టిఎల్ ఎల్‌పిజి సరఫరాకు సంబంధించి వస్తున్న వార్తలపై రాష్ట్రాలు స్పష్టతనిచ్చాయి. వలసదారులకు ఎల్‌పిజి సరఫరాలో ఎలాంటి అంతరాయం లేదని, సరఫరా స్థిరంగా ఉందని పేర్కొన్నాయి. స్థానిక అవసరాలను బట్టి ఆయిల్ మార్కెటింగ్ కంపెనీలతో కలిసి ఐదు కిలోల ఎఫ్‌టిఎల్ ఎల్‌పిజి సిలిండర్ల పంపిణీని క్రమబద్ధీకరించడంపై రాష్ట్రాలు దృష్టి సారించవచ్చని కార్యదర్శి సూచించారు. ఆటోలకు ఎల్‌పిజి సరఫరాకు సంబంధించి పెరుగుతున్న డిమాండ్‌ను తీర్చడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని అధికారులు తెలిపారు. అయితే, ఎల్‌పిజి, పెట్రోల్ రెండింటిపై నడిచే వాహనాలు ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో పెట్రోల్‌నే ఉపయోగించడాన్ని ప్రోత్సహించాలని సూచించారు.

రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల సహకారాన్ని అభినందిస్తూ, అంతరాయం లేని సరఫరాతో ప్రజల్లో విశ్వాసాన్ని నిలబెట్టడానికి నిరంతర పర్యవేక్షణ కొనసాగించాలని పెట్రోలియం శాఖ కార్యదర్శి సూచించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2248689) సందర్శకుల సూచీ సంఖ్య : : 17
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam