వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జన విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు- 2026కు లోక్‌సభ, రాజ్యసభ ఆమోదం


· 79 కేంద్ర చట్టాలలోని 784 నిబంధనల సవరణ: నేరాల జాబితా నుంచి 717 నిబంధనల తొలగింపు.. గతంలో చిన్నపాటి ఉల్లంఘనలనూ నేరంగా భావించేలా ఉన్న నిబంధనలు

· జీవన సౌలభ్యాన్ని ప్రోత్సహించేలా మరో 67 నిబంధనల సవరణ

నాడు పోస్టు చేయడమైనది: 02 APR 2026 7:51PM by PIB Hyderabad

దేశంలో సులభతర వాణిజ్యాన్నీజీవన సౌలభ్యాన్నీ మరింత మెరుగుపరిచే దిశగా కీలక ముందడుగు పడిందిజనవిశ్వాస్ (నిబంధనల సవరణబిల్లు - 2026కు లోక్‌సభరాజ్యసభలు ఆమోదం తెలిపాయి.

విశ్వాసమే ప్రాతిపదికగా పాలన యంత్రాంగాన్ని మరింత మెరుగుపరిచేందుకూతగిన నియంత్రణలను అమలు చేసేందుకూ ప్రభుత్వం కట్టుబడి ఉందని ఈ బిల్లు స్పష్టం చేస్తోందిచిన్నపాటి తప్పిదాలను నేరాలుగా పరిగణించకపోవడంప్రస్తుతమున్న చట్టపరమైన నిబంధనలను హేతుబద్ధీకరించడం ద్వారా.. వ్యక్తులువ్యాపార సంస్థలపై పాటించాల్సిన నిబంధనల భారాన్ని తగ్గించడం ఈ బిల్లు ముఖ్యోద్దేశం.

ఈ బిల్లులోని నిబంధనల ప్రకారం.. 23 మంత్రిత్వ శాఖల పరిధిలోని 79 కేంద్ర చట్టాలకు సంబంధించి మొత్తం 784 నిబంధనలను సవరించారువీటిలో వాణిజ్య సౌలభ్యాన్ని పెంపొందించడం లక్ష్యంగా.. గతంలో చిన్న తప్పిదాలనే నేరాలుగా భావించే 717 నిబంధనల స్వభావాన్ని మార్చారుఇకపై వాటిని నేరాలుగా పరిగణించబోరుఅలాగే మరో 67 నిబంధనలను సవరించి జీవన సౌలభ్యాన్ని మెరుగుపరిచారు.

మొత్తంగా చూస్తేచిన్న తప్పిదాలనే నేరాలుగా పరిగణిస్తున్న వెయ్యికి పైగా నిబంధనలను హేతుబద్ధీకరించాలని ఈ బిల్లు లక్ష్యంగా పెట్టుకుందిచిన్నపాటి ఉల్లంఘనలను నేరాల జాబితా నుంచి తొలగించడంతద్వారా దేశంలోని నియంత్రణ వాతావరణాన్ని మెరుగుపరచడమే కాకుండా.. వ్యాపార సంస్థలకూపౌరులకూ మరింత అనుకూలమైన వ్యవస్థను అందుబాటులోకి తేవడానికి ఇది దోహదపడుతుంది.

మొదట 2025 ఆగస్టు 18న ‘జనవిశ్వాస్ (నిబంధనల సవరణబిల్లు- 2025’ పేరిట లోక్‌సభలో ఈ బిల్లును ప్రవేశపెట్టారుఈ బిల్లు 10 మంత్రిత్వ శాఖలు/విభాగాల పరిధిలోని 16 కేంద్ర చట్టాలలోని 355 నిబంధనలకు సవరణలను ప్రతిపాదించిందిఅనంతరం లోక్‌సభ.. ఎంపిక కమిటీకి ఈ బిల్లును సిఫార్సు చేసిందిశ్రీ తేజస్వి సూర్య అధ్యక్షతన ఈ కమిటీ 49 సమావేశాలు నిర్వహించి2026 మార్చి 13న తన నివేదికను సమర్పించిందిసంబంధిత భాగస్వామ్య పక్షాలన్నింటితో ఈ కమిటీ విస్తృతంగా సంప్రదింపులు నిర్వహించిందిపరిశీలనలో ఉన్న నిబంధనలతోపాటు.. అవే చట్టాల్లోని మరిన్ని నిబంధనలనూ సమీక్షించిందిమరో 62 కేంద్ర చట్టాల్లో.. చిన్నపాటి ఉల్లంఘనలను కూడా నేరాలుగా పరిగణించేలా ఉన్న నిబంధనలను సవరించాలని సిఫార్సు చేసింది.

 

*** 


(రిలీజ్ ఐడి: 2248686) సందర్శకుల సూచీ సంఖ్య : : 24
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Odia