పంచాయతీరాజ్ మంత్రిత్వ శాఖ
8 రాష్ట్రాల్లో గ్రామీణ స్థానిక పాలన బలోపేతం కోసం 15వ ఆర్థిక సంఘం గ్రాంట్ల కింద రూ. 1,536 కోట్లు విడుదల చేసిన కేంద్రం
అరుణాచల్ ప్రదేశ్, గోవా, గుజరాత్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్‌లలో బలోపేతం కానున్న పీఆర్ఐలు
నాడు పోస్టు చేయడమైనది:
01 APR 2026 4:26PM by PIB Hyderabad
కేంద్ర ప్రభుత్వం అరుణాచల్ ప్రదేశ్, గోవా, గుజరాత్, జార్ఖండ్, ఒడిశా, రాజస్థాన్, తెలంగాణ, ఉత్తరాఖండ్‌లోని పంచాయతీ రాజ్ సంస్థలు, గ్రామీణ స్థానిక సంస్థల బలోపేతం కోసం 2025-26 ఆర్థిక సంవత్సరానికి గానూ పదిహేనో ఆర్థిక సంఘ టైడ్, అన్‌టైడ్ గ్రాంట్లను విడుదల చేసింది. సాధారణ వాయిదాలతో పాటు వివిధ ఆర్థిక సంవత్సరాలకు సంబంధించి గతంలో నిలిపివేసిన మొత్తాలనూ విడుదల చేశారు. ఈ రాష్ట్రాల వ్యాప్తంగా గ్రామీణ స్థానిక పరిపాలనను మరింత బలోపేతం చేసే లక్ష్యంతో మొత్తం రూ. 1,536.14 కోట్లు విడుదల చేశారు.
2025-26 ఆర్థిక సంవత్సరంలో విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం (టైడ్, అన్-టైడ్) గ్రాంట్ల వివరాలు రాష్ట్రాల వారీగా:
|
Sl. No.
|
Name of State
|
Grant Component
|
Amount (Rs. in Crore)
|
Installment / Year
|
Eligible Panchayats of the State
|
|
|
1.
|
Arunachal Pradesh
|
Tied
|
53.10
|
1st Installment for FY 2022-23
|
All 25 eligible DPs and all 2108 eligible GPs
|
|
|
2.
|
Goa
|
Tied
|
18.27
|
1st Installment for FY 2024-25
|
All 2 eligible DPs and 187 eligible GPs
|
|
|
3.
|
Gujarat
|
Untied
|
2.98
|
Withheld portion of 1st and 2nd Installments for FY 2025-26
|
Additionally 1 eligible BP, 21 eligible GPs and all 23 newly constituted GPs (for both installments)
|
|
|
|
|
Tied
|
4.47
|
Withheld portion of 1st and 2nd Installments for FY 2025-26
|
Additionally 1 eligible BP, 21 eligible GPs and all 23 newly constituted GPs (for both installments)
|
|
|
4.
|
Jharkhand
|
Tied
|
405.23
|
1st Installment for FY 2025-26
|
All 24 eligible DPs, all 264 eligible BPs and 4344 eligible GPs
|
|
|
|
|
Tied
|
2.67
|
Withheld portion of 1st Installment for FY 2024-25
|
Additionally 11 eligible BPs and 1 eligible GP
|
|
|
|
|
Tied
|
2.67
|
Withheld portion of 2nd Installment for FY 2024-25
|
Additionally 11 eligible BPs and 1 eligible GP
|
|
|
5.
|
Odisha
|
Tied
|
53.13
|
Withheld portion of 1st and 2nd Installments for FY 2025-26
|
Additionally 10 eligible DPs, 17 eligible BPs and 40 eligible GPs (for both installments) and 15 eligible GPs (for 2nd installment only)
|
|
|
6.
|
Rajasthan
|
Tied
|
466.79
|
2nd Installment for FY 2025-26
|
32 eligible DPs, 347 eligible BPs and 3857 eligible GPs
|
|
|
|
|
Tied
|
15.44
|
Withheld portion of 1st Installment for FY 2025-26
|
Additionally 8 eligible ZPs and 8 eligible BPs
|
|
|
7.
|
Telangana
|
Tied
|
371.91
|
1st Installment for FY 2025-26
|
12600 eligible GPs
|
|
|
8.
|
Uttarakhand
|
Tied
|
136.58
|
2nd Installment for FY 2025-26
|
All 13 eligible DPs, 94 eligible BPs and 7766 eligible GPs
|
|
|
|
|
Tied
|
2.90
|
Withheld portion of 1st Installment for FY 2025-26
|
Additionally 2 eligible BPs and 198 eligible GPs
|
|
|
Grand Total
|
Rs. 1,536.14 crore
|
|
*GPs / BPs / DPs / ZPs: గ్రామ పంచాయతీలు / మండల పంచాయతీలు / జిల్లా పంచాయతీలు / జిల్లా పంచాయతీలు
నేపథ్యం
భారత ప్రభుత్వ ఆర్థిక మంత్రిత్వ శాఖ పరిధిలోని వ్యయాల విభాగం జారీ చేసిన, గ్రామీణ స్థానిక సంస్థలకు 15వ ఆర్థిక సంఘం నిధులను అమలుకు సంబంధించిన నిర్వహణ మార్గదర్శకాల ప్రకారం... పంచాయతీ రాజ్ మంత్రిత్వ శాఖ, జల శక్తి మంత్రిత్వ శాఖ (తాగునీరు, పారిశుధ్య విభాగం) ద్వారా గ్రామీణ స్థానిక సంస్థల కోసం రాష్ట్రాలకు 15వ ఆర్థిక సంఘం నిధులను విడుదల చేయాలని సిఫార్సు చేస్తారు. ఆపై ఈ నిధులను ఆర్థిక మంత్రిత్వ శాఖ విడుదల చేస్తుంది. కేటాయించిన ఈ నిధులను ఒక ఆర్థిక సంవత్సరంలో రెండు వాయిదాలుగా విడుదల చేయాలని సిఫార్సు చేసి, విడుదల చేస్తారు. 15వ ఆర్థిక సంఘం సిఫార్సులు 2026 మార్చి 31 వరకు గల ఆరు సంవత్సరాల కాలాన్ని పరిగణలోకి తీసుకున్నాయి.
జీతాలు, ఇతర స్థాపన ఖర్చులు మినహా, రాజ్యాంగంలోని పదకొండో షెడ్యూల్‌లో పొందుపరిచిన ఇరవై తొమ్మిది అంశాల కింద, ఆయా ప్రాంతాల అవసరాల కోసం పంచాయతీ రాజ్ సంస్థలు, గ్రామీణ స్థానిక సంస్థలు ఈ అన్‌టైడ్ గ్రాంట్లను వినియోగించుకుంటాయి.
టైడ్ గ్రాంట్లను ఈ ప్రాథమిక సేవల కోసం ఉపయోగించవచ్చు: (ఎ) పారిశుధ్యం, బహిరంగ మలవిసర్జన రహిత (ఓడీఎఫ్) స్థితిని నిర్వహించడం. ఇందులో ముఖ్యంగా గృహ వ్యర్థాల నిర్వహణ, శుద్ధి, మానవ మలం, మల వ్యర్థాల నిర్వహణ భాగంగా ఉంటాయి. (బి) తాగునీటి సరఫరా, వర్షపు నీటి సంరక్షణ, నీటి పునర్వినియోగం.
* * *
(రిలీజ్ ఐడి: 2247976)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9