రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

ఆత్మనిర్భర్ భారత్: భారత వాయు సేన పర్వత రాడార్ల కోసం రక్షణ మంత్రిత్వ శాఖ, బెల్ మధ్య రూ. 1,950 కోట్ల ఒప్పందం

నాడు పోస్టు చేయడమైనది: 31 MAR 2026 2:42PM by PIB Hyderabad

ఆత్మనిర్భర్ భారత్ లక్ష్యంగా భారత్‌లో తయారీ కార్యక్రమాల కింద భారత స్వదేశీ రక్షణ సామర్థ్యాలను బలోపేతం చేయడానికి, రక్షణ మంత్రిత్వ శాఖ, భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ (బెల్) మధ్య భారత వాయుసేన కోసం రెండు పర్వత రాడార్ల కొనుగోలు, అనుబంధ పరికరాలు, అవసరమైన మౌలిక వసతులతో కూడిన ఒక ప్రధాన మూలధన కొనుగోలు ఒప్పందం జరిగింది. ఈ ఒప్పందం అంచనా వ్యయం సుమారు రూ. 1,950 కోట్లు.  నేడు న్యూఢిల్లీ వేదికగా జరిగిన ఈ ఒప్పంద కార్యక్రమంలో రక్షణ శాఖ, బెల్ ఉన్నతాధికారులు హాజరయ్యారు. ఈ ఒప్పందాన్ని బై కేటగిరి (భారతీయులు స్వదేశీయంగా రూపకల్పన, అభివృద్ధి, తయారు చేయడం) కింద చేసుకున్నారు.

ఈ పర్వత రాడార్‌ను డీఆర్‌డీఓకి చెందిన ఎలక్ట్రానిక్స్, రాడార్ డెవలప్‌మెంట్ ఎస్టాబ్లిష్‌మెంట్ విభాగం స్వదేశీయంగా రూపకల్పన చేసి అభివృద్ధి చేసింది. దీన్ని బెల్ తయారు చేస్తుంది. ఈ రాడార్లు దేశ వైమానిక రక్షణను బలోపేతం చేయడంతో పాటు జాతీయ భద్రతను మరింత పటిష్టం చేస్తాయి. ఈ కొనుగోలు విదేశీ పరికరాలపై ఆధారపడే అవసరాన్ని కూడా తగ్గిస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2247354) సందర్శకుల సూచీ సంఖ్య : : 71
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Punjabi , Gujarati , Kannada