ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బీహార్‌లోని నలందలో ప్రమాదం.. ప్రాణనష్టంపై పీఎం సంతాపం పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ నుంచి నష్టపరిహారాన్ని ప్రకటించిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 31 MAR 2026 12:50PM by PIB Hyderabad

బీహార్‌లోని నలంద జిల్లాలో జరిగిన తొక్కిసలాటలో సంభవించిన ప్రాణనష్టంపై ప్రధానమంత్రి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. ఈ విషాద ఘటనలో తమ ఆత్మీయులను కోల్పోయిన కుటుంబాలకు ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ.. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రధానమంత్రి ప్రార్థించారు.

మృతుల కుటుంబాలకు ప్రధానమంత్రి జాతీయ సహాయ నిధి (పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌) నుంచి ఒక్కో మృతుని కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున, గాయపడిన వారికి రూ. 50,000 చొప్పున ఆర్థిక సహాయాన్ని ప్రధానమంత్రి ప్రకటించారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌ వేదికగా ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

‘‘బీహార్‌లోని నలంద జిల్లాలో జరిగిన దుర్ఘటన తీవ్రంగా కలిచి వేసింది. ఈ ప్రమాదంలో తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి నా ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తున్నాను. గాయపడిన వారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.

పీఎంఎన్‌ఆర్‌ఎఫ్‌ నుంచి ఒక్కో మృతుని కుటుంబానికి రూ. 2 లక్షల చొప్పున నష్టపరిహారం అందజేస్తున్నాం. గాయపడిన వారికి రూ. 50,000 ఇస్తున్నాం: ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ’’.


(రిలీజ్ ఐడి: 2247246) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी , Marathi , Assamese , Gujarati , Kannada