ప్రధాన మంత్రి కార్యాలయం
శ్యామ్‌జీ కృష్ణ వర్మ వర్ధంతి సందర్భంగా శ్రద్ధాంజలి ఘటించిన ప్రధానమంత్రి
प्रविष्टि तिथि:
30 MAR 2026 9:50AM by PIB Hyderabad
భరత మాత వీర పుత్రుడు శ్యామ్‌జీ కృష్ణ వర్మ వర్ధంతి ఈ రోజు. ఈ సందర్భంగా ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఆయనకు శ్రద్ధాంజలి ఘటించారు. శ్యామ్‌జీ కృష్ణ వర్మ విప్లవాత్మక ఆలోచనలతో స్వాతంత్య్ర ఉద్యమానికి ఒక కొత్త చైతన్యాన్ని అందించారని శ్రీ మోదీ అన్నారు. ‘‘ఆయన జీవితం, ఆయన ఆదర్శాలు దేశానికి సేవలను అందించే దిశగా ప్రతి ఒక్క తరానికీ స్ఫూర్తిని ఇస్తున్నాయ’’ని శ్రీ మోదీ అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ఒక సందేశాన్ని ప్రధానమంత్రి శ్రీ మోదీ పొందుపరుస్తూ -
‘‘భరత మాత వీర పుత్రుడు శ్యామ్‌జీ కృష్ణ వర్మ పుణ్యతిథి సందర్భంగా ఆయనకు సాదర నమస్సులు. ఆయన విప్లవాత్మక ఆలోచనలతో స్వాతంత్య్ర ఉద్యమానికి ఒక కొత్త చైతన్యాన్ని అందించారు. ఆయన జీవితం, ఆయన ఆదర్శాలు దేశానికి సేవలను అందించే దిశగా ప్రతి తరం వారికి స్ఫూర్తిని ఇస్తున్నాయ’’ని పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 2246784)
आगंतुक पटल : 72
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
हिन्दी
,
Marathi
,
Manipuri
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam