శాస్త్ర విజ్ఞాన- సాంకేతిక విజ్ఞాన మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

సాధారణ ఊబకాయం కన్నా పొట్ట దగ్గర కొవ్వు పేరుకుపోవటం ఆరోగ్యానికి ప్రమాదకరం.. భారతీయుల్లో సన్నగా కనిపించే వారిలోనూ అంతర్గత అవయవాల చుట్టూ కొవ్వు పేరుకుపోయే అవకాశం ఎక్కువ: డాక్టర్ జితేంద్ర సింగ్


మామూలుగా కనిపించే వ్యక్తుల్లోనూ పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోవటం వల్ల మధుమేహం, రక్తపోటు, గుండె సంబంధిత వ్యాధులు, ఫ్యాటీ లివర్, కొలెస్ట్రాల్ వంటి పలు సమస్యలకు అవకాశం: డాక్టర్ జితేంద్ర సింగ్

"గుండె సంబంధిత వ్యాధుల్లో స్థూలకాయం, లిపిడ్ నిర్వహణ"పై సమగ్ర పుస్తకాన్ని విడుదల చేసిన కేంద్రమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్

అవగాహన పెంపొందించటం, జీవనశైలి మార్పులపై ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సందేశాన్ని ప్రతిబింబించే పుస్తకం: డాక్టర్ జితేంద్ర సింగ్

నాడు పోస్టు చేయడమైనది: 29 MAR 2026 5:08PM by PIB Hyderabad

సాధారణ ఊబకాయం కన్నా పొట్ట భాగంలో కొవ్వు పేరుకుపోవటం అత్యంత ప్రమాదకరమని కేంద్ర శాస్త్రసాంకేతికభూవిజ్ఞాన శాస్త్ర శాఖ సహాయమంత్రి (స్వతంత్ర బాధ్యత), ప్రధానమంత్రి కార్యాలయంసిబ్బందిప్రజా ఫిర్యాదులుపెన్షన్లుఅణుశక్తిఅంతరిక్ష విభాగాల సహాయమంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ అన్నారుముఖ్యంగా భారతీయుల్లో సన్నగా కనిపించే వ్యక్తుల్లోనూ అంతర్గత అవయవాల చుట్టూ కొవ్వు పేరుకుపోయే అవకాశం ఎక్కువగా ఉందని హెచ్చరించారుఊబకాయంతో సంబంధం లేకుండా కేవలం పొట్ట దగ్గర పెరిగే కొవ్వు ఆరోగ్యానికి ప్రమాదంగా మారుతుందని తెలిపారు.

"సీవీడీలో స్థూలకాయంలిపిడ్ నిర్వహణలో పురోగతులుసమగ్ర పాఠ్య పుస్తకాన్ని డాక్టర్ జితేంద్ర సింగ్ విడుదల చేశారుఈ సందర్భంగా మాట్లాడుతూ.. పొట్ట దగ్గర పేరుకుపోయే కొవ్వులావుగా కనిపించని వ్యక్తుల్లోనూ జీర్ణక్రియ సంబంధిత సమస్యలకు దారితీస్తుందన్నారుదీనివల్ల మధుమేహంరక్తపోటుగుండె సంబంధిత వ్యాధులుఫ్యాటీ లివర్కొలెస్ట్రాల్ వంటి సమస్యలు వచ్చే ప్రమాదముందని చెప్పారు.

భారతీయుల శరీరతత్వం గురించి ప్రస్తావిస్తూ.. పురుషులుమహిళల్లోనూ ఊబకాయం పెరుగుతున్నప్పటికీపొట్ట వద్ద కొవ్వు పేరుకుపోవటం అత్యంత ఆందోళకరమని మంత్రి అన్నారుఇది ఇతర సమస్యలతో సంబంధం లేకుండా గుండెజీర్ణక్రియ వ్యాధుల ముప్పును పెంచుతుందని చెప్పారుసాధారణంగా ఊబకాయులు కావప్పటికీకేవలం పొట్ట భాగంలో మాత్రమే కొవ్వు పేరుకుపోవటం వల్ల అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఉందని.. ఈ పరిస్థితిని ముందుగానే గుర్తించి చికిత్సనివారణా చర్యలు చేపట్టటం అవసరమని స్పష్టం చేశారు.

సకాలంలోసందర్భోచితంగా ఈ పుస్తకం ఉన్నట్లు డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారుదేశంలో పెరిగిపోతున్న ఊబకాయం సమస్యను పరిష్కరించాలన్న జాతీయ ప్రాధాన్యతకు అనుగుణంగా ఉందని పేర్కొన్నారునూనె వాడకాన్ని తగ్గించటంఅనారోగ్యకర ఆహారపు అలవాట్లలో మార్పులు వంటి జీవనశైలి సంస్కరణలపై ప్రజల్లో అవగాహన పెంచాలని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పిలుపునిచ్చినట్లు గుర్తు చేశారుఈ కార్యక్రమం "వికసిత భారత్స్వస్థ భారత్ఊబకాయ రహిత భారత్విస్తృత దార్శనికతకు అద్దం పడుతోందని వ్యాఖ్యానించారు.

పెరుగుతున్న వైద్య అవగాహన గురించి వివరిస్తూ.. ఫ్యాటీ లివర్ఇన్సులిన్ నిరోధకతచిన్న వయసులోనే గుండె సంబంధిత వ్యాధుల బారిన పడటానికిపొట్ట భాగంలోని కొవ్వుకు సంబంధాలున్నట్లు ఆధారాలున్నాయని మంత్రి తెలిపారుయువతలో టైప్-2 డయాబెటిస్గుండెపోటుజీర్ణక్రియ సంబంధిత వ్యాధులు పెరగటం.. మారుతున్న జీవనశైలిఆహారపు అలవాట్లుశారీరక శ్రమ తగ్గిపోవటాన్ని ప్రతిబింబిస్తుందని చెప్పారు.

సమతుల్య ఆరోగ్య పద్ధతుల ప్రాముఖ్యతను డాక్టర్ జితేంద్ర సింగ్ స్పష్టం చేశారుతగినంత సన్నద్ధత లేదా విశ్రాంతి లేకుండా చేసే వ్యాయామాల వంటి అశాస్త్రీయ ఫిట్‌నెస్‌ విధానాలు ఆరోగ్యానికి ముప్పు కలిగిస్తాయన్నారుస్థిరమైన జీవనశైలి క్రమశిక్షణతగినంత నిద్రశాస్త్రీయ పద్ధతుల్లో ఆరోగ్య జాగ్రత్తలు తీసుకోవటం అవసరమని చెప్పారు.

ప్రముఖ గుండె వైద్య నిపుణుడు డాక్టర్ హెచ్.కెచోప్రా సంపాదకత్వంలో వెలువడిన ఈ పాఠ్య పుస్తకం.. భారత్‌విదేశాలకు చెందిన 300 మందికి పైగా రచయితల నుంచి అత్యాధునిక పరిశోధనల సమాహారంఇది జీర్ణక్రియ చికిత్సలులిపిడ్ నిర్వహణడిజిటల్ ఆరోగ్యంఏఐ ఆధారిత వైద్య నిర్ణయ వ్యవస్థల్లోని పురోగతులను సమన్వయం చేస్తూ.. సాంప్రదాయ ప్రమాద కారక ఆధారిత నిర్వహణ నుంచి కచ్చితమైన నివారణ వైపు మార్పును సూచిస్తుంది.

సెమాగ్లుటైడ్, టిర్జెపటైడ్ వంటి జీఎల్‌పీ-1 రిసెప్టర్ అగోనిస్ట్‌లతో అభివృద్ధి చెందుతున్న చికిత్సలను ఈ పుస్తకం సమగ్రంగా వివరిస్తుందివీటితో పాటు స్టాటిన్లుఎజెటిమిబ్బెంపెడోయిక్ యాసిడ్పీసీఎస్‌కేఇన్‌హిబిటర్లుఇంక్లిసిరాన్అఫెరిసిస్జన్యుపరమైన పరిష్కారాలతో లిపిడ్‌ను తగ్గించే వ్యూహాలు ఇందులో ఉన్నాయిఈ పురోగతులు గుండె సంబంధిత ఫలితాలను మెరుగుపరిచివ్యాధి ప్రభావాన్ని తగ్గించే అవకాశముంది.

భారత్‌లో, ప్రపంచవ్యాప్తంగా గుండె సంబంధిత వ్యాధులుమరణాలు పెరగటానికి ఊబకాయంరక్తంలో కొలెస్ట్రాల్ పెరగటం వంటి ప్రధాన ఆరోగ్య సవాళ్లు ఈ పుస్తక పీఠికలో ఉన్నాయని డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారుఈ సవాళ్లను సమర్థవంతంగా ఎదుర్కోవటానికి అవగాహన పెంచటంనివారణ వ్యూహాలను రూపొందించటంఆధారాలతో కూడిన వైద్య విధానాల ఆవశ్యకతను ఆయన స్పష్టం చేశారు.

2050 నాటికి భారత్‌లో ఊబకాయం విపరీతంగా పెరుగుతుందన్న అంచనాలను ప్రస్తావిస్తూ.. దీర్ఘకాలిక ఆరోగ్యఆర్థిక నష్టాలను తగ్గించేందుకు అవగాహనను పెంచటంముందస్తు పరీక్షలు నిర్వహించటంఆరోగ్య సంరక్షణకు నివారణ చర్యలను బలోపేతం చేయాలని డాక్టర్ జితేంద్ర సింగ్ పిలుపునిచ్చారు.

ఈ పుస్తకంలో 23 విభాగాలు, 172 అధ్యాయాలున్నాయిఇది పరిశోధనలకురోగులకు అందించే చికిత్సకు మధ్య వారధిగా ఉంటూ సమగ్రమైనఆధారాలతో కూడిన వైద్య వనరుగా నిలుస్తుందిఇది వైద్య సామర్థ్య పెంపునకువైద్య నైపుణ్యానికిరోగుల ఆరోగ్య ఫలితాలను మెరుగుపరచటానికి గణనీయంగా దోహదపడుతుందని భావిస్తున్నారు.

 

***

ప్రపంచ స్థాయి నైపుణ్యాన్ని ఒక ప్రామాణిక పుస్తకంగా తీసుకురావటంలో డాక్టర్ హెచ్.కెచోప్రాఎడిటోరియల్ బృందం చూపిన విద్యాపరమైన నాయకత్వాన్నివారి కృషిని డాక్టర్ జితేంద్ర సింగ్ అభినందించారుఈ కార్యక్రమంలో ప్రముఖ గుండె వైద్య నిపుణులుసహచరులు.. డాక్టర్ వివేక కుమార్డాక్టర్ ప్రవీణ్ చంద్రడాక్టర్ జేపీఎస్ సాహ్నిడాక్టర్ మోనా భాటియాడాక్టర్ అను గ్రోవర్శ్రీకాంత్ భాటియాఆనంద్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.


(రిలీజ్ ఐడి: 2246767) సందర్శకుల సూచీ సంఖ్య : : 10
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: हिन्दी , English , Urdu , Marathi , Gujarati