రక్ష‌ణ మంత్రిత్వ శాఖ‌
azadi ka amrit mahotsav

కొచ్చిలోని దక్షిణ నౌకాదళ కేంద్రంలో ఐఓఎన్‌ఎస్‌ సముద్ర విన్యాసాలు (ఐఎంఈఎక్స్‌) టీటీఎక్స్‌ 2026 నిర్వహణ

నాడు పోస్టు చేయడమైనది: 29 MAR 2026 12:37PM by PIB Hyderabad

 కొచ్చిలోని దక్షిణ నౌకాదళ కమాండ్‌కు చెందిన మారిటైమ్ వార్‌ఫేర్ సెంటర్‌లో ఐఓఎన్‌ఎస్‌ సముద్ర విన్యాసాలు టీటీఎక్స్‌ను 2026ను భారత నౌకాదళం నిర్వహించిందిమార్చి 27, 2026న జరిగిన ఈ ఉన్నత స్థాయి సమావేశంలో హిందూ మహాసముద్ర నౌకాదళ సదస్సు (ఐఎఎన్‌ఎస్‌సభ్య దేశాల నౌకా దళాల ప్రతినిధులుఐఓఎస్ సాగర్‌కు చెందిన అంతర్జాతీయ అధికారులుభారత నౌకాదళ అధికారులు పాల్గొన్నారువీరందరూ హిందూ మహాసముద్ర ప్రాంతంలో రూపుదాల్చుతున్న సంప్రదాయేతర సముద్ర భద్రతా సవాళ్లపై చర్చించారు.

ఈ విన్యాసంలో బంగ్లాదేశ్ఫ్రాన్స్ఇండోనేషియాకెన్యామాల్దీవులుమారిషస్మయన్మార్సీషెల్స్సింగపూర్శ్రీలంకటాంజానియాతైమూర్-లెస్టె దేశాలు పాల్గొన్నాయిఈ విభిన్న అంతర్జాతీయ భాగస్వామ్యం.. పరస్పర విశ్వాసాన్ని పెంపొందించడానికిప్రాంతీయ సహకార సముద్ర భద్రతను బలోపేతం చేయాలనేకి ఉమ్మడి నిబద్ధతను చాటిచెబుతోందిపదహారు ఏళ్ల విరామం తర్వాత 2026-2028 కాలానికి గానూ భారత్ ఐఓఎన్ఎస్‌ అధ్యక్ష బాధ్యతలు చేపడుతున్న తరుణంలో ప్రాంతీయ సముద్ర నాయకత్వాన్ని బలోపేతం చేయడంలో ఐఎమ్ఈఎక్స్‌ టీటీఎక్స్‌ 2026 కీలక ప్రస్థానంగా నిలిచింది.

నౌకాదళాల మధ్య కార్యకలాపాల విధానాలుపరిమితులపై ఉమ్మడి అవగాహనను పెంపొందించడంసమాచార మార్పిడినిర్ణయాధికార ప్రక్రియల వంటి సమన్వయ యంత్రాంగాలను పరిశీలించడం.. ఆచరణాత్మక అన్వయం ద్వారా సముద్ర భద్రతా మార్గదర్శకాలను ధ్రువీకరించడంతో పాటు ఐఓఎన్ఎస్‌ విధానాలను నిరంతరం మెరుగుపరచడానికి మద్దతివ్వడం ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యాలు.

ప్రత్యక్ష బలగాల మోహరింపు వంటి పరిమితులు లేకుండా కృత్రిమంగా సృష్టించిన వివిధ రకాల ఆకస్మిక పరిస్థితుల పరిస్థితుల ద్వారా నిర్వహించిన ఈ విన్యాసం.. పాల్గొన్న దేశాల ప్రతినిధులు వృత్తిపరమైన భాగస్వామ్యం కోసం కొత్త మార్గాలను అన్వేషించడానికిపరస్పర విశ్వాసాన్ని మరింత పెంపొందించుకోవడానికి వీలు కల్పించిందినిర్మాణాత్మక సంభాషణలుసమష్టి బాధ్యతసముద్ర సవాళ్లకు ప్రాంతీయ పరిష్కారాల ద్వారా సహకారం అందించే కీలక వేదికగా ఐఎఎన్ఎస్‌ పాత్రను ఐఎంఈఎక్స్‌ 26 మరోసారి నిర్ధారించింది.

ఈ విన్యాసం నుంచి పొందిన అనుభవాలు హిందూ మహాసముద్ర నౌకాదళ సదస్సు వ్యవస్థను మరింత బలోపేతం చేసి.. హిందూ మహాసముద్ర ప్రాంతంలో సమన్వయంతో కూడినవేగంగా స్పందించేస్థిరమైన సముద్ర రంగాన్ని నిర్ధారిస్తాయని భావిస్తున్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2246679) సందర్శకుల సూచీ సంఖ్య : : 8
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Gujarati , Urdu , हिन्दी , Malayalam