రసాయనాలు, ఎరువుల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎరువుల అక్రమ నిల్వలు, అమ్మకాలపై ప్రభుత్వం కఠిన చర్యలు.. రైతుల ప్రయోజనాలను రక్షించేందుకు 6,900కు పైగా లైసెన్సుల రద్దు


ఫాస్ఫేటిక్, పొటాషిక్ ఎరువుల కోసం ‘పోషక-ఆధారిత రాయితీ పథకం అమలును కొనసాగిస్తున్న ప్రభుత్వం

నాడు పోస్టు చేయడమైనది: 27 MAR 2026 4:21PM by PIB Hyderabad

ఎరువుల అక్రమ నిల్వలు, దారిమళ్లింపు, అక్రమ అమ్మకాలను అరికట్టేందుకు భారత ప్రభుత్వం కఠినమైన చర్యలను అమలు చేస్తోంది. నేడు లోక్‌సభలో అడిగిన ఓ ప్రశ్నకు రసాయనాలు, ఎరువుల శాఖ సహాయ మంత్రి శ్రీమతి అనుప్రియ ఎస్. పటేల్ లిఖితపూర్వక సమాధానం ఇచ్చారు.నిత్యావసర వస్తువుల చట్టం 1955 కింద ఎరువులను అత్యవసర వస్తువులుగా ప్రకటించారని, ఎరువుల నియంత్రణ ఉత్తర్వు 1985 ప్రకారం నిబంధనలు ఉల్లంఘించే వారిపై చర్యలు తీసుకునే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వాలతో కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ సమన్వయం చేసుకుంటూ ప్రతి వారం అమలు చర్యలను పర్యవేక్షిస్తుందని, నిబంధనలు పాటించని వారిపై కఠిన చర్యలు తీసుకుంటుందని వెల్లడించారు.

దర్యాప్తు సంస్థలు ఏప్రిల్ 2025 నుంచి ఇప్పటివరకు 4,66,415 దాడులు నిర్వహించాయి. 16,246 షోకాజ్ నోటీసులు జారీ చేశాయి.6,802 లైసెన్సులను రద్దు లేదా నిలిపివేశాయి.  నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 821 పోలీసు కేసులు నమోదు చేశాయి. ముఖ్యంగా ఫిబ్రవరి 2026లో అక్రమ నిల్వలకు సంబంధించి 28 షోకాజ్ నోటీసులు ఇవ్వగా.. 2 లైసెన్సులను రద్దు చేశారు.  2 ఎఫ్‌ఐఆర్‌లు నమోదు చేశారు.  అక్రమ పద్ధతుల నుంచి రైతులను రక్షించాలనే ప్రభుత్వ సంకల్పాన్ని ఈ చర్యలు ప్రతిబింబిస్తున్నాయి.

ప్రస్తుతం కొనసాగుతున్న రబీ 2025-26 కాలంలో దేశవ్యాప్తంగా యూరియా, డీఏపీ, ఎంఓపీ, ఎన్‌పీకేఎస్, ఎరువుల లభ్యత సరిపడా ఉందని ప్రభుత్వం స్పష్టం చేసింది.

రబీ 2025-26 కాలంలో ఎరువుల అవసరం, లభ్యత, విక్రయాలు (18 మార్చి 26 వరకు)
లక్ష మెట్రిక్ టన్నుల రూపంలో గణాంకాలు

 

రైతులకు తక్కువ ధరకే యూరియా అందేలా చూడటం కోసం యూరియా రాయితీ పథకం కింద చట్టబద్ధంగా నిర్ణయించిన గరిష్ట రిటైల్ ధరకే ప్రభుత్వం సరఫరా చేస్తోంది. ప్రస్తుతం 45 కిలోల యూరియా బస్తా ధర రూ. 242 గా ఉంది (వేప పూత చార్జీలు, పన్నులు అదనం). యూరియా తయారీ లేదా వ్యవసాయ క్షేత్రం వద్ద యూరియా దిగుమతి ఖర్చుకు, మార్కెట్‌లో విక్రయించే ధరకు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని భారత ప్రభుత్వం తయారీదారులకు లేదా దిగుమతిదారులకు రాయితీ  రూపంలో చెల్లిస్తుంది.

ఫాస్ఫేటిక్, పొటాసిక్ ఎరువుల కోసం ప్రభుత్వం పోషక ఆధారిత రాయితీ పథకాన్ని అమలు చేస్తోంది. అంతర్జాతీయ మార్కెట్‌లో ధరల హెచ్చుతగ్గులకు అనుగుణంగా రాయితీ రేట్లను సవరిస్తూ, రైతులకు భారం పడకుండా ప్రభుత్వం జాగ్రత్తలు తీసుకుంటుంది. ఎరువుల తయారీకి కావాల్సిన ముడి పదార్థాల అంతర్జాతీయ ధరలను ప్రభుత్వం నిరంతరం పర్యవేక్షిస్తుంది. రైతులకు ఫాస్పేటిక్‌, పొటాసిక్‌ ఎరువుల  సరఫరాను నిర్ధారించడానికి వార్షికంగా లేదా ఆరు నెలలకోసారి ఈ ఎన్‌బీఎస్‌ రేట్లను నిర్ణయించేటప్పుడు ఏవైనా హెచ్చుతగ్గులు ఉంటే వాటిని పరిగణనలోకి తీసుకుంటుంది.  కార్మాగారం నుంచి పొలం వరకు అయ్యే రవాణా వంటి ఇతర ఖర్చుల కోసం మెట్రిక్ టన్నుకు రూ. 3,500 అదనంగా కేటాయించారు. ఖరీఫ్ 2025, రబీ 2025-26 కాలాల కోసం దిగుమతి చేసుకున్న, దేశీయంగా తయారైన డీఏపీ, దిగుమతి చేసుకున్న టీఎస్‌పీ ఎరువులకు రెండిటీకి ఎన్‌బీఎస్‌ రాయితీతో పాటు అదనపు ప్రయోజనాలను పొడిగించారు.అంతర్జాతీయ ధరల హెచ్చుతగ్గుల వల్ల కలిగే లాభనష్టాలను సర్దుబాటు చేయడం, గరిష్ట రిటైల్ ధరలో ఉన్న జీఎస్టీ అంశాన్ని పరిగణనలోకి తీసుకోవడం, నికర గరిష్ట రిటైల్‌ ధరపై (జీఎస్టీ తొలగించిన తర్వాత గరిష్ట రిటైల్‌ ధర) 4 శాతం సహేతుకమైన లాభం పొందేలా నిబంధనలు రూపొందించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2246484) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Marathi , हिन्दी , Bengali , Gujarati