వాణిజ్యం, పరిశ్రమల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జన్ విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు, 2026ను లోక్‌సభలో ప్రవేశ పెట్టిన వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద


23 మంత్రిత్వ శాఖల పరిధిలోని 79 కేంద్ర చట్టాలకు చెందిన 784 నిబంధనలను సవరించాలని ప్రతిపాదన

బిల్లు ద్వారా వ్యాపారం సులభతరం కోసం నేర పరిధి నుంచి 717 నిబంధనల తొలగింపు; జీవన సౌలభ్యం కోసం 67 సవరణలు

నాడు పోస్టు చేయడమైనది: 27 MAR 2026 6:38PM by PIB Hyderabad

జన్ విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు, 2026ను వాణిజ్య, పరిశ్రమల శాఖ సహాయ మంత్రి శ్రీ జితిన్ ప్రసాద ఈరోజు లోక్‌సభలో ప్రవేశపెట్టారు. అంతకుముందు ఈ బిల్లుకు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. 

వ్యాపార నిర్వహణను సులభతరం చేయడానికి, ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలలో ఈ బిల్లు ఒక ముఖ్యమైన మైలురాయి.  విశ్వసనీయత, సరైన నియంత్రణపై ఆధారపడిన పాలన వ్యవస్థను ఇది ముందుకు తీసుకెళ్తుంది.

బిల్లు ఉద్దేశాలు

  • 23 మంత్రిత్వ శాఖల పరిధిలోని 79 కేంద్ర చట్టాలకు చెందిన 784 నిబంధనలను సవరించాలని ప్రతిపాదించారు.

  • వ్యాపార నిర్వహణను సులభతరం చేయడానికి 717 నిబంధనలను నేరరహితం చేస్తారు. 

  • ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడానికి  67 నిబంధనలను సవరించాలని ప్రతిపాదించారు

పాతపడిపోయిన, అనవసరమైన వెయ్యికి పైగా నిబంధనలను హేతుబద్ధం చేయడం ద్వారా ఈ బిల్లు నియంత్రణ వ్యవస్థను మెరుగుపరుస్తుంది.

ఈ బిల్లు చిన్నపాటి, సాంకేతిక లేదా విధానపరమైన లోపాలకు విధించే క్రిమినల్ శిక్షల నుంచి  సివిల్, పరిపాలనాపరమైన అమలు యంత్రాంగాల వైపు మార్పును ప్రతిపాదిస్తోంది. దీనిలోని ప్రధాన చర్యలు:

  • జైలు శిక్షల నిబంధనల స్థానంలో ఆర్థిక జరిమానాలు లేదా హెచ్చరికలను ప్రవేశపెడుతున్నారు.

  • మొదటిసారి నిబంధనల ఉల్లంఘనలకు హెచ్చరికలతో  వదిలివేయడం సహా, క్రమబద్ధమైన అమలు యంత్రాంగాలను ప్రవేశపెడుతున్నారు.

  • తప్పు తీవ్రతను బట్టి  జరిమానాలు శిక్షలను హేతుబద్ధం చేస్తారు. 

సమర్థవంతమైన, నిర్ణీత గడువు ప్రకారం అమలు కోసం బిల్లులో ఈ క్రింది అంశాలను చేర్చారు. 

  • అడ్జుడికేటింగ్ ఆఫీసర్ల నియామకం 

  • అప్పీలేట్ అథారిటీల ఏర్పాటు

ఈ చర్యలు కేసుల వేగవంతమైన పరిష్కారానికి, న్యాయస్థానాలపై వ్యాజ్యాల భారాన్ని తగ్గించడానికి దోహదపడతాయి. సహజ న్యాయ సూత్రాలకు ఎటువంటి భంగం కలగకుండా ఈ ప్రక్రియ సాగుతుంది.

ఈ బిల్లులో 67 సవరణలను ఈ క్రింది చట్టాల కింద ప్రతిపాదించారు:

  • న్యూఢిల్లీ మున్సిపల్ కౌన్సిల్ చట్టం, 1994 

  • మోటారు వాహనాల చట్టం, 1988

మున్సిపల్ పన్నులు,  వాహనాలకు సంబంధించిన నిబంధనల అమలులో ఎదురయ్యే చిక్కులను తొలగించి, సామాన్య ప్రజలకు సౌకర్యవంతమైన సేవలను అందించడమే ఈ సవరణల ప్రధాన ఉద్దేశ్యం.

సంప్రదింపుల విధానం 

ప్రతిపాదిత సంస్కరణలు అంతర్ మంత్రిత్వ కమిటీ సమావేశాలు, నీతి ఆయోగ్ ఆధ్వర్యంలో ఉన్న ఉన్నతస్థాయి కమిటీ సమావేశాలు, పరిశ్రమ సంఘాలతో పరస్పర చర్యలు, పౌర సమాజ సంస్థలతో చర్చలు వంటి సమగ్ర సంప్రదింపుల ప్రక్రియపై ఆధారపడి ఉన్నాయి.

జన్ విశ్వాస్ (సవరణ) బిల్లు, 2025 పై ఏర్పాటైన సెలెక్ట్ కమిటీ  ఒక సమగ్రమైన సంప్రదింపుల ప్రక్రియను చేపట్టింది. ఇందులో కమిటీ సభ్యులు, సంబంధిత మంత్రిత్వ శాఖలు, బయటి భాగస్వాములు, విషయ నిపుణులతో కలిసి మొత్తం 49 సమావేశాలను నిర్వహించారు.

నమ్మకంపై ఆధారపడిన పాలన 

ఈ బిల్లు, నమ్మకంపై ఆధారపడిన చట్టపరమైన, నిబంధనల అమలు వాతావరణాన్ని పెంపొందించడంలో ప్రభుత్వానికి ఉన్న నిబద్ధతను ప్రతిబింబిస్తుంది. ఇందులో పౌరులు, వ్యాపార సంస్థలపై చిన్నపాటి నిబంధనల ఉల్లంఘనలకు క్రిమినల్ శిక్షలు ఉండవు. క్రిమినల్ నిబంధనల భారాన్ని తగ్గించడం నియంత్రణ ప్రక్రియలను సరళతరం చేయడం ద్వారా ఈ బిల్లు నిబంధనల పాటింపును మెరుగుపరుస్తుందని, పెట్టుబడులను ప్రోత్సహిస్తుందని, ఆర్థిక వృద్ధిని బలోపేతం చేస్తుందని భావిస్తున్నారు

చిన్నపాటి నేరాలను నేర రహితం చేసే సంస్కరణాత్మక చొరవపై ఆధారపడి ప్రస్తుత బిల్లు,ను రూపొందించారు. ఈ ప్రక్రియ జన్ విశ్వాస్ చట్టం, 2023 తో ప్రారంభమైంది, ఇది 19 మంత్రిత్వ శాఖలు/విభాగాల పరిధిలోని 42 కేంద్ర చట్టాలలో ఉన్న 183 నిబంధనలను నేర విముక్తం చేసింది. దీనిని కొనసాగిస్తూ, జన్ విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు, 2025 ను 18 ఆగస్టు 2025న లోక్‌సభలో ప్రవేశపెట్టారు. 2025 నాటి ఈ బిల్లు, 10 మంత్రిత్వ శాఖలు/విభాగాల పరిధిలోని 16 కేంద్ర చట్టాలలో గల 355 నిబంధనలకు సవరణలను ప్రతిపాదించింది.  దీనిని సెలెక్ట్ కమిటీకి పంపారు. 

శ్రీ తేజస్వి సూర్య అధ్యక్షతన ఏర్పడిన సెలెక్ట్ కమిటీ 49 సమావేశాలను నిర్వహించి 13 మార్చి 2026న లోక్‌సభకు తన నివేదికను సమర్పించింది. ఈ కమిటీ విస్తృతమైన సంప్రదింపులు జరిపి, పరిశీలనలో ఉన్న నిబంధనలతో పాటు, అదే చట్టాలలోని మరిన్ని నిబంధనలను కూడా పరీక్షించింది. అదనంగా 62 కేంద్ర చట్టాలలో క్రిమినల్ శిక్షలను రద్దు చేయాలని సిఫారసు చేసింది.

దీనిని అనుసరించి, జన్ విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు, 2025 ను ఉపసంహరించి దాని స్థానంలో జన్ విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు, 2026 ను ఈరోజు లోక్‌సభలో ప్రవేశ పెట్టారు.:

ముగింపు

జన్ విశ్వాస్ (నిబంధనల సవరణ) బిల్లు, 2026 భారత నియంత్రణ వ్యవస్థను ఆధునీకరించడం లో, అంతర్జాతీయంగా ఆమోదం పొందిన సముచిత, ప్రతికూల ఆధారిత నియంత్రణ సూత్రాలకు అనుగుణంగా మార్చడంలో ఒక ముఖ్యమైన అడుగును సూచిస్తుంది. ఈ బిల్లు దేశంలో వ్యాపారం నిర్వహణ సౌలభ్యాన్ని, జీవన సౌలభ్యాన్ని  మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషించనుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2246479) సందర్శకుల సూచీ సంఖ్య : : 18
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , हिन्दी , Gujarati