సాంఘిక న్యాయం, మరియు సాధికారత మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఎన్‌సీబీసీ అధ్యక్షురాలిగా బాధ్యతలు చేపట్టిన సాధ్వి నిరంజన్‌ జ్యోతి

నాడు పోస్టు చేయడమైనది: 27 MAR 2026 2:35PM by PIB Hyderabad

జాతీయ వెనుకబడిన తరగతుల సంఘం (ఎన్‌సీబీసీ) చైర్‌పర్సన్‌గా సాధ్వి నిరంజన్ జ్యోతి (18 మార్చి 2026 నుంచి ), కమిషన్‌ సభ్యురాలిగా శ్రీమతి కిరణ్ ఉమేష్ మహల్లే (20 మార్చి 2026 నుంచి) బాధ్యతలు స్వీకరించారు.

సాధ్వి నిరంజన్ జ్యోతి మాజీ పార్లమెంటు సభ్యురాలు. ఆమె గతంలో కేంద్ర గ్రామీణాభివృద్ధి శాఖ, వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, ప్రజా పంపిణీ శాఖల్లో కేంద్ర సహాయ మంత్రిగా పనిచేయడంతోపాటు అనేక ముఖ్య ప్రభుత్వ పదవులను నిర్వహించారు. సమాజంలోని బలహీన, అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం నిరంతరం సామాజిక సేవా కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రజా జీవితంలో, పాలనలో ఆమెకు ఉన్న విస్తృత అనుభవం, కమిషన్ విధులను సమర్థవంతంగా నిర్వర్తించడంలో దోహదపడుతుందని భావిస్తున్నారు.

శ్రీమతి కిరణ్ ఉమేష్ మహల్లే సామాజిక, సంస్థాగత కార్యకలాపాల్లో అపార అనుభవం కలిగినన ప్రజా ప్రతినిధి. గతంలో అమరావతి మున్సిపల్ కార్పొరేషన్ మేయర్‌గా పనిచేశారు. ప్రజా జీవితంలో వివిధ ముఖ్యమైన పదవులనూ నిర్వహించారు. మహిళా సాధికారత, సామాజిక సంక్షేమం, క్షేత్ర స్థాయి పాలనకు సంబంధించిన కార్యక్రమాల్లో ఆమె చురుగ్గా వ్యవహరిస్తున్నారు. పలు సహకార, సామాజిక సంస్థలతో ఆమెకున్న అనుబంధం.. సమ్మిళిత అభివృద్ధి పట్ల ఆమెకు ఉన్న నిబద్ధతను తెలియజేస్తుంది.

 కొత్తగా బాధ్యతలు స్వీకరించిన చైర్‌పర్సన్, సభ్యురాలికి న్యాయం, సాధికారత మంత్రిత్వ శాఖ సాదర స్వాగతం పలికింది. దేశవ్యాప్తంగా  వెనుకబడిన తరగతుల సంక్షేమం, రక్షణ, సామాజిక-ఆర్థిక అభివృద్ధి కోసం కమిషన్ చేసే కృషిలో వీరి మార్గదర్శకత్వం, అంకితభావంతో కూడిన సేవలు ఎంతో కీలకమని మంత్రిత్వ శాఖ పేర్కొంది.

 

***


(రిలీజ్ ఐడి: 2246051) సందర్శకుల సూచీ సంఖ్య : : 110
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Gujarati