రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

శ్రీ రామ నవమి సందర్భంగా రాష్ట్రపతి శుభాకాంక్షలు

నాడు పోస్టు చేయడమైనది: 25 MAR 2026 4:24PM by PIB Hyderabad

శ్రీ రామ నవమి పండుగ సందర్భంగా దేశ పౌరులందరికీ భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలిపారు.

రాష్ట్రపతి తన సందేశంలో.. ‘‘శ్రీరామ నవమి పర్వదిన సందర్భంగా దేశ పౌరులందరికీవిదేశాల్లో నివసిస్తున్న భారతీయులందరికీ నా హృదయ పూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

మర్యాద పురుషోత్తముడైన భగవాన్ శ్రీరాముని జన్మదినోత్సవాన్ని పురస్కరించుకుని ఈ పండుగను జరుపుకుంటాంఅర్థవంతమైన జీవితం కోసం మనల్ని సత్యంన్యాయంధర్మ మార్గంలో నడవమని శ్రీరాముడి మహోన్నత జీవిత ప్రయాణం మార్గనిర్దేశం చేస్తుందిసమాజం పట్ల మన కర్తవ్యాలను నిర్వర్తించడానికి శ్రీరాముడి జీవితం మనకు స్ఫూర్తినిస్తుంది.  ఆయన ఆదర్శాలు మన సంస్కృతికి పునాదివాటిని పాటిస్తూ జీవించడానికి మనం నిరంతరం కృషి చేయాలి.

ఈ శుభ సందర్భంగా భగవాన్ శ్రీరాముని మహగాథలోని బోధనలను అలవర్చుకొని.. మన ఆలోచనలుమాటలుపనులతో దేశానికి సేవ చేస్తామని ప్రతిజ్ఞ చేద్దాం” అని తెలిపారు.

 

***


(రిలీజ్ ఐడి: 2245330) సందర్శకుల సూచీ సంఖ్య : : 27
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Urdu , English , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Punjabi , Gujarati