హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

రాష్ట్రంలో ఉమ్మడి పౌర స్మృతి బిల్లు ఆమోదానికి మద్దతిచ్చిన గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్, ఎమ్మెల్యేలందరినీ అభినందించిన కేంద్ర హోం, సహకార మంత్రిత్వ శాఖ శ్రీ అమిత్ షా


దేశంలోని పౌరులందరికీ ఒకే విధమైన చట్టాన్ని అందించడం మా పార్టీ ఆవిర్భావం నుంచి పాటిస్తున్న నిబద్ధత

ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో మా పార్టీకి చెందిన రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా నిరంతరం ముందుకు సాగుతున్నాయి

ఉత్తరాఖండ్ తర్వాత గుజరాత్ కూడా చారిత్రాత్మక ఉమ్మడి పౌర స్మృతి బిల్లును ఆమోదించి తన నిబద్ధతను చాటుకున్నందుకు నేను సంతోషిస్తున్నాను

దేశాన్ని బుజ్జగింపు రాజకీయాల ఆధారంగా కాకుండా, పౌరులందరికీ సమానమైన చట్టాల ద్వారా పరిపాలించాలి.. ఇదే మా ప్రాధాన్యత, నిబద్ధత కూడా

నాడు పోస్టు చేయడమైనది: 25 MAR 2026 2:34PM by PIB Hyderabad

రాష్ట్రంలో ఉమ్మడి పౌరస్మృతి బిల్లు ఆమోదానికి మద్దతు తెలిపినందుకు గుజరాత్ ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్‌కుఇతర శాసనసభ్యులందరికీ కేంద్ర హోంసహకార శాఖ మంత్రి శ్రీ అమిత్ షా అభినందనలు తెలిపారు.

సామాజిక మాధ్యమం ఎక్స్ లో చేసిన పోస్టులో  శ్రీ అమిత్ షా ఇలా పేర్కొన్నారు. ‘‘దేశంలోని ప్రతి పౌరుడికి ఒకే విధమైన చట్టాన్ని అందించడం మా పార్టీ ఆవిర్భావం నుంచి మాకున్న నిబద్ధతప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ నాయకత్వంలో మా పార్టీకి చెందిన రాష్ట్ర ప్రభుత్వాలు ఈ దిశగా నిరంతరం ముందుకు సాగుతున్నాయిఉత్తరాఖండ్ తర్వాత గుజరాత్ కూడా ఈ చారిత్రాత్మక ఉమ్మడి పౌరస్మృతి బిల్లును ఆమోదించి తన నిబద్ధతను చాటుకున్నందుకు నేను ఎంతో సంతోషిస్తున్నానుఈ బిల్లు ఆమోదం పొందినందుకు ముఖ్యమంత్రి శ్రీ భూపేంద్ర పటేల్‌కుబిల్లుకు మద్దతునిచ్చిన ఎమ్మెల్యేలందరికీ నా అభినందనలుదేశాన్ని బుజ్జగింపు రాజకీయల ప్రాతిపదికన కాకుండాపౌరులందరినీ సమాన చట్టాల ద్వారా పరిపాలించాలిఇదే మా ప్రాధాన్యతనిబద్ధత కూడా’’.

 

***


(రిలీజ్ ఐడి: 2245033) సందర్శకుల సూచీ సంఖ్య : : 20
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Assamese , Punjabi , Gujarati , Kannada