ప్రధాన మంత్రి కార్యాలయం
పశ్చిమాసియా పరిస్థితులపై అమెరికా అధ్యక్షుడి నుంచి ప్రధానమంత్రికి ఫోన్ కాల్
నాడు పోస్టు చేయడమైనది:
24 MAR 2026 8:48PM by PIB Hyderabad
అమెరికా అధ్యక్షుడు శ్రీ డొనాల్డ్ జె ట్రంప్ నుంచి ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీకి ఫోన్ కాల్ వచ్చింది.
పశ్చిమాసియాలో మారుతున్న పరిస్థితులపై ఇరువురు నేతలు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. ఈ ప్రాంతంలో ఉద్రిక్తతలు తగ్గించడానికి, వీలైనంత త్వరగా శాంతి పునరుద్ధరణ జరగాలని భారతదేశం ఆకాంక్షిస్తోందని ప్రధానమంత్రి పునరుద్ఘాటించారు.
హర్మూజ్ జలసంధి తెరిచి, సురక్షితంగా అందుబాటులో ఉండేలా చూడటం ముఖ్యమని ప్రధానమంత్రి తెలిపారు. ఇది ప్రపంచ శాంతికి, స్థిరత్వానికి, ఆర్థిక శ్రేయస్సుకు అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.
ఈ ప్రాంతంలో శాంతిని నెలకొల్పేందుకు,స్థిరత్వాన్ని పెంపొందించేందుకు జరుగుతున్న ప్రయత్నాలపై సంప్రదింపులు కొనసాగించడానికి ఇద్దరు నాయకులు అంగీకరించారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో శ్రీ మోదీ ఇలా పేర్కొన్నారు.
“అధ్యక్షుడు ట్రంప్ నుంచి కాల్ వచ్చింది. పశ్చిమాసియాలో నెలకొన్న పరిస్థితులపై మేం చర్చించాం, మా అభిప్రాయాలను పంచుకున్నాం. ఉద్రిక్తతలు తగ్గి, త్వరగా శాంతి నెలకొనాలని భారత్ కోరుకుంటోంది. హర్మూజ్ జలసంధి తెరిచి ఉండటం, సురక్షితంగా ఉండటం ప్రపంచం మొత్తానికి అవసరం. ప్రాంతీయ శాంతి, స్థిరత్వం కోసం చేసే ప్రయత్నాలపై మేం నిరంతరం సంప్రదింపులు జరుపుతామని అంగీకరించాం.’’
(రిలీజ్ ఐడి: 2244773)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10