ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఏబీ-పీఎమ్‌జేఏవై కి సంబంధించిన తాజా సమాచారం


• ఈ పథకంలో జాబితాలో చేర్చిన ఆసుపత్రుల సంఖ్య 2026 ఫిబ్రవరి 28 నాటికి 36,229… వృద్ధి అయిదు రెట్లు

• ఈ పథకంలో 11.69 కోట్ల ఆసుపత్రి చేరికలు అధీకృతం.. వాటిలో ప్రయివేటు ఆసుపత్రుల్లో చేరికలు 6.74 కోట్లు

నాడు పోస్టు చేయడమైనది: 23 MAR 2026 12:47PM by PIB Hyderabad

ఆయుష్మాన్ భారత్ ప్రధాన్ మంత్రీ జన్ ఆరోగ్య యోజన (ఏబీ-పీఎమ్‌జేఏవైపథకంలో భాగంగా నమోదైన ఆసుపత్రులు అర్హత కలిగిన లబ్ధిదారులకు వైద్య చికిత్సను నిరాకరించరాదు.

చికిత్సను పొందడంలో ఏవైనా సమస్యలు ఎదురైనాచికిత్స చేయడానికి ఆస్పత్రి నిరాకరించినా- లబ్ధిదారులు కేంద్రీకృత ఫిర్యాదు పరిష్కార నిర్వహణ వ్యవస్థ (సీజీఆర్ఎమ్ఎస్దృష్టికిగానీహెల్ప్‌లైన్ సంఖ్య 14555 కి ఫోన్ చేసిగానీ ఫిర్యాదు చేయవచ్చునుఫిర్యాదుల్ని ఏబీ-పీఎమ్‌జేఏవైలో భాగంగా జిల్లారాష్ట్రంజాతీయ స్థాయుల్లోని మూడంచెల యంత్రాంగం పర్యవేక్షిస్తుంది. ప్రతి ఒక్క స్థాయిలోనూ ఫిర్యాదుల్ని పరిశీలించిపరిష్కరించడానికి ప్రత్యేక నోడల్ అధికారులతో పాటు ఫిర్యాదు పరిష్కార సంఘాలను కూడా నియమించారు.
ఏబీ-పీఎమ్‌జేఏవై పథకం కిందికి అనేక ఆస్పత్రులను అందుబాటులోకి తెస్తున్నారుపథకాన్ని అమలు చేసే రాష్ట్రంలేదా కేంద్ర పాలిత ప్రాంతం.. జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ (నేషనల్ హెల్త్ అథారిటీనిర్దేశించిన ఎంప్యానల్‌మెంట్ మార్గదర్శకాల్లో పేర్కొన్న నిబంధనలకు అనుగుణంగా ఉన్న ఆసుపత్రులు లభ్యతఅవసరాల ఆధారంగా ఈ ప్రక్రియ నిరంతరం కొనసాగుతోంది. ఈ పథకంలోప్రయివేటు ఆసుపత్రుల్ని జాబితాలో చేర్చే ప్రక్రియ పూర్తి స్వచ్ఛందంగా అమలవుతుంది.
ఈ పథకం కింద జాబితాలో చేర్చిన ఆసుపత్రుల సంఖ్య 2018-19 ఆర్థిక సంవత్సరంలో 6,917 ఆసుపత్రులుగా (వీటిలో 3,013 ప్రభుత్వ, 3,904 ప్రయివేటుఉండగా, 2026 ఫిబ్రవరి 28 నాటికి 36,229కి (వీటిలో 19,483 ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు 16,746 ప్రయివేటు ఆసుపత్రులుపెరిగాయిదేశమంతటా విస్తరించిన ఈ 36,229 నమోదైన ఆసుపత్రుల్లో  అర్హులైన లబ్ధిదారులు వైద్య చికిత్సను పొందవచ్చును.
ఈ సంవత్సరం ఫిబ్రవరి నెలాఖరు నాటికి మొత్తం 11.69 కోట్ల ఆసుపత్రి ప్రవేశాలను ఆమోదించారు. వీటిలో 6.74 కోట్ల ప్రవేశాలు ప్రయివేటు ఆసుపత్రులకు సంబంధించినవి.
ఈ పథకంలోక్లెయిముల సెటిల్‌మెంటు క్రమం తప్పకనిర్నిరోధంగా సాగుతుందిక్లెయిములను సంబంధిత రాష్ట్ర ఆరోగ్య ఏజెన్సీలు నేషనల్ హెల్త్ అథారిటీ జారీ చేసిన క్లెయిముల న్యాయ నిర్ణయ సంబంధిత మార్గదర్శకాల్ని అనుసరించి పరిష్కరిస్తాయిక్లెయిములు సకాలంలో పరిష్కారం కావడానికి ఆమోదించిన టర్నరౌండ్ అవధిని అంతర్ రాష్ట్ర ఆసుపత్రుల (రాష్ట్రం లోపల నెలకొన్న ఆసుపత్రులవిషయంలో క్లెయిమును సమర్పించిన 15 రోజుల లోపలపోర్టబులిటీ క్లెయిముల (రాష్ట్రం బయట నెలకొన్న ఆసుపత్రులవిషయంలో అయితే క్లెయిమును దాఖలు చేసిన 30 రోజుల లోపల గానూ నిర్ధారించారుఈ పథకంలో భాగంగాజాబితాలో చేర్చిన ఆసుపత్రులు సమర్పించిన క్లెయిములను రోగచికిత్స సంబంధి పత్రాలుపరీక్షా నివేదికలతో పాటు ఇతర సహాయక రికార్డులను ఆధారం చేసుకొనినిర్దిష్ట ప్రామాణిక చికిత్స మార్గదర్శకాలకు అనుగుణంగా పరిశీలిస్తారు.
ఈ సమాచారాన్ని కేంద్ర ఆరోగ్యకుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్‌రావ్ జాదవ్ ఈ రోజు లోక్‌సభలో ఒక లిఖితపూర్వక సమాధానంలో తెలియజేశారు.

 

***


(రిలీజ్ ఐడి: 2243880) సందర్శకుల సూచీ సంఖ్య : : 18
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Kannada , English , Urdu , हिन्दी , Marathi