విద్యుత్తు మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

భారత్ ఎలక్ట్రిసిటీ సమ్మిట్-2026లో భాగంగా రాష్ట్రాలు, యూటీల మంత్రులతో విద్యుత్ శాఖ మంత్రి అధ్యక్షతన సమావేశం


ఇంధన భద్రత ఈ సమావేశ ప్రధాన లక్ష్యం.. అవసరమైన సంస్కరణలను రాష్ట్రాలు అమలు చేసేందుకు కేంద్ర ప్రభుత్వ మద్దతు: శ్రీ మనోహర్ లాల్

2024-25 ఆర్థిక సంవత్సరానికి డిస్కంల వినియోగదారుల సేవా రేటింగ్స్, పంపిణీ సంస్థల ర్యాంకింగ్ నివేదికల విడుదల

నాడు పోస్టు చేయడమైనది: 20 MAR 2026 1:32PM by PIB Hyderabad

భారత్ ఎలక్ట్రిసిటీ సమ్మిట్-2026లో భాగంగా రెండో రోజున (20.03.2026) కేంద్ర విద్యుత్ శాఖ మంత్రి శ్రీ మనోహర్ లాల్ అధ్యక్షతన దేశవ్యాప్తంగా ఉన్న విద్యుత్ శాఖ మంత్రుల సమావేశం జరిగింది.

విద్యుత్నూతనపునరుత్పాదక ఇంధన శాఖ సహాయమంత్రి శ్రీ శ్రీపాద నాయక్ సహ-అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో చండీగఢ్ అడ్మినిస్ట్రేటర్పంజాబ్ గవర్నర్ శ్రీ గులాబ్ చంద్ కటారియాకేంద్ర విద్యుత్ శాఖ కార్యదర్శి శ్రీ పంకజ్ అగర్వాల్.. నూతనపునరుత్పాదక ఇంధన శాఖ (ఎంఎన్ఆర్ఈకార్యదర్శి శ్రీ సంతోష్ కుమార్ సారంగితో పాటు వివిధ రాష్ట్రాలుయూటీలకు చెందిన ఇంధన శాఖ మంత్రులుఉన్నతాధికారులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

ఈ సమావేశాన్ని ఉద్దేశించి శ్రీ మనోహర్ లాల్ ప్రసంగిస్తూ.. వికసిత్ భారత్ 2047 లక్ష్యాన్ని సాధించటంలో బీఈఎస్- 2026 కీలక పాత్ర పోషిస్తుందన్నారుఆర్థిక వృద్ధికిమౌలిక సదుపాయాలకు విద్యుత్ అత్యంత ప్రాథమిక అవసరమని స్పష్టం చేశారు. 520 జీడబ్ల్యూకు పైగా నిర్దేశిత విద్యుత్ సామర్థ్యాన్ని చేరుకోవటండిస్కంల పనితీరుని మెరుగుపరచటంభారీగా స్మార్ట్ మీటర్ల ఏర్పాటువిద్యుత్ కొరతను గణనీయంగా తగ్గించటం వంటి భారత విజయాలను ఆయన ప్రత్యేకంగా ప్రస్తావించారు.

అందుబాటు ధరల్లో నాణ్యమైన విద్యుదుత్పత్తిసరఫరాపంపిణీ చేసేందుకు కేంద్రరాష్ట్రాల మధ్య సమన్వయ ప్రయత్నాలుండాలని ఆయన తెలిపారుప్రపంచవ్యాప్తంగా అనిశ్చిత పరిస్థితుల నేపథ్యంలో ఇంధన భద్రత ప్రాముఖ్యతను స్పష్టం చేస్తూతలసరి విద్యుత్ వినియోగాన్ని పెంచాల్సిన అవసరం ఉందనిపునరుత్పాదక ఇంధన వాడకాన్ని వేగవంతం చేయాలని చెప్పారుస్వచ్ఛమైన ఇంధన వనరుగా అణుశక్తిని గుర్తిస్తూశాంతి చట్టాన్ని ఈ దిశగా కీలకమైన ముందడుగుగా అభివర్ణించారు.

చట్టపరమైనపాలనాపరమైన సంస్కరణల అమలు విషయంలో రాష్ట్రాలకు కేంద్రం పూర్తి మద్దతిస్తుందని శ్రీ మనోహర్ లాల్ హామీ ఇచ్చారు.

విద్యుత్ రంగంలో సాంకేతికతకృత్రిమ మేధ పాత్రలను శ్రీ శ్రీపాద నాయక్ వివరించారుస్మార్ట్ మీటరింగ్ ఇందుకు ముఖ్యమైన ఉదాహరణ అని తెలిపారుభారతదేశ విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంలో సగం శిలాజయేతర ఇంధన వనరుల నుంచే వస్తుందని ఆయన చెప్పారువికసిత్ భారత్-2047 లక్ష్యాన్ని చేరుకునేందుకు రూపొందించిన నూతన ముసాయిదా జాతీయ విద్యుత్ విధాన ప్రాముఖ్యతను తెలిపారు.

ఇంధన భద్రతను బలోపేతం చేయటంముఖ్యంగా శిలాజయేతర ఇంధన వనరుల ద్వారా విద్యుత్ ఉత్పత్తిని పెంచటంపై ఈ సమావేశం దృష్టి సారించిందిదేశంలో పెరుగుతున్న ఇంధన అవసరాలను తీర్చేందుకు సమష్టిసమన్వయ చర్యలు ముఖ్యమని విద్యుత్ శాఖఎంఎన్ఆర్ఈ కార్యదర్శులు స్పష్టం చేశారు.

కీలక నివేదికల విడుదల

ఈ సమావేశం సందర్భంగా 2024-25 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి డిస్కంల వినియోగదారుల సేవా రేటింగ్స్ (సీఎస్ఆర్‌డీ), పంపిణీ సంస్థల ర్యాంకింగ్ (డీయూఆర్నివేదికలను విడుదల చేశారు.

డిస్కంల వినియోగదారుల సేవా రేటింగ్స్ (సీఎస్ఆర్‌డీనివేదిక

వినియోగదారుల సేవా డిస్కంల పనితీరును సీఎస్ఆర్‌డీ అంచనా వేస్తుందిఇందుకోసం ఖచ్చితమైన మీటరింగ్బిల్లింగ్సకాలంలో సమర్థవంతంగా ఫిర్యాదుల పరిష్కారంపారదర్శకమైన విద్యుత్ ధరల నిర్ధారణ వంటి ప్రాథమిక ప్రమాణాలను ఇది నిర్దేశిస్తుందివినియోగదారుల సంతృప్తిని పెంచేందుకువివిధ విభాగాల మధ్య పరస్పర అభ్యాసాన్ని ప్రోత్సహించటానికి సమగ్ర వ్యూహాన్ని రూపొందించటం ఈ నివేదిక లక్ష్యంవినియోగదారుల కేంద్రీకృత సేవలను ఇది పరిశీలిస్తుందివిద్యుత్ నిబంధనల ప్రకారం కీలక రంగాల్లో డిస్కంల పనితీరును ఇది అంచనా వేయడమే కాకనియామాలను పాటిస్తూఎలా అమలు చేస్తున్నారో పరిశీలించిఅంచనా వేస్తుంది.

నివేదిక సమాచారంవచ్చిన స్కోర్ల ప్రకారం.. డిస్కంలకు ఏడు గ్రేడ్లు.. +, బీ+, బీసీ+, సీడీలో ఒకటి కేటాయిస్తారుడిస్కంల మధ్య ఆరోగ్యకరమైన పోటీని పెంచటానికిసేవా నాణ్యతలో నిరంతరం మెరుగుదల కనబరిచేందుకు ఈ గ్రేడింగ్ విధానాన్ని రూపొందించారుమొత్తం 66 డిస్కంలను అంచనా వేయగా..6 డిస్కంలు ఏగ్రేడ్‌, 21 డిస్కంలు ఏ గ్రేడ్‌, 27 డిస్కంలు బీగ్రేడ్‌ను సాధించాయి.

అత్యుత్తమ గ్రేడ్లు సాధిస్తున్న సంస్థల సంఖ్య పెరగటంమెరుగైన సేవల ద్వారా అధిక సంఖ్యలో వినియోగదారులు లబ్ధి పొందటం ద్వారా డిస్కంల పనితీరు గణనీయంగా మెరుగుపడినట్లు స్పష్టమవుతోందిదేశీయంగా సానుకూల పురోగతికి ఇది సంకేతంమరోవైపు తక్కువ గ్రేడ్లు (సీడీపొందుతున్న డిస్కంలువినియోగదారుల సంఖ్య తగ్గటం.. దిగువ స్థాయిలోనూ సానుకూల మార్పును సూచిస్తుంది.

పంపిణీ సంస్థల ర్యాంకింగ్ (డీయూఆర్నివేదిక

దేశవ్యాప్తంగా విద్యుత్ పంపిణీ సంస్థల పనితీరును డీయూఆర్ సమగ్రంగాపక్షపాతం లేకుండా అంచనా వేస్తుందిగత నివేదికల ముఖ్యాంశాల ఆధారంగా రూపొందించిన ఈ నివేదిక.. సంప్రదాయ పనితీరు సూచికలకే పరిమితం కాకుండా బహుముఖ మూల్యాంకన విధానాన్ని అనుసరిస్తుందిసంస్థాగత సామర్థ్యంఆర్థిక స్థిరత్వంకార్యాచరణ సామర్థ్యంసేవలందించే విధానం వంటి కీలక అంశాలు ఇందులో అంతర్భాగంగా ఉన్నాయిభారతదేశ దీర్ఘకాలిక ఇంధన పరివర్తనఅభివృద్ధి లక్ష్యాలకు మద్దతుగా.. ఆర్థికంగా నిలదొక్కుకోగలిగేసమర్థవంతంగా పనిచేసేవినియోగదారులకు ప్రాధాన్యతనిచ్చే విద్యుత్ పంపిణీ వ్యవస్థను రూపొందించటానికి డీయూఆర్ కార్యక్రమం తోడ్పడుతుందిమొత్తం 66 విద్యుత్ పంపిణీ సంస్థలు ఈ ఏడాది డీయూఆర్ అంచనా ప్రక్రియలో పాల్గొన్నాయి.

DUR REPORT

CSRD REPORT

 

***


(రిలీజ్ ఐడి: 2243229) సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Manipuri , Gujarati , Kannada