ప్రధాన మంత్రి కార్యాలయం
“గుడి పడ్వా.. ఉగాది.. చేతి చాంద్.. నవ్రేహ్.. సాజిబు చెయిరోబా..” పర్వదిన సందర్భంగా ప్రజలకు ప్రధానమంత్రి శుభాకాంక్షలు
प्रविष्टि तिथि:
19 MAR 2026 8:46AM by PIB Hyderabad
దేశంలోని వివిధ రాష్ట్రాల్లో ఇవాళ “గుడి పడ్వా.. ఉగాది.. చేతి చాంద్.. నవ్రేహ్.. సాజిబు చెయిరోబా..” పర్వదినాల నేపథ్యంలో కొత్త సంవత్సర వేడుకలు నిర్వహించుకుంటున్న ప్రజలకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శుభాకాంక్షలు తెలిపారు.
ఈ మేరకు సామాజిక మాధ్యమం ‘ఎక్స్’ ద్వారా పంపిన సందేశంలో:
“గుఢీపాడవ్యాచ్యా హార్దిక్ శుభేచ్ఛా!” (గుడి పడ్వా శుభాకాంక్షలు!)
“తెలుగు ప్రజలకు ఉగాది శుభాకాంక్షలు. ఆనందోత్సాహాలతో వేడుక చేసుకోండి!”
“నిమ్మ యుగాది సడగరదిందా కుదిరాళి!” (ఉగాది పండుగను ఆనందంగా నిర్వహించుకోండి”)
“చేతి చాంద్ పర్వదిన శుభాకాంక్షలు! ఏడాది ఆద్యంతం శుభాలు నిండాలని ప్రార్థిస్తున్నాను.”
“నవ్రేహ్ పోష్టే! ఈ ఏడాదంతా ఆనందోత్సాహాలు వెల్లివిరియాలని ఆకాంక్షిస్తున్నాను.”
“సాజిబు చెయిరోబా శుభాకాంక్షలు! ఈ ఏడాది అందరికీ సంతోషం పంచాలి" అని ప్రధానమంత్రి పేర్కొన్నారు.
***
(रिलीज़ आईडी: 2242315)
आगंतुक पटल : 85
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Bengali
,
Bengali-TR
,
Assamese
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Tamil
,
Kannada
,
Malayalam