రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

చైత్ర శుక్లాది, ఉగాది, గుడి పడ్వా, చేతి చాంద్, నవ్రే, సజిబు చెయిరోబా సందర్భంగా శుభాకాంక్షలు తెలిపిన రాష్ట్రపతి

నాడు పోస్టు చేయడమైనది: 18 MAR 2026 4:27PM by PIB Hyderabad

చైత్ర శుక్లాదిఉగాదిగుడి పడ్వాచేతి చాంద్నవ్రేసజిబు చెయిరోబా పండుగల సందర్భంగా దేశ ప్రజలకు భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము శుభాకాంక్షలు తెలియజేశారు.

రాష్ట్రపతి సందేశంలో ఈ విధంగా పేర్కొన్నారు:

"చైత్ర శుక్లాదిఉగాదిగుడి పడ్వాచేతి చాంద్నవ్రేసజిబు చెయిరోబా శుభ సందర్భంగా దేశ విదేశాల్లో ఉన్న భారతీయులందరికీ నేను నా హృదయపూర్వక అభినందనలుశుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

నూతన సంవత్సర ఆగమన వేళ జరుపుకునే ఈ పండుగలు భారతదేశపు సుసంపన్నమైన సాంస్కృతిక వైవిధ్యంప్రకృతితో మనకున్న విడదీయలేని అనుబంధాన్ని చాటిచెబుతాయిఇవి కొత్త ఆశలుసరికొత్త ఆశయాలుసానుకూల దృక్పథంతో జీవితంలో ముందుకు సాగడానికి మనల్ని ప్రేరేపిస్తాయిఈ పండుగలు మన ఘనమైన సాంస్కృతిక వారసత్వానికిఇతరులతో సంతోషాన్ని పంచుకునే మన సంప్రదాయాలకు సజీవ రూపాలు.

ఈ పండుగలు ప్రేమసామరస్యాల ద్వారా భారతదేశంలోని వివిధ వర్గాల మధ్య ఐక్యతను పెంపొందించాలని.. ప్రతి ఒక్కరి జీవితాల్లో సుఖశాంతులుసిరిసంపదలుఆయురారోగ్యాలను నింపాలని కోరుకుంటున్నాను."

 

***


(రిలీజ్ ఐడి: 2242226) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Kannada