మత్స్య పరిశ్రమ, పశు పోషణ మరియు పాడి పరిశ్రమ మంత్రిత్వ శాఖ
రాష్ట్రీయ గోకుల్ మిషన్ సాధించిన విజయాలు
నాడు పోస్టు చేయడమైనది:
18 MAR 2026 11:38AM by PIB Hyderabad
రాష్ట్రీయ గోకుల్ మిషన్‌లో నిర్దేశించిన లక్ష్యాలతో పాటు సాధించిన విజయాలను అనుబంధ పత్రం-I లో చూడవచ్చు. ఆర్థిక వ్యవహారాలపై ఏర్పాటు చేసిన మంత్రివర్గ కమిటీ ఆమోదించిన రాష్ట్రీయ గోకుల్ మిషన్‌లోని 14 అంశాల (కంపోనెంట్స్) లోనూ 11 అంశాల విషయంలో లక్ష్యాలను నెరవేర్చారు. 3 అంశాలలో విజయాల స్థాయి తక్కువగా ఉంది. ఆ మూడు అంశాలు ఇవి.. గర్భస్థ పిండాల నుంచి ఎద్దుల ఉత్పత్తి, ఎద్దుల దిగుమతి, ఐవీఎఫ్ సాంకేతికత అమలు. కొత్తగా పరిచయం చేసిన సాంకేతికత ఎక్కువ ఖరీదైంది కావడంతో దాని పట్ల రైతులు అంతగా మొగ్గు చూపించక పోవడం తక్కువ విజయాలు నమోదు కావడానికి కారణమైంది. ఐవీఎఫ్ సాంకేతికతకు అయ్యే ఖర్చు తగ్గించడానికి కేంద్ర ప్రభుత్వం ఇటీవల దేశీయంగా రూపొందించిన ఐవీఎఫ్ మాధ్యమాన్ని ప్రవేశపెట్టింది. ఈ రకమైన సవాళ్లు చాలా ఉన్నప్పటికీ, పాల ఉత్పత్తి గత 11 సంవత్సరాల్లో 69.41 శాతం మేర వృద్ధి చెందింది. పాల ఉత్పత్తి 2014-15లో 146.3 మిలియన్ టన్నులుగా ఉంటే, 2024-25లో 247.87 మిలియన్ మెట్రిక్ టన్నులకు పెరిగింది. ఇదే కాలంలో పాల తలసరి లభ్యత 2014-15లో రోజుకు 319 గ్రాముల స్థాయి నుంచి 52.03 శాతం వృద్ధితో 2024-25లో రోజుకు 485 గ్రాములకు మెరుగుపడింది. ఆవులు, గొడ్లు, ఎద్దుల మొత్తం మీద ఉత్పత్తి 2014-15 మొదలు 2024-25 మధ్య కాలంలో 36.63 శాతం వృద్ధి చెందింది. ఇది ప్రపంచంలో అత్యధిక ఉత్పాదన వృద్ధి రేటు.
ఈ పథకాన్ని అమలు చేయడంలో ఎలాంటి సడలింపు చోటు చేసుకోలేదని గమనించారు. ఈ పథకాన్ని 2014లో మొదలుపెట్టినప్పటి నుంచి దీనిని అమలు పరచడంలో అన్ని రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాలు పాలు పంచుకుంటున్నాయి. ఈ పథకంలో లాభపడ్డ రైతుల వివరాలను అనుబంధ పత్రం-IIలో గమనించవచ్చు.
(d) దేశంలో గత మూడు సంవత్సరాల్లో గోజాతి ఉత్పాదకతను పెంచడానికి రాష్ట్రీయ గోకుల్ మిషన్ ద్వారా చేపట్టిన కార్యక్రమాలు ఈ కింది విధంగా ఉన్నాయి:
(i) కృత్రిమ వీర్య నిక్షేపణం కవరేజిని విస్తరించడంతో పాటు దేశీయ జాతులు సహా గోజాతి ఉత్పాదకతని, పాల ఉత్పత్తిని పెంచడానికి దేశవ్యాప్తంగా కృత్రిమ మేధ (ఏఐ) ని ఉపయోగిస్తున్నారు. గత మూడు సంవత్సరాల్లో ఈ పథకాన్ని 5.44 కోట్ల పశువులకు వర్తింప చేశారు. కృత్రిమ వీర్యనిక్షేపణాన్ని 9.72 కోట్ల సందర్భాలకు వినియోగించారు. దేశం నలుమూలలా ఈ పథకం ద్వారా 2.97 కోట్ల మంది రైతులు ప్రయోజనం పొందారు.
(ii) కృత్రిమ వీర్యనిక్షేపణం సేవలను రైతుల ముంగిటకే అందజేయడానికి ‘మైత్రి’ (మల్టీపర్పస్ ఆర్టిఫిషియల్ ఇన్‌సెమినేషన్ టెక్నీషియన్స్ ఇన్ రూరల్ ఇండియా..ఎమ్ఐటీఆర్ఐ)లను రంగంలోకి దించారు. గడచిన మూడేళ్లలో 42096 ‘మైత్రి’లను నియమించారు.
(iii) ఎద్దులలో దేశీయ జాతివి సహా, అధిక జన్యు గుణాలున్న ఎడ్ల ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకొని సంతతి పరీక్షని, ఉత్తమ జాతి ఎంపిక విధానాన్ని అమలు చేశారు. ఇంతవరకు 4620 అధిక జన్యు యోగ్యతలు కల ఎద్దులను ఉత్పత్తి చేయడంతో పాటు వాటిని వీర్యోత్పత్తి కోసం వీర్య కేంద్రాలకు అందుబాటులో ఉంచారు.
(iv) స్వదేశీ జాతులు సహా అధిక జన్యు గుణాలు కలిగిన ఎడ్ల ఉత్పత్తిని దృష్టిలో పెట్టుకొని, లైంగికత ఆధారంగా వీర్యాన్ని వేరు చేసి యాక్సిలరేటెడ్ బ్రీడ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రామును అమలు చేస్తున్నారు.
(v) యాక్సిలరేటెడ్ బ్రీడ్ ఇంప్రూవ్‌మెంట్ ప్రోగ్రాములో స్వదేశీ జాతులకు చెందిన శ్రేష్ఠ పశువుల ప్రవర్ధనం కోసం ఇన్-విట్రో ఫర్టిలైజేషన్ (ఐవీఎఫ్) సాంకేతికతను ఉపయోగిస్తున్నారు: ఇంతవరకు 7957 గర్భస్థ పిండాలను బదలాయించారు. ఈ కార్యక్రమం ద్వారా 1149 దూడలు జన్మించాయి.
(vi) దేశవ్యాప్తంగా స్వదేశీ జాతులకు సంబంధించిన పశువులను పెద్ద సంఖ్యలో ఉత్పత్తి చేసే ఫారాలను (బ్రీడ్ మల్టిప్లికేషన్ ఫారమ్స్) ఏర్పాటు చేశారు: ఈ కంపోనెంట్‌లో 132 బ్రీడ్ మల్టిప్లికేషన్ ఫారమ్స్‌ను మంజూరు చేశారు.
(vii) దేశవాళీ జాతుల వీర్యం సహా.. రాశి పరంగానూ, వాసి పరంగానూ వీర్యోత్పత్తిలో మెరుగైన ఫలితాల సాధన కోసం వీర్య కేంద్రాలను బలోపేతం చేస్తున్నారు. ఇంతవరకు 48 వీర్య కేంద్రాల పటిష్ఠీకరణ ప్రతిపాదనలకు ఆమోదం తెలిపారు.
(viii) స్వదేశీ గోజాతుల ప్రాధాన్యాన్ని రైతులకు వివరించి వారిలో అవగాహనను పెంచే ఉద్దేశంతో ఈ పథకంలో భాగంగా ఫెర్టిలిటీ క్యాంపులను, పాల దిగుబడి పోటీని, దూడలతో ర్యాలీలను ఏర్పాటు చేయడం, రైతు శిక్షణ కార్యక్రమంతో పాటు సెమినార్లను, కార్యశాలలను, సదస్సులను నిర్వహించారు.
అనుబంధ పత్రం- I
ఆర్‌జీఎమ్‌లో నిర్దేశించిన లక్ష్యాలు, సాధించిన విజయాలు:
అనుబంధ పత్రం- II
రాష్ట్రీయ గోకుల్ మిషన్‌లో భాగంగా, దేశమంతటా అమలు చేసిన కృత్రిమ వీర్య నిక్షేపణ కార్యక్రమం ద్వారా ప్రయోజనం పొందిన రైతుల సంఖ్య రాష్ట్రాలవారీగా ఈ కింది విధంగా ఉంది:
లోక్‌సభలో అడిగిన ఒక ప్రశ్నకు మత్స్య, పశుసంవర్ధక, పాడిపరిశ్రమ శాఖ మంత్రి శ్రీ రాజీవ్ రంజన్ సింగ్ అలియాస్ లలన్ సింగ్ సమాధానమిస్తూ, ఈ సమాచారాన్ని అందించారు.
***
(రిలీజ్ ఐడి: 2241677)
సందర్శకుల సూచీ సంఖ్య : : 10