ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

దేశవ్యాప్తంగా హెచ్‌పీవీ వాక్సినేషన్ కార్యక్రమంపై అప్‌డేట్


గ్రామీణ, వెనుకబడిన ప్రాంతాలు సహా అన్ని ప్రాంతాల్లోని ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాల్లో ఉచితంగా గార్డసిల్-4 సింగిల్ డోస్ వ్యాక్సిన్

దేశవ్యాప్తంగా మహిళల్లో ఈ వ్యాధి ప్రభావాన్ని తగ్గించటమే లక్ష్యంగా పరీక్షలు నిర్వహించటం, ముందస్తు వ్యాధి నిర్ధారణ, సకాలంలో చికిత్స అందించటం వంటి బహుముఖ విధానాలను అమలు చేస్తున్న భారత ప్రభుత్వం

నాడు పోస్టు చేయడమైనది: 17 MAR 2026 1:15PM by PIB Hyderabad

దేశవ్యాప్తంగా ఉచిత హెచ్‌పీవీ వాక్సినేషన్ కార్యక్రమం 28 ఫిబ్రవరి 2026న ప్రారంభమైంది. 36 రాష్ట్రాలుకేంద్రపాలిత ప్రాంతాల్లో 14 ఏళ్ల వయసున్న సుమారు 1.2 కోట్ల మంది బాలికలే ఈ కార్యక్రమ లక్ష్యందీని ద్వారా ప్రభుత్వ ఆరోగ్య కేంద్రాలన్నింటిలోనూ గార్డసిల్-4 వాక్సిన్ ఒక డోసును ఉచితంగా అందిస్తారుఆయుష్మాన్ ఆరోగ్య మందిరాలుప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు), సామాజిక ఆరోగ్య కేంద్రాలు (సీహెచ్‌సీలు), సబ్-డివిజినల్ ఆస్పత్రులు (ఎస్‌డీహెచ్‌లు), జిల్లా ఆస్పత్రులు (డీహెచ్‌లు), ప్రభుత్వ వైద్య కళాశాలలు (జీఎంసీలుసహా గ్రామీణవెనుకబడిన ప్రాంతాల్లోనూ ఈ టీకా అందుబాటులో ఉంటుందిమూడు నెలల ఈ ప్రత్యేక ప్రచార కార్యక్రమం తర్వాత కూడా సాధారణ టీకాల పంపిణీ సమయంలో ఈ వ్యాక్సిన్ అందుబాటులో ఉంటుంది.

ఈ వ్యాక్సినేషన్ ప్రక్రియ వైద్యాధికారుల సమక్షంలో జరుగుతుందిదుష్ప్రభావాలు తలెత్తితేవాటిని నివారించేందుకు 24x7 అందుబాటులో ఉండే ఏఈఎఫ్ఐ మేనేజ్‌మెంట్ సెంటర్లతో టీకా కేంద్రాలను అనుసంధానించారుహెచ్‌పీవీ వాక్సిన్ వేయించుకోవటం పూర్తిగా స్వచ్ఛంద నిర్ణయంటీకా వేయటానికి ముందు తల్లిదండ్రుల అనుమతి తప్పనిసరిహెచ్‌పీవీ వాక్సిన్ అమలు కార్యాచరణ మార్గదర్శకాలను ఇప్పటికే అన్ని రాష్ట్రాలుయూటీలకు తెలియజేశారు.

గర్భాశయ క్యాన్సర్‌కు వ్యూహాత్మక నివారణ చర్యలను భారత ప్రభుత్వం అమలు చేస్తోందిమహిళల్లో ఈ వ్యాధి ప్రభావాన్ని తగ్గించటమే లక్ష్యంగా వ్యాధి నిర్ధారణ పరీక్షలుముందుస్తుగా వ్యాధిని గుర్తించటంసరైన సమయంలో చికిత్స వంటి అంశాలతో బహుముఖ విధానాన్ని ప్రభుత్వం అనుసరిస్తోందిఈ కార్యక్రమాలతో పాటు అంతర్జాతీయ శాస్త్రీయ ఆధారాల ప్రకారం.. భారతదేశంలో గర్భాశయ క్యాన్సర్ కేసులను తగ్గించటంలో హెచ్‌పీవీ వ్యాక్సినేషన్ కీలక పాత్ర పోషిస్తుంది.

అనుమతి పొందిన హెచ్‌పీవీ వ్యాక్సిన్ల సమర్థతకు సంబంధించిన పూర్తి వివరాలు ఉత్పత్తి లక్షణాల సారాంశం (ఎస్ఎంపీసీ)లో ప్రచురితమయ్యాయిఇవి సీడీఎస్‌సీఓ వెబ్‌సైట్‌లో ప్రజలకు అందుబాటులో ఉన్నాయి.

ఈ సమాచారాన్ని కేంద్ర ఆరోగ్యకుటుంబ సంక్షేమ శాఖ సహాయమంత్రి శ్రీమతి అనుప్రియ పటేల్ ఇవాళ రాజ్యసభలో లిఖితపూర్వకంగా అందించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2241243) సందర్శకుల సూచీ సంఖ్య : : 23
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Bengali-TR , Punjabi , Gujarati