వినియోగదారు వ్యవహారాలు, ఆహార మరియు ప్రజా పంపిణీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆర్ఎంఎస్ 2026-27 నుంచి గోధుమ, వరి సేకరణకు ఆర్తీలు, సొసైటీలకు కమీషన్ రేట్లను సవరించిన కేంద్రం

నాడు పోస్టు చేయడమైనది: 16 MAR 2026 10:05PM by PIB Hyderabad

ప్రభుత్వం తరపున గోధుమలువరి ధాన్యం సేకరించే ఆర్తీలుసహకార సంఘాలకు చెల్లించే కమీషన్ ధరల సవరణకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపిందిసవరించిన ఈ ధరలు 2026-27 రబీ మార్కెటింగ్ సీజన్ (ఆర్ఎంఎస్నుంచి అమల్లోకి వస్తాయి.

ప్రభుత్వం తరపున గోధుమలువరి సేకరణ చేపట్టే మధ్యవర్తులుగాసేకరణకర్తలుగా సేవలందించే సహకార సంఘాలుకో-ఆపరేటివ్సబ్-ఏజెంట్లుఆర్తీలకు ప్రస్తుత సేకరణ మార్గదర్శకాల ప్రకారం కమీషన్ చెల్లిస్తారు.

కమీషన్ల సవరణకు వివిధ రాష్ట్ర ప్రభుత్వాల నుంచి అందిన వినతుల ఆధారంగా.. రాష్ట్ర ప్రభుత్వాలుఆహారప్రజా పంపిణీ శాఖ ప్రతినిధులతో ఎఫ్‌సీఐ ఒక ఉపకమిటీని ఏర్పాటు చేసిందిప్రస్తుత రేట్లను పరిశీలించిన ఈ కమిటీ.. కమీషన్ విధానంలో మార్పులు చేయాలని సిఫార్సు చేసింది.

కమిటీ సిఫార్సుల మేరకు.. గోధుమలువరి సేకరణకు ఆర్తీలుసొసైటీలకు చెల్లించే కమీషన్ రేట్ల పెంపునకు ప్రభుత్వం ఆమోదం తెలిపిందిఈ సవరణ తర్వాత పంజాబ్హర్యానా రాష్ట్రాల్లో ఆర్తీలకు గోధుమలపై చెల్లించే కమీషన్ క్వింటాలుకు రూ.46 నుంచి రూ.50.75కు పెరగనుందిరాజస్థాన్‌లో క్వింటాలుకు రూ.41.40 నుంచి రూ.45.67కి పెరుగుతుందివరికి కమీషన్ ధర క్వింటాలుకు రూ.45.88 నుంచి రూ.50.61కి పెరగనుంది.

సహకార సంఘాలకు చెల్లించే కమీషన్ రేట్లను కూడా సవరించారుగోధుమల సేకరణకు ఇచ్చే కమీషన్ క్వింటాలుకు రూ.27 నుంచి రూ.29.79కి పెరగనుందిధాన్యం కమీషన్ క్వింటాలుకు రూ.32 నుంచి రూ.35.30కి పెరుగుతుంది.

ప్రసుత వ్యవస్థకు అనుగుణంగా ఆధునిక ధాన్యం గిడ్డంగుల వద్ద సేకరణకు చెల్లించాల్సిన కమీషన్.. మండీల్లో వర్తించే రేటులో 50 శాతం ఉంటుంది.

ధాన్యం సేకరణ వ్యవస్థలో సమర్థత తగ్గకుండా చూడటంప్రభుత్వం తరపున సేకరణ కార్యకలాపాలను సులభతరం చేసే ఏజెన్సీలకు మద్దతివ్వటం ఈ కమీషన్ రేట్ల సవరణ ఉద్దేశం.

 

***


(రిలీజ్ ఐడి: 2241098) సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati