ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఆరోగ్యానికీ, వ్యాయామానికీ ఉన్న ప్రాధాన్యాన్ని చాటిచెప్పే సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 16 MAR 2026 10:08AM by PIB Hyderabad

మనిషి జీవితంలో అతి గొప్ప సంపద మంచి ఆరోగ్యమేనని,  ఆ ఆరోగ్యాన్ని కాపాడడంలో వ్యాయామానిది చాలా ముఖ్య పాత్ర అని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు. దేశంలో పౌరులందరికీ ఆరోగ్యప్రద, ఆనందదాయక జీవనం లభించాలని ఆయన ఆకాంక్షించారు.

సంస్కృత భాష లోని ఒక సుభాషితాన్ని ప్రజలతో ప్రధాని పంచుకున్నారు. అది.. :

‘‘వ్యాయామాల్లభతే స్వాస్థ్యం దీర్ఘాయుష్యం బలం సుఖమ్

ఆరోగ్యం పరమం భాగ్యం స్వాస్థ్యం సర్వార్థసాధనమ్.’’

వ్యాయామం వల్ల చక్కని ఆరోగ్యం, దీర్ఘాయుష్షు, బలంతో పాటు సుఖం లభిస్తాయని, మంచి ఆరోగ్యమే పరమ భాగ్యమని, ఆరోగ్యం అన్నిటినీ సాధించి పెడుతుందనే సందేశాన్ని ఈ సుభాషితం అందిస్తోంది.

ఎక్స్‌లో ప్రధాని ..:

‘‘వ్యాయామాల్లభతే స్వాస్థ్యం దీర్ఘాయుష్యం బలం సుఖమ్

ఆరోగ్యం పరమం భాగ్యం స్వాస్థ్యం సర్వార్థసాధనమ్’’ అని రాాశారు.


(రిలీజ్ ఐడి: 2240695) సందర్శకుల సూచీ సంఖ్య : : 7