ప్రధాన మంత్రి కార్యాలయం
ఒడిశా లోని కటక్‌లోని ఆసుపత్రిలో అగ్నిప్రమాదం, ప్రాణనష్టం.. ప్రధానమంత్రి సంతాపం పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి ఎక్స్‌గ్రేషియాను ప్రకటించిన ప్రధాని
నాడు పోస్టు చేయడమైనది:
16 MAR 2026 12:05PM by PIB Hyderabad
ఒడిశా లోని కటక్‌లో ఓ ఆసుపత్రిలో అగ్ని ప్రమాదం కారణంగా ప్రాణనష్టం సంభవించినందుకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ సంతాపం తెలిపారు. ఈ దుర్ఘటనలో గాయపడ్డ వ్యక్తులు త్వరగా కోలుకోవాలని శ్రీ మోదీ ఆకాంక్షించారు.
మృతుల ఆత్మీయులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల వంతున, గాయపడ్డవారికి రూ.50,000 వంతున ఎక్స్‌గ్రేషియాను ప్రధాని ప్రకటించారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘ఒడిశాలోని కటక్‌లో ఓ ఆసుపత్రిలో జరిగిన దుర్ఘటన చాలా బాధాకరం. తమ ఆత్మీయులను కోల్పోయిన వారికి నేను సంతాపాన్ని తెలియజేస్తున్నాను. గాయపడ్డవారు త్వరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నాను.
మృతుల ఆత్మీయులకు పీఎంఎన్ఆర్ఎఫ్ నుంచి రూ. 2 లక్షల వంతున ఎక్స్‌గ్రేషియాను ఇస్తారు. గాయపడ్డ వారికి రూ.50,000 వంతున ఇస్తారు: ప్రధానమంత్రి’’ అని పేర్కొన్నారు
"ଓଡ଼ିଶାର କଟକରେ ଏକ ହସ୍ପିଟାଲରେ ଘଟିଥିବା ଦୁର୍ଘଟଣା ଗଭୀର ଯନ୍ତ୍ରଣାଦାୟକ। ଯେଉଁମାନେ ନିଜ ପ୍ରିୟଜନଙ୍କୁ ହରାଇଛନ୍ତି ସେମାନଙ୍କ ପ୍ରତି ସମବେଦନା। ଆହତମାନଙ୍କ ଆଶୁ ଆରୋଗ୍ୟ ପାଇଁ ମୁଁ ପ୍ରାର୍ଥନା କରୁଛି।
ପ୍ରତ୍ୟେକ ମୃତକଙ୍କ ନିକଟ ସମ୍ପର୍କୀୟଙ୍କୁ ପିଏମଏନଆରଏଫରୁ ୨ ଲକ୍ଷ ଟଙ୍କାର ଅନୁକମ୍ପାମୂଳକ ସହାୟତା ପ୍ରଦାନ କରାଯିବ । ଆହତମାନଙ୍କୁ ୫୦,୦୦୦ ଟଙ୍କା ଦିଆଯିବ: ପ୍ରଧାନମନ୍ତ୍ରୀ @narendramodi"
(రిలీజ్ ఐడి: 2240689)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Bengali-TR
,
Manipuri
,
Punjabi
,
Gujarati
,
Odia
,
Kannada