రహదారి రవాణా, హైవేల మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

ఆర్థిక సంవత్సరం 2026-27గానూ ఎన్‌హెచ్‌ఏఐ సవరించిన ఫాస్టాగ్ వార్షిక పాస్ రుసుం ఏప్రిల్ 1, 2026 నుంచి అమలు

प्रविष्टि तिथि: 15 MAR 2026 12:20PM by PIB Hyderabad

ఆర్థిక సంవత్సరం 2026-27గానూ ఫాస్టాగ్ వార్షిక పాస్ రుసుం రూ.3,000 నుంచి రూ.3,075కు సవరించినట్లు భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ ప్రకటించిందిఏప్రిల్ 1, 2026 నుంచి సవరించిన రుసుము అమల్లోకి రానున్నట్లు తెలిపిందినేషనల్ హైవేస్ ఫీజు (రేట్లు నిర్ధారణ రేట్లువసూళ్లునిబంధనలు-2008కి అనుగుణంగా ఈ సవరణ చేపట్టినట్లు వెల్లడించిందిదేశవ్యాప్తంగా సుమారు 56 లక్షల మందికిపైగా ఫాస్టాగ్ వార్షిక పాస్‌ను వినియోగిస్తున్నారనిప్రైవేటు వాహన యజమానులు దీన్ని ఎక్కువగా ఆదరిస్తున్నట్లు పేర్కొంది.

జాతీయ రహదారులుఎక్స్‌ప్రెస్‌వేలపై ఉన్న సుమారు 1,150 టోల్‌ప్లాజాల వద్ద వార్షిక పాస్ సౌకర్యాన్ని పొందవచ్చుచెల్లుబాటయ్యే ఫాస్టాగ్ ఉన్న వాణిజ‌్యేతర వాహనాలకు ఈ సవరించిన రేట్లు వర్తిస్తాయివార్షిక పాస్ ద్వారా ఫాస్టాగ్ రీఛార్జ్‌ను ఎప్పటికప్పుడు చేయాల్సిన అవసరం ఉండదుకేవలం ఒకసారి రుసుము చెల్లించి ఏడాది పాటు లేదా 200 సార్లు టోల్‌ప్లాజా నుంచి ప్రయాణించవచ్చుచెల్లుబాటయ్యే ఫాస్టాగ్‌ ఉన్న అన్ని వాణిజ్యేతర వాహనాలకు ఈ పాస్ వర్తిస్తుంది.

రాజమార్గ యాత్ర యాప్ లేదా భారత జాతీయ రహదారుల ప్రాధికార సంస్థ వెబ్‌సైట్ ద్వారా రుసుము చెల్లించిన అనంతరం వాహన ఫాస్టాగ్‌లో రెండు గంటల్లోపు వార్షిక పాస్ యాక్టివేట్ అవుతుంది.

ఆగస్టు 15, 2025న ప్రారంభమైన ఫాస్టాగ్‌ వార్షిక పాస్‌కు లభిస్తున్న విశేష స్పందన ద్వారా దేశవ్యాప్తంగా జాతీయ రహదారుల వినియోగదారులకు సౌకర్యవంతమైనతక్కువ ఖర్చుతో ప్రయాణ సౌలభ్యాన్ని ఇది అందిస్తుందని స్పష్టమవుతోంది.

 

***


(रिलीज़ आईडी: 2240426) आगंतुक पटल : 87
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: Kannada , Assamese , Marathi , English , Gujarati , Urdu , हिन्दी , Bengali , Punjabi , Tamil , Malayalam