ప్రధాన మంత్రి కార్యాలయం
అస్సాంలోని గువాహటిలో పలు అభివృద్ధి ప్రాజెక్టుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపన కార్యక్రమాల విశేషాలను పంచుకున్న ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ
నాడు పోస్టు చేయడమైనది:
14 MAR 2026 10:54AM by PIB Hyderabad
అస్సాంలోని గువాహటిలో దాదాపు రూ. 19,480 కోట్ల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులకు ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ శంకుస్థాపనలు, ప్రారంభోత్సవ కార్యక్రమాలు చేశారు. ఈ సందర్భంగా గువాహటిలో జరిగిన భారీ బహిరంగ సభలో ప్రధానమంత్రి ప్రసంగించారు. నగర ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. దేశం నలుమూలల నుంచి తరలివచ్చిన రైతులకు, తేయాకు తోటల్లో పనిచేస్తున్న సోదరసోదరీలకు ఆయన అభివాదం చేశారు.
సామాజిక మాధ్యమం ఎక్స్‌లో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఇలా పేర్కొన్నారు.
‘‘కోక్రాఝర్ అద్భుతమైన బోడో సంస్కృతితో విడదీయలేని అనుబంధం ఉంది. ఈ ప్రాంతం అభివృద్ధిని వేగవంతం చేసే లక్ష్యంతో చేపట్టిన పలు ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రయాల సందర్భంగా వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా ప్రసంగించాను’’ .
‘‘గువాహటి నుంచి అనేక ముఖ్యమైన సంక్షేమ, మౌలిక సదుపాయాల కార్యక్రమాలు ప్రారంభమవుతున్నాయి. ఇది అస్సాం వృద్ధిని వేగవంతం చేయడమే కాకుండా, రాష్ట్రవ్యాప్తంగా ప్రజలకు ఎంతో మేలు చేకూరుస్తాయి’’ .
‘‘అస్సాంలోని గువాహటిలో నా కుటుంబ సభ్యుల ఉత్సాహం, జోష్ చూస్తుంటే అభివృద్ధి పట్ల వారి సంకల్పం ఎంత బలంగా ఉందో అర్థమవుతోంది’’.
‘‘అస్సాంలోని తేయాకు తోటల్లో పనిచేస్తున్న కార్మిక సోదరసోదరీలకు భూమి పట్టాలను అందజేయడం నాకు ఎంతో సంతృప్తిని ఇచ్చింది. ఇది వారి జీవితాలను సులభతరం చేయడానికి, మెరుగుపరచడానికి ఎంతో సహాయపడుతుంది’’
‘‘అస్సాంలోని గువాహటిలో నేడు నా రైతు సోదరసోదరీల కోసం పీఎం కిసాన్ సమ్మాన్ నిధి 22వ విడతను విడుదల చేసే భాగ్యం కలిగింది. ఈ పథకం దేశవ్యాప్తంగా ఉన్న మన చిన్న రైతులకు ఎంతో మేలు చేస్తుండటం నాకు చాలా సంతోషంగా ఉంది’’.
‘‘బీజేపీ-ఎన్డీయే ప్రభుత్వానికి రైతు సోదరసోదరీల ప్రయోజనాల కంటే మించినది ఏదీ లేదు. గతంలో కాంగ్రెస్ ఏ కిసాన్ సమ్మాన్ నిధి పథకంపై ప్రశ్నలు లేవనెత్తిందో.. అదే పథకం నేడు అస్సాం సహా దేశవ్యాప్తంగా ఉన్న చిన్న రైతులకు సామాజిక భద్రత, గౌరవాన్ని అందించే సాధనంగా మారింది’’.
‘‘దేశ ఇంధన రంగానికి సంబంధించిన లక్ష్యాలను సాధించడంలో అస్సాం కీలక పాత్ర పోషిస్తోంది. ఇక్కడ ప్రారంభించిన పునరుత్పాదక ఇంధన ప్రాజెక్టుల వల్ల అస్సాంతో పాటు మొత్తం ఈశాన్య రాష్ట్రాలకు ప్రయోజనం చేకూరనుంది’’.
‘‘అస్సాం తేయాకు తోటల్లో పని చేస్తూ.. రాష్ట్రానికి అంతర్జాతీయ గుర్తింపు తెచ్చిన మన స్నేహితులకు భూమిని కేటాయించే గొప్ప కార్యక్రమాన్ని మేం ప్రారంభించాం. దీనివల్ల వారి సొంత ఇంటి కల కూడానెరవేరబోతోంది’’ .
‘‘డబుల్ ఇంజిన్ ప్రభుత్వం అస్సాంలో పర్యాటక రంగాన్ని ఉపాధి, అభివృద్ధికి ఒక గొప్ప అవకాశంగా చూసింది. అందుకే ఇది ప్రజల శ్రేయస్సుకు ఒక కొత్త ఇంజిన్‌లా మారుతోంది’’.
"యుద్ధాల వల్ల తలెత్తిన సంక్షోభాల మధ్య కూడా అబద్ధాలు ప్రచారం చేస్తున్న కాంగ్రెస్ పార్టీ.. ఆగస్టు 15న ఎర్రకోట నుంచి పండిట్ నెహ్రూ చేసిన ప్రసంగాన్ని ఖచ్చితంగా వినాలి. ఆనాడు ధరల పెరుగుదలకు ఉత్తర కొరియా, దక్షిణ కొరియాల మధ్య జరిగిన యుద్ధమే కారణమని ఆయన ఆరోపించారు’’.
***
(రిలీజ్ ఐడి: 2240221)
సందర్శకుల సూచీ సంఖ్య : : 5