సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ
చట్టబద్ధమైన నిబంధనల ప్రకారం సినిమాల ధ్రువీకరణ... ధ్రువీకరణ కాలపరిమితి తగ్గింపు
నాడు పోస్టు చేయడమైనది:
13 MAR 2026 5:49PM by PIB Hyderabad
సమాచార, ప్రసార మంత్రిత్వ శాఖ పరిధిలోని చట్టబద్ధమైన సంస్థ అయిన కేంద్ర చలనచిత్ర ధ్రువీకరణ మండలి (సీబీఎఫ్‌సీ).. సినిమాటోగ్రాఫ్ చట్టం 1952, సినిమాటోగ్రాఫ్ (సర్టిఫికేషన్) నిబంధనలు 2024 కింద జారీ చేసిన మార్గదర్శకాల ప్రకారం బహిరంగ ప్రదర్శన కోసం సినిమాలను ధ్రువీకరిస్తుంది. దేశ సార్వభౌమాధికారం, సమగ్రత, దేశ భద్రత, విదేశాలతో స్నేహపూర్వక సంబంధాలు, శాంతి భద్రతలు, మర్యాద లేదా నైతికతకు భంగం కలిగించే అంశాలు, పరువు నష్టం, కోర్టు ధిక్కరణ లేదా నేరానికి పురిగొల్పడం వంటి అంశాలు ఉన్నప్పుడు మాత్రమే దృశ్యాల తొలగింపు, మార్పులను సిఫార్సు చేస్తుంది.
‘సినిమాటోగ్రాఫ్ (సర్టిఫికేషన్) నిబంధనలు 2024’లోని 37వ నియమం ప్రకారం సినిమాల ధ్రువీకరణ కోసం నిర్దేశించిన కాలపరిమితి 48 పని దినాలు. అయితే ఆన్‌లైన్ ధ్రువీకరణ విధానం అమలులోకి వచ్చిన తర్వాత ప్రస్తుతం సినిమాల ధ్రువీకరణకు సగటున 22 పనిదినాలు, లఘు చిత్రాలకు కేవలం 3 పని దినాలు మాత్రమే పడుతుంది.
సినిమాటోగ్రాఫ్ చట్టం ప్రకారం సీబీఎఫ్‌సీ జారీ చేసిన ఉత్తర్వులపై హైకోర్టులో అప్పీలు చేసుకునే వెసులుబాటు ఉంటుంది. ఇటువంటి కేసులను న్యాయపరమైన విచారణల ఫలితాలకు అనుగుణంగా పరిష్కరిస్తారు. హైకోర్టులో సవాలు చేసిన నిర్ణయాలకు సంబంధించిన సంవత్సరాల వారీగా వివరాలు కింద ఉన్నాయి.
|
సంవత్సరం
|
2021
|
2022
|
2023
|
2024
|
2025
|
|
హైకోర్టులో సవాలు చేసిన చిత్రాలు
|
2
|
4
|
1
|
4
|
10
|
శ్రీ మల్లికార్జున్ ఖర్గే అడిగిన ప్రశ్నలకు సమాధానంగా సమాచార, ప్రసార శాఖ సహాయ మంత్రి డాక్టర్ ఎల్. మురుగన్ రాజ్యసభలో ఈ సమాచారాన్ని అందించారు.
***
(రిలీజ్ ఐడి: 2240054)
సందర్శకుల సూచీ సంఖ్య : : 14