హోం మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

జనగణన 2027

నాడు పోస్టు చేయడమైనది: 11 MAR 2026 4:37PM by PIB Hyderabad

2027 జనాభా లెక్కింపును రెండు దశల్లో నిర్వహిస్తారు. మొదటి దశకు సంబంధించిన ప్రశ్నలు అంటే గృహాల జాబితా, గృహాల గణనను ప్రకటించారు. కుటుంబ స్థితిగతులతో పాటు కుటుంబ యజమాని పేరు, లింగం, అందుబాటులో ఉన్న సదుపాయాలు, ఇంటి వద్ద అందుబాటులో ఉన్న వస్తువుల వంటి కుటుంబానికి సంబంధించిన వివరాలను ఈ దశలో సేకరిస్తారు. కుటుంబ యజమాని లింగం కోసం అంటే పురుషుడు/స్త్రీ/లింగమార్పిడి చేసుకున్నవారు అనే మూడు ఎంపికలు అందుబాటులో ఉంటాయి. రెండో దశకు సంబంధించిన ప్రశ్నలు అంటే జనాభా గణనకు సంబంధించిన ప్రశ్నల్లో ప్రతి వ్యక్తి గురించిన సమాచారం సేకరిస్తారు. వీటిని గురించి తగిన సమయంలో ప్రకటన చేస్తారు.

ఏ కారణం చేతనైనా ఏదైనా ఇంటిని వదిలేయడాన్ని నివారించడానికి జన గణన సిబ్బంది మొత్తం జన గణన ప్రాంతంలో ఇంటింటికీ క్షేత్రస్థాయి సందర్శన చేస్తారు. ప్రజలు స్వయంగా తమ సమాచారాన్ని సమర్పించడానికి స్వీయ-గణన సదుపాయం కూడా కల్పిస్తున్నారు. తుది సమర్పణకు ముందు గణన సిబ్బంది ఈ స్వీయ-గణన సమాచారాన్ని ధ్రువీకరిస్తారు. ఆ సమాచార కచ్చితత్వాన్ని నిర్ధారించడానికి తరచుగా అడిగే ప్రశ్నలు, అవసరమైన 'టూల్ చిట్కాలు', ప్రశ్నల కోసం ధ్రువీకరణ తనిఖీలను స్వీయ-గణన పోర్టల్‌లోనే అందించారు.

గణన సిబ్బంది, పర్యవేక్షకులు సహా జన గణన పనుల కోసం నియమించిన క్షేత్రస్థాయి సిబ్బంది అందరికీ తగిన శిక్షణనిస్తున్నారు. డేటా స్థిరత్వం, కచ్చితత్వాన్ని నిర్ధారించడానికి మొబైల్ యాప్‌లోనే ధ్రువీకరణ నియమాలు పొందుపరిచారు. గణన సిబ్బంది సేకరించిన సమాచారాన్ని పర్యవేక్షకులు పర్యవేక్షించి, తనిఖీ చేస్తారు.

(డి) మొబైల్‌లో సమాచారాన్ని సేకరించేటప్పుడు, డేటా ట్రాన్స్‌మిషన్ సమయంలో, సర్వర్ స్థాయిలో సమాచార భద్రత కోసం అవసరమైన అన్ని చర్యలు తీసుకుంటారు.

రాజ్యసభలో ఒక ప్రశ్నకు లిఖితపూర్వక సమాధానంగా హోం మంత్రిత్వ శాఖ సహాయ మంత్రి శ్రీ నిత్యానంద్ రాయ్ ఈ విషయాన్ని తెలిపారు.

 

***


(రిలీజ్ ఐడి: 2238435) సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Gujarati