మంత్రిమండలి
azadi ka amrit mahotsav

మధురై విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదా: కేంద్ర మంత్రివర్గ నిర్ణయం

నాడు పోస్టు చేయడమైనది: 10 MAR 2026 4:14PM by PIB Hyderabad

తమిళనాడులోని మధురై విమానాశ్రయానికి అంతర్జాతీయ హోదాని ప్రకటిస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్రమోదీ అధ్యక్షతన ఈ రోజు నిర్వహించిన మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది.

టెంపుల్ సిటీగా పిలిచే తమిళనాడులోని మధురై విమానాశ్రయం ఆ రాష్ట్రంలోని పాత విమానాశ్రయాల్లో ఒకటిదక్షిణ తమిళనాడుకి ఇది ముఖద్వారంగా ఉందిపర్యాటకాన్నితీర్థయాత్రలను ప్రోత్సహించడంలో కీలకపాత్ర పోషించడమే కాకుండా ఈ ప్రాంత సమగ్రాభివృద్ధికి తోడ్పడుతుంది.

మధురై విమానాశ్రయాన్ని అంతర్జాతీయ హోదా స్థాయికి పెంచడం ద్వారా ప్రాంతీయంగా రవాణా సదుపాయం విస్తరిస్తుందివాణిజ్యంఆర్థికాభివృద్ధి మెరుగవుతాయిఈ నగర చారిత్రక ప్రాముఖ్యతకు సరితూగేలా అంతర్జాతీయ భక్తులనువ్యాపారాలను ఈ విమానాశ్రయం ఆకర్షిస్తుంది.

 

***


(రిలీజ్ ఐడి: 2237631) సందర్శకుల సూచీ సంఖ్య : : 13
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Assamese , Bengali , Gujarati , Tamil , Kannada , Malayalam