ఆరోగ్య, కుటుంబ సంక్షేమ‌ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అవయవ మార్పిడిపై తాజా సమాచారం


అవయవ మార్పిడికి నమోదు చేసుకున్న 804 ఆసుపత్రుల్లో 2025 ఏడాదికి జాతీయ రిజిస్ట్రీ పోర్టల్లో వివరాలను నమోదు చేయనివి 217: టీహెచ్‌వోటీఏ కింద చర్యలు తీసుకోనున్న రాష్ట్రాలు

2025లో జరిగిన అవయవ మార్పిడులు 20,019, భారత్‌లో అవయవ మార్పిడి కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య 2026 మార్చి 3 నాటికి 89,839: నోవోటీటీవో డేటా

నాడు పోస్టు చేయడమైనది: 10 MAR 2026 1:24PM by PIB Hyderabad

అవయవ మార్పిడి శస్త్రచికిత్స చేసేందుకు ఆసుపత్రులకు అనుమతి ఇచ్చే అధికారం ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని సంబంధిత అధీకృత సంస్థలకు ఉంటుందిఅవయవ మార్పిడి చేసేందుకు నమోదు చేసుకున్న 804 ఆసుపత్రుల్లో 217 ఆస్పత్రులు 2025 ఏడాదికి జాతీయ రిజిస్ట్రీ పోర్టల్లో వివరాలను నమోదు చేయడంలో విఫలమయ్యాయిమానవ అవయవాలుకణజాలాల మార్పిడి చట్టం (టీహెచ్ఓటీఏ) -1994లోని నిబంధనలుదాని పరిధిలో రూపొందించిన నియమాలునియంత్రణల ప్రకారం సంబంధిత రాష్ట్ర ప్రభుత్వాలు ఆయా ఆసుపత్రులపై చర్యలు తీసుకోవాలి.

2015 నుంచి జాతీయ అవయవకణజాల మార్పిడి సంస్థ రిజిస్ట్రీ పోర్టల్ పని చేస్తోందిఈ సంస్థ www.notto.mohfw.gov.in వెబ్‌సైట్ ద్వారా ఆసుపత్రులుసంస్థలతో సహా అధీకృత వినియోగదారులకు అందుబాటులో ఉంది.

2026 మార్చి నాటికి జాతీయ అవయవకణజాల మార్పిడి సంస్థ (ఎన్ఓటీటీవోజాతీయ రిజిస్ట్రీ పోర్టల్లో ఆసుపత్రులుఅవయవ మార్పిడి కేంద్రాలు అందించిన సమాచారం ప్రకారం.. దేశంలో ప్రధాన అవయవాల కోసం ఎదురుచూస్తున్న వారి సంఖ్య 89,839. 2025లో దేశంలో నిర్వహించిన అవయవ మార్పిడి శస్త్ర చికిత్సల సంఖ్య 20,019.

జాతీయ అవయవ మార్పిడి కార్యక్రమం (ఎన్‌ఓటీపీ)ని భారత ప్రభుత్వం అమలు చేస్తోందిదేశంలో అవయవ మార్పిడికి సంబంధించిన మౌలిక వసతులనుసంబంధిత సేవలను మెరుగుపరచడంఅవయవ దానంపై అవగాహనను పెంపొందించడమే ఈ కేంద్ర ప్రభుత్వ పథకం లక్ష్యంఈ కార్యక్రమం పరిధిలో ఉత్తర ప్రాంతం (కేంద్రపాలిత ప్రాంతం లదాఖ్ మినహా), తూర్పు ప్రాంతంఈశాన్య ప్రాంతం (మణిపూర్నాగాలాండ్ మినహా)లోని రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో ప్రాంతీయ అవయవకణజాల మార్పిడి సంస్థలు (ఆర్వోటీటీవోలు), రాష్ట్ర అవయవకణజాల మార్పిడి సంస్థలు (ఎస్ఓటీటీవోలుఏర్పాటయ్యాయి.

రాజ్యసభలో అడిగిన ఓ ప్రశ్నకు బదులుగా ఈ సమాచారాన్ని కేంద్ర ఆరోగ్యంకుటుంబ సంక్షేమ శాఖ సహాయ మంత్రి శ్రీ ప్రతాప్ రావ్ జాదవ్ లిఖితపూర్వకంగా అందించారు.

 

***


(రిలీజ్ ఐడి: 2237487) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Bengali , Gujarati