ఆర్థిక మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అసలు టర్నోవరును దాచిపెట్టిన హోటళ్లు… ఆదాయపు పన్ను విభాగం తనిఖీలు


2026 మార్చి 8న 22 రాష్ట్రాల్లో 46 నగరాల్లో ఉన్న 62 రెస్టారెంట్లలో జాతీయ స్థాయిలో సర్వే నిర్వహించిన ఐటీ విభాగం: రూ.408 కోట్ల అమ్మకాలను దాచిపెట్టినట్లు వెల్లడి

స్వచ్ఛంద అంగీకారానికి, విశ్వసనీయ ఆధారిత విధానానికి ప్రాధాన్యమిస్తున్న ఐటీ విభాగం:

పన్ను చెల్లింపుదారులు పొరపాట్లను సరి చేసుకొనేందుకు సూచనలు, సలహాలు ఇవ్వడానికి సాక్షం నజ్ కార్యక్రమం ప్రారంభం

సాక్షం నజ్ క్యాంపెయిన్ మొదటి దశలో గుర్తించిన 63,000 రెస్టారెంట్లకు ఈ-మెయిళ్లు, సంక్షిప్త సందేశాల ద్వారా 2026 మార్చి 31 లోపు తమ రిటర్నులను అప్డేట్ చేయాలని సూచన

నాడు పోస్టు చేయడమైనది: 09 MAR 2026 9:25PM by PIB Hyderabad

2025 నవంబర్‌లో ఆహారంపానీయాల రంగంలో పన్ను ఎగవేతలపై ఆదాయ పన్ను విభాగం దర్యాప్తు ప్రారంభించిందిఅనేక రెస్టారెంట్లు వాస్తవ అమ్మకాలను తక్కువగా చూపించేందుకు పెద్ద మొత్తంలో బిల్లులను తొలగించినట్లుఇతర మార్పులను చేసినట్లు ఈ దర్యాప్తులో గుర్తించారు.

ఏఐ ఆధారిత విశ్లేషణ సాధనాలను ఉపయోగించి ఆహారపానీయాల రంగంలో ఉన్న 1.77 లక్షల రెస్టారెంట్ల లావాదేవీల సమాచారాన్ని అధునాతన పద్ధతిలో విశ్లేషించారుఆదాయ పన్ను రిటర్నుల్లో ప్రకటించిన టర్నోవరుతో ఈ సమాచారాన్ని పోల్చి చూశారుపెద్ద మొత్తంలో ఆదాయ సమాచారాన్ని తక్కువ చేసి చూపినట్లు ఈ విశ్లేషణలో తేలిందికొన్ని సందర్భాల్లోఆర్థికపరమైన ఖాతాలు లేదా సమర్పించిన పన్ను లెక్కల్లో వాస్తవ అమ్మకాలు పూర్తిగా ప్రతిఫలించలేదనినివేదించిన అమ్మకాలను కొన్ని లావాదేవీల నుంచి మినహాయించినట్లు గుర్తించారు.

ఫలితంగా, 22 రాష్ట్రాల్లోని 46 నగరాల్లో ఉన్న 62 రెస్టారెంట్లలో 2026 మార్చి 8న సర్వే నిర్వహించారుసుమారుగా రూ.408 కోట్ల అమ్మకాలను దాచిపెట్టినట్లు ఈ సర్వేలో ప్రాథమికంగా తేలిందిఈ అంశంలో దర్యాప్తు కొనసాగుతోంది.

స్వచ్ఛంద అంగీకారానికివిశ్వసనీయత ఆధారిత విధానానికి ఈ విభాగం ప్రాధాన్యమిస్తుందిపన్ను చెల్లింపుదారులకు వారి పొరపాట్లను సరిచేసుకొనేలా మార్గనిర్దేశం చేయడానికిసూచనలిచ్చేందుకు సాక్షం నజ్ ప్రచారాన్ని ప్రారంభించిందిఆదాయ పన్ను చట్టంలోని 139(8సెక్షన్ ప్రకారం అప్డేట్ చేసిన రిటర్నులను దాఖలు చేయాలని పన్ను చెల్లింపుదారులను ప్రోత్సహిస్తోందిమొదటి దశలోగుర్తించిన 63,000 రెస్టారెంట్లకు ఈ-మెయిళ్లుసంక్షిప్త సందేశాల ద్వారా 2026 మార్చి 31 లోపు తమ రిటర్నులను అప్డేట్ చేయాలని కోరుతోంది.

 

***


(రిలీజ్ ఐడి: 2237383) సందర్శకుల సూచీ సంఖ్య : : 14
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Punjabi , Tamil , Kannada , Malayalam