ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

పవిత్ర పృథ్వి.. దేశానికి శక్తి వనరు అని చాటిన సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకున్న ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 10 MAR 2026 11:13AM by PIB Hyderabad

పవిత్రమైన ఈ భూమి తల్లి దేశానికి శక్తిని అందించే వనరుగా అలరారుతోందని స్పష్టం చేస్తున్న సంస్కృత భాషలోని ఓ సుభాషితాన్ని ప్రజలతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ పంచుకున్నారుఆ సుభాషితం ఇదీ..:
‘‘
యార్ణవేధి సలిలమగ్ర ఆసీద్యాం మాయాభిరన్వచరన్మనీషిణ:
యస్యా హృదయం పరమే వ్యోమన్త్సత్యేనావృతమమృతం పృథివ్యా:
సా నో భూమిస్త్విషిం బలం రాష్ట్రే దధాతూత్తమే’’.

భూమి లోపల మహాసముద్ర జలాలతోనూవెలుపల నీటితోనూ చుట్టి ఉందని ఆలోచనాపరులైన పండితులు తమ జ్ఞ‌ానంతో గ్రహించారుభూమాత హృదయం విశాల గగనపు శాశ్వత సత్యంతో ఆవరించుకొని ఉందిఅలాంటి పుడమి.. మనలో ఉరిమే ఉత్సాహంబలం ఒక మహత్తర దేశంగా మనం నిలదొక్కుకునేటట్లు చూడుగాక అనే సందేశాన్ని ఈ సుభాషితం అందిస్తున్నది.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధాని ఒక సందేశాన్ని పొందుపరుస్తూఅందులో :
‘‘
యార్ణవేధి సలిలమగ్ర ఆసీద్యాం మాయాభిరన్వచరన్మనీషిణ:
యస్యా హృదయం పరమే వ్యోమన్త్సత్యేనావృతమమృతం పృథివ్యా:
సా నో భూమిస్త్విషిం బలం రాష్ట్రే దధాతూత్తమే’’ అని పేర్కొన్నారు.

 

***


(रिलीज़ आईडी: 2237371) आगंतुक पटल : 68
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Bengali-TR , Manipuri , Assamese , Punjabi , Gujarati , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam