ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

కోటా ఎయిర్‌పోర్ట్ భూమిపూజ సందర్భంగా వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పీఎం చేసిన ప్రసంగానికి తెలుగు అనువాదం

నాడు పోస్టు చేయడమైనది: 07 MAR 2026 3:58PM by PIB Hyderabad

కోటాహడోతీ ప్రాంతానికి చెందిన నా మిత్రులందరికీ మరోసారి నమస్కారాలు!

 

వారం కిందటే.. రాజస్థాన్‌ను సందర్శించే అవకాశం నాకు లభించిందిపవిత్రమైన అజ్మేర్ నుంచి వేలాది కోట్ల రూపాయల విలువైన అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించాంశంకుస్థాపనలు చేశాంఅదే కార్యక్రమంలో 21,000 మందికి పైగా రాజస్థాన్ యువతకు నియామక పత్రాలను అందించాంఅజ్మేర్ పర్యటన చేపట్టిన కొన్ని రోజుల వ్యవధిలోనే కోటాలో ముఖ్యమైన విమానాశ్రయ ప్రాజెక్టు పనులను ప్రారంభించే అవకాశం నాకు దక్కిందిఒక వారంలోనే రాజస్థాన్‌లో ప్రారంభమైన ఈ రెండు ప్రధాన అభివృద్ధి కార్యక్రమాలు శక్తిమంతమైన సందేశాన్నిస్తున్నాయిప్రస్తుతం రాజస్థాన్ ఎంత వేగంగా పురోగతి సాధిస్తుందో ఇవి చూపిస్తున్నాయిఅది మౌలిక వసతులుయువతకు ఉద్యోగావకాశాలురైతులుమహిళలకు పథకాలైనా లేదా ప్రతి రంగంలోనూ చేపడుతున్న కార్యక్రమాలైనా రాజస్థాన్లో వేగంగా పని జరుగుతోంది.

 

స్నేహితులారా,

 

కోటాబుండిబరాన్జలావర్మొత్తం హడోతీ ప్రాంతానికి కొత్త ఆశనువిజయాన్నిచ్చిన రోజు ఇదిదాదాపు రూ.1,500 కోట్ల వ్యయంతో నిర్మితమవుతున్న ఈ ఆధునిక విమానాశ్రయం.. భవిష్యత్తులో ఈ మొత్తం ప్రాంత అభివృద్ధిని వేగవంతం చేస్తుందిముఖ్యమైన ఎయిర్పోర్టు ప్రాజెక్టుకు శంకుస్థాపన చేస్తున్న సందర్భంగా కోటాహడోతీ ప్రజలకు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.

 

స్నేహితులారా,

 

2023 నవంబరులో కోటాకు వచ్చినప్పుడు ఇక్కడి ప్రజలకు ఓ మాట ఇచ్చానని నాకు గుర్తుందివిమానాశ్రయం అనేది కలగా మిగిలిపోదనిదానిని నిజం చేస్తామని నేను చెప్పానుఇప్పుడు కోటా విమానాశ్రయ నిర్మాణం ప్రారంభమయ్యే సమయం ఆసన్నమైనందుకు నేను సంతోషిస్తున్నానుఇప్పటివరకు విమాన ప్రయాణానికి జైపూర్ లేదా జోద్‌పూర్‌కు కోటా ప్రజలు వెళ్లాల్సి వచ్చేదిదీనివల్ల సమయం వృథా అయ్యేదిఅసౌకర్యం కలిగేదిఇప్పుడు ఈ పరిస్థితి మారబోతోందిఈ విమానాశ్రయంలో కార్యకలాపాలు ప్రారంభమైతే కోటాపరిసర ప్రాంతాల్లో ప్రయాణం సులభతరమవుతుందివాణిజ్యం వేగంగా విస్తరిస్తుంది.

 

స్నేహితులారా,

 

విద్యా కేంద్రంగా మాత్రమే కాకుండా కోటా ప్రధాన విద్యుత్ కేంద్రంగానూ ఉందిఅణుబొగ్గుగ్యాస్జలం ఇలా దాదాపు అన్ని శక్తి వనరుల నుంచి విద్యుత్‌ను ఉత్పత్తి చేసే ప్రత్యేకమైన ప్రాంతమిదివారసత్వ సంపదకు సైతం హడోతీ ప్రాంతం అంతే ప్రసిద్ధి చెందిందికోటా కచోరీ రుచికోటా డోరియా చీరల అందంకోటా రాయిఇసుక రాయికి ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు లభించిందిఇక్కడి కొత్తిమీరబుండీ బాస్మతీ బియ్యం సువాసన అంతర్జాతీయ మార్కెట్లకు చేరుకుందికష్టపడే తత్వానికిఉత్పాదనకుఅసాధారణ సామర్థ్యానికి ఈ ప్రాంతం పేరుగాంచిందిఇప్పుడు కోటాలో కొత్త విమానాశ్రయంతో ఈ అవకాశాలు అనేక రెట్లు పెరుగుతాయి.

 

స్నేహితులారా,

 

వ్యాపారానికివిశ్వాసానికి కూడా ప్రధాన కేంద్రంగా కోటాహడోతీ ప్రాంతం ఉందిశతాబ్దాలుగామధురాధీశ పీఠాన్నికేశవ్ రాయ్ పటన్ పుణ్యక్షేత్రాన్నిఖడే గణేశ్ మహారాజ్‌నుగోదావరి బాలాజీ ధామ్‌ను సందర్శించడానికి దేశవిదేశాలకు చెందిన భక్తులు ఇక్కడికి వస్తున్నారుగరాడియా మహదేవ్ నుంచి కనిపించే చంబల్ ప్రాంతం అందరినీ మంత్రముగ్ధుల్ని చేస్తుందిముకుంద్రా హిల్స్రామ్‌ఘర్ విష్ధారి లాంటి అభయారణ్యాలు వైల్డ్‌లైఫ్ పర్యాటకానికి ప్రధాన కేంద్రంగా ఈ ప్రాంతాన్ని మారుస్తున్నాయిపెరిగిన విమాన అనుసంధానంతో దేశంప్రపంచం నలుమూలల నుంచి ఈ ప్రాంతాన్ని సందర్శించే పర్యాటకుల సంఖ్య పెరుగుతుందితద్వారా యువతకువర్తకులకుస్థానిక ఆర్థిక వ్యవస్థకు ప్రత్యక్ష లబ్ధి చేకూరుతుంది.

 

స్నేహితులారా,

 

రవాణా అనుసంధానంలో కోటా వేగంగా పురోగతి సాధిస్తోందిఅమృత్ భారత్ స్టేషన్ పథకం కింద కోటాలో ఉన్న రెండు ప్రధాన రైల్వే స్టేషన్లలో ఆధునిక సౌకర్యాలు ఏర్పాటవుతున్నాయికోటాబుండి నుంచి వెళ్లే ఢిల్లీ-ముంబయి ఎక్స్‌ప్రెస్‌ మార్గం ఈ ప్రాంతమంతా అభివృద్ధికి కొత్త అవకాశాలను తీసుకువస్తుందిఢిల్లీవడోదరాముంబయి లాంటి పెద్ద నగరాలను ఇప్పుడు కొన్ని గంటల్లోనే చేరుకోవచ్చుమెరుగైన రోడ్డురైలు మార్గాలతో కొత్త పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటవుతాయిముఖ్యంగా వ్యవసాయాధారిత పరిశ్రమలకు ఈ ప్రాంతం ప్రధాన కేంద్రంగా మారుతుందిరోడ్డురైలు మార్గాలతో పాటుగా విమానయాన సౌకర్యంతో కోటా అభివృద్ధి వేగవంతమవుతుందిహడోతీ ప్రాంతంలోనూపరిసర జిల్లాల్లోనూ ఈ కోటా విమానాశ్రయం కొత్త అవకాశాలను తీసుకువస్తుంది.

 

స్నేహితులారా,

 

ఈ ముఖ్యమైన ప్రాజెక్టు కోసం కోటా పార్లమెంట్ సభ్యులు శ్రీ ఓం బిర్లా నిరంతరాయంగా చేసిన కృషిని నేను అభినందించాలనుకుంటున్నానుకోటా ప్రజల జీవితాలను మెరుగుపరచడంవారికి నూతన అవకాశాలను అందించడమే ఆయన స్థిర లక్ష్యంఅది విమానాశ్రయమైనాఐఐఐటీ నూతన ప్రాంగణమైనా లేదా రోడ్ల విస్తరణ అయినా కోటా అభివృద్ధి కోసం అవిశ్రాంతంగా పని చేస్తున్నారుఆయన ప్రయత్నాల వల్లే కోటాతో పాటు ఈ మొత్తం ప్రాంతమంతా అభివృద్ధిలో కొత్త వేగాన్ని చూస్తోంది.

 

స్నేహితులారా,

 

ఓం బిర్లా గొప్ప పార్లమెంటు సభ్యుడు మాత్రమే కాదు.. అసాధారణమైన లోక్‌సభ స్పీకర్ కూడారాజ్యాంగానికి ఆయన పూర్తిగా నిబద్ధుడుపార్లమెంటరీ సంప్రదాయాలకు కట్టుబడి ఉంటారుఈ రోజుఆయన పార్టీకిప్రతిపక్షాలకు అతీతంగా తటస్థంగా వ్యవహరిస్తున్నారుఆయన్ను సభలో చూసినప్పుడు విద్యకు పేరుగాంచిన నగరానికి చెందినవారు కావడం.. ఆయన పోషిస్తున్న స్పీకర్ పాత్రను ప్రభావితం చేసిందేమో అనిపిస్తుందికుటుంబానికి పెద్దలా ఆయన అందరినీ కలుపుకొని వెళుతూ ఉంటారుపార్లమెంటు సభ్యులందరి భావాలనుఅభ్యర్థనలను ఆయన గౌరవిస్తారుస్పీకర్‌‌గా ఎంపీలను గౌరవించే సహజ స్వభావం ఆయనదిఅహంకారపూరితమైనవిఘాతం కలిగించే కొందరు వ్యక్తులు అప్పుడప్పుడూ ఆటంకం కలిగించేందుకు చూసినామర్యాదపూర్వకంగానే ప్రతి అంశాన్ని నిర్వహిస్తారుఎవ్వరినీ కించపరచరుకఠినమైన మాటలను కూడా సహిస్తారుఎప్పుడూ ఆత్మీయంగా నవ్వుతూ ఉంటారుఅందుకేనేమోఆయన్ను సభలో అందరూ అభిమానిస్తారు.

 

స్నేహితులారా,

 

రవాణా సౌకర్యాలు మెరుగైనప్పుడుఅభివృద్ధి కూడా పెరుగుతుందిగడచిన 11 ఏళ్లలో దేశవ్యాప్తంగా వివిధ ప్రదేశాల్లో నిర్మించిన అనేక కొత్త విమానాశ్రయాలు వృద్ధికి కొత్త వేగాన్ని తీసుకువచ్చాయి. 2014కి ముందు దేశంలో 70 విమానాశ్రయాలు ఉండేవిఈ రోజుఆ సంఖ్య 160కి పైగా పెరిగిందిఈ కొత్త విమానాశ్రయాలు విమానయానాన్ని సులభతరం చేశాయిపర్యాటకాన్ని పెంపొందించాయియువతకు ఉపాధి అవకాశాలను కల్పించాయిప్రాంతీయ అభివృద్ధిని వేగవంతం చేశాయిఢిల్లీ చుట్టుపక్కల సైతం హిసార్హిండన్జేవార్ లాంటి పలు కొత్త ఎయిర్‌పోర్టులు ఏర్పాటయ్యాయికొత్త ఎయిర్పోర్టులుటెర్మినళ్లను నిర్మించినప్పుడు నూతన వ్యాపారాలుసంస్థలు చిన్న నగరాలకు సైతం చేరుకుంటాయిభవిష్యత్తులో ఈ ప్రాంత అభివృద్ధికి నూతన వేగాన్ని కోటాలో నిర్మించే కొత్త విమానాశ్రయం ఇస్తుందని నేను విశ్వసిస్తున్నాను.

 

స్నేహితులారా,

 

రాష్ట్రకేంద్ర ప్రభుత్వాలు కలసి పనిచేసినప్పుడుఆలోచనలు స్పష్టంగాసంకల్పం దృఢంగా ఉన్నప్పుడు అభివృద్ధి వేగం అనేక రెట్లు పెరుగుతుందిఇప్పుడు రాజస్థాన్లో జరుగుతున్నది అదేఅభివృద్ధి చెందిన రాజస్థాన్‌ కోసం ఏర్పాటైన ఈ బలమైన పునాది అభివృద్ధి చెందిన భారత్ అనే సంకల్పానికి శక్తినిస్తుందిసుసంపన్నమైనబలమైనఅవకాశాలతో కూడిన రాజస్థాన్‌ నిర్మించడంలో మనందరం సమష్టిగా విజయం సాధిస్తామని నేను విశ్వసిస్తున్నానుఈ విశ్వాసంతోనేశంకుస్థాపన సందర్భంగా మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నానుధన్యవాదాలువందేమాతరం.

 

***


(రిలీజ్ ఐడి: 2236644) సందర్శకుల సూచీ సంఖ్య : : 7
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Manipuri , Assamese , Bengali , Punjabi , Gujarati , Odia , Kannada