రాష్ట్రపతి సచివాలయం
అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి సందేశం
నాడు పోస్టు చేయడమైనది:
07 MAR 2026 3:29PM by PIB Hyderabad
ప్రతి సంవత్సరం మార్చి 8న జరుపుకునే అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా భారత రాష్ట్రపతి శ్రీమతి ద్రౌపది ముర్ము తన సందేశాన్ని అందించారు.
‘‘అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా దేశ పౌరులందరికీ, ముఖ్యంగా మహిళా లోకానికి నా హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను.
మహిళలు మన సమాజానికి, దేశానికి పునాది వంటివారు. విద్య, సాంకేతికత, క్రీడలు, కళలు, రక్షణ రంగంతో సహా వివిధ రంగాల్లో మహిళలు తమ ప్రతిభను, కృషిని ప్రదర్శిస్తున్నారు.
విద్యావంతులు, స్వయం సమృద్ధి గలవారు, సాధికారత కలిగిన మహిళలు సంపన్నమైన, ప్రగతిశీల దేశ నిర్మాణానికి శక్తిమంతమైన సహకారాన్ని అందించగలరు. నేడు యువతులు నవభారత స్వప్నాలకు రూపకల్పన చేస్తున్నారు. వారికి సరైన అవకాశాలు, మార్గదర్శకత్వం, ప్రోత్సాహం అవసరం. మహిళలకు సమాన అవకాశాలు లభించేలా, వారు తమ సామర్థ్యాల ఆధారంగా ముందుకు సాగి విజయాన్ని సాధించగల సమాజం కోసం మనమందరం కలిసికట్టుగా కృషి చేద్దాం.
మహిళా దినోత్సవ వేడుకలు విజయవంతం కావాలని, మహిళలందరి భవిష్యత్తు ఉజ్వలంగా ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను."
***
(రిలీజ్ ఐడి: 2236620)
సందర్శకుల సూచీ సంఖ్య : : 7