నూతన మరియు పునరుత్పాదక శక్తి మంత్రిత్వ శాఖ
భారత్‌లో హరిత హైడ్రోజన్ ఉత్పాదనల వాణిజ్యాన్ని పెంచేందుకు గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ మెథనాల్ ప్రమాణాలను ప్రకటించిన ప్రభుత్వం
నాడు పోస్టు చేయడమైనది:
07 MAR 2026 11:00AM by PIB Hyderabad
జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ పురోగతికి ముఖ్యమైన చర్యగా భారత్‌లో గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ మెథనాల్ ప్రమాణాలను 2026 ఫిబ్రవరి 27న ప్రభుత్వం నోటిఫై చేసింది. పునరుత్పాదక వనరుల నుంచి ఉత్పన్నమైన హరిత హైడ్రోజన్ నుంచి ఉత్పత్తి చేసిన అమ్మోనియా, మెథనాల్‌ను ‘హరితం’గా వర్గీకరించడానికి పాటించాల్సిన ఉద్గార పరిమితులు, అర్హతల షరతులను నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ (ఎంఎన్ఆర్ఈ) జారీ చేసిన ఈ ప్రమాణాలు వివరిస్తాయి.
భారత్‌లో గ్రీన్ అమ్మోనియా ప్రమాణం- గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, అమ్మోనియా సంశ్లేషణ, శుద్ధి, సంపీడనం, ఆన్-సైట్ నిల్వ నుంచి వెలువడే జీవ సంబంధితం కాని గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల మొత్తంలో కేజీ అమ్మోనియాకు 0.38కేజీలకు మించకుండా కార్భన్ డై ఆక్సైడ్‌ను గ్రీన్ అమ్మోనియా (kg CO₂ eq/kg NH₃) కలిగి ఉండాలి. దీనిని 12 నెలల కాల వ్యవధికి సగటును లెక్కిస్తారు.
భారత్‌లో గ్రీన్ మెథనాల్ ప్రమాణం- గ్రీన్ హైడ్రోజన్ ఉత్పత్తి, అమ్మోనియా సంశ్లేషణ, శుద్ధి, సంపీడనం, ఆన్-సైట్ నిల్వ నుంచి వెలువడే జీవ సంబంధితం కాని గ్రీన్‌హౌస్ వాయు ఉద్గారాల మొత్తంలో కేజీ మెథనాల్‌కు 0.44 కేజీలకు మించకుండా కార్భన్ డై ఆక్సైడ్‌ను గ్రీన్ మెథనాల్ (kg CO₂ eq/kg CH₃OH) కలిగి ఉండాలి. దీనికి 12 నెలల కాల వ్యవధికి సగటును లెక్కిస్తారు.
మెథనాల్ ఉత్పత్తికి అవసరమైన కార్బన్ డై ఆక్సైడ్‌ను బయోజెనిక్ వనరులైన డైరెక్ట్ ఎయిర్ క్యాప్చర్ (డీఏసీ) లేదా ఇప్పటికే ఉన్న పారిశ్రామిక వనరుల నుంచి స్వీకరించవచ్చని ఈ నోటిఫికేషన్ పేర్కొంటుంది. కార్బన్ డై ఆక్సైడ్ కోసం అర్హత కలిగిన వనరులను మంత్రిత్వ శాఖ కాలానుగుణంగా సవరించవచ్చు. తగిన నిబంధనలతో వర్తించేలా రాబోయే రోజుల్లో అమల్లోకి వస్తాయి.
గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ మెథనాల్ ఉత్పత్తి ప్రక్రియలో పునరుత్పాదక వనరుల నుంచి ఉత్పత్తి అయి ఎనర్జీ స్టోరేజీ వ్యవస్థలో నిల్వ చేసిన లేదా వర్తించే నిబంధనలకు అనుగుణంగా గ్రిడ్‌కు అనుసంధానించిన పునరుత్పాదక విద్యుత్ కూడా ఉంటుంది.
గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ ఇథనాల్ కొలత, నివేదిక, పర్యవేక్షణ, ఆన్-సైట్ తనిఖీ, ధ్రువీకరణకు సంబంధించిన వివరణాత్మక పద్ధతులను నూతన, పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ వేర్వేరుగా జారి చేస్తుందని ఈ ప్రకటన స్పష్టం చేసింది.
నోటిఫికేషన్లు జారీ అయిన తేదీ కంటే ముందే జారీ అయిన ఏదైనా టెండరు, బిడ్ ప్రక్రియ లేదా ఆహ్వాన సమయంలో వర్తించే నిబంధనలు, షరతుల ప్రకారం కొనసాగించవచ్చు. అయినప్పటికీ, ఇలాంటి టెండర్‌ను సాధ్యమైతే పార్టీల పరస్పర అంగీకారంతో నోటిఫికేషన్ నిబంధనలకు అనుగుణంగా సేకరణ సంస్థ చేపట్టవచ్చు.
గ్రీన్ హైడ్రోజన్ ఉత్పాదనల అభివృద్ధిలో నిమగ్నమైన పరిశ్రమలు, పెట్టుబడిదారులు, ఇతర భాగస్వాములకు గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ మెథనాల్ ప్రమాణాల నోటిఫికేషన్లు స్పష్టతనిస్తాయి. ఎరువులు, రవాణా, విద్యుత్, భారీ పరిశ్రమ తదితర రంగాల డీకార్బనైజేషన్‌ను ఈ ప్రమాణాలు సులభతరం చేస్తాయి. అదే సమయంలో హరిత ఇంధనాలకు నమ్మకమైన ఉత్పత్తిదారుగా, ఎగుమతిదారుగా భారత్ స్థానాన్ని బలోపేతం చేస్తాయి.
గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ మెథనాల్ ఎగుమతుల మార్కెట్లను భారతీయ గ్రీన్ హైడ్రోజన్ అభివృద్ధిదారులు లక్ష్యంగా చేసుకుంటున్నారు. జాతీయ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ పరిధిలో గ్రీన్ హైడ్రోజన్, దాని ఉత్పన్నాల విషయంలో నియంత్రణలను ఈ నోటిఫికేషన్‌తో మరింత పటిష్టంగా మారతాయి.
భారత గ్రీన్ అమ్మోనియా, గ్రీన్ మెథనాల్ ప్రమాణాల నోటిఫికేషన్లను వేర్వేరుగా ఇక్కడ చూడవచ్చు.
గ్రీన్ మెథనాల్
గ్రీన్ అమ్మోనియా
(రిలీజ్ ఐడి: 2236618)
సందర్శకుల సూచీ సంఖ్య : : 9