యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ
మార్చి నెల 26 నుంచి ఏప్రిల్ 6 వరకూ ఖేలో ఇండియా గిరిజన ఆటలు.. ‘అవకాశాల్నీ, పరిధినీ విస్తరించడంలో ఓ భాగమ’న్న క్రీడల మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా
ఛత్తీస్‌గఢ్‌లోని మూడు నగరాలు.. రాయ్‌పూర్, జగ్‌దల్‌పూర్, సర్గుజాలలో మొదటి ఖేలో ఇండియా గిరిజన ఆటల నిర్వహణ
అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, హాకీ, వెయిట్‌లిఫ్టింగ్, విలువిద్య, ఈత, కుస్తీ.. ఈ ఏడు విభాగాల్లో పతకాల ప్రదానానికి పోటీలు
నాడు పోస్టు చేయడమైనది:
06 MAR 2026 1:10PM by PIB Hyderabad
ఖేలో ఇండియా గిరిజన ఆటల (కేఐటీజీ) ప్రారంభ కార్యక్రమాన్ని మార్చి నెల 26వ తేదీ నుంచి ఏప్రిల్ 6వ తేదీ వరకూ ఛత్తీస్‌గఢ్‌లోని రాయ్‌పూర్, జగ్‌దల్‌పూర్, సర్గుజా నగరాలలో నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల శాఖ మంత్రి డాక్టర్ మన్సుఖ్ మాండవియా గురువారం ప్రకటించారు.
ఈ ఆటల్లో భాగంగా అథ్లెటిక్స్, ఫుట్‌బాల్, హాకీ, వెయిట్‌లిఫ్టింగ్, విలువిద్య, ఈత, కుస్తీ విభాగాల్లోనూ పతకాల్ని ప్రదానం చేయడానికి పోటీలు నిర్వహిస్తారు. వీటికి అదనంగా మల్లఖంబ్, కబడ్డీలను ప్రదర్శన విభాగంలో నిర్వహిస్తారు. కేఐటీజీలో దేశంలోని చాలావరకూ రాష్ట్రాలతో పాటు కేంద్ర పాలిత ప్రాంతాలు పాల్గొంటాయి.

‘‘ఖేలో ఇండియా గిరిజన ఆటల ఉద్దేశం ఆడాలనే కోరిక కలిగిన ప్రతి యువ ప్రతినిధికీ అవకాశాన్నీ, వేదికనీ అందించడమే. ఇది ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ వికసిత్ భారత్ దృష్టికోణంలో భాగం. ఈ యాత్రలో ఆటలకు చాలా పెద్ద పాత్ర ఉంది’’ అని డాక్టర్ మాండవియా అన్నారు.
మొదటి ఖేలో ఇండియా గిరిజన ఆటల (కేఐటీజీ) లోగోనీ, థీమ్ సాంగ్‌తో పాటు మస్కట్‌నీ డిసెంబరు 23న బిలాస్‌పూర్‌లో స్వర్గీయ బి.ఆర్. యాదవ్ స్పోర్ట్స్ స్టేడియంలో లాంఛనంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఛత్తీస్‌గఢ్ ముఖ్యమంత్రి శ్రీ విష్ణు దేవ్ సాయ్‌తో పాటు ఉపముఖ్యమంత్రి శ్రీ అరుణ్ సావ్ కూడా పాల్గొన్నారు.
ఈ ఆటలు గిరిజన ప్రాంతాల్లో ఎదుగుతున్న ప్రతిభావంతులను ప్రోత్సహించడంలో కీలక పాత్రను పోషిస్తాయని డాక్టర్ మాండవియా అన్నారు. ‘‘గిరిజన ప్రాంతాల ప్రతిభావంతుల్ని తెర ముందుకు తీసుకు రావడం చాలా ముఖ్యం. మన ఆటగాళ్ల సంఖ్య అంతకంతకూ విస్తరించవలసిన అవసరం ఇప్పుడు ఉంది. గిరిజన సముదాయంలోని ప్రతిభావంతులైన యువతను త్వరగా గుర్తించాలని, వారికి వ్యస్థీకృత పద్ధతిలో సాయాన్ని అందించాలని, వారిని జాతీయ క్రీడల ప్రణాళికలో చేర్చాలని మేం చొరవ తీసుకుంటున్నాం’’ అని డాక్టర్ మాండవియా వివరించారు.
కేఐటీజీ-2026ను యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ, భారత క్రీడా ప్రాధికార సంస్థ (ఎస్ఏఐ), భారతీయ ఒలింపిక్ సంఘం, జాతీయ క్రీడా సమాఖ్యలతో పాటు ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర నిర్వాహక సంఘం కలిసికట్టుగా నిర్వహిస్తాయి. ఈ ఆటలకు సాంకేతిక ప్రమాణాలను అంతర్జాతీయ పోటీలకు అనుగుణంగా నిర్దేశిస్తారు.
అధికారిక మస్కట్ పేరు ‘మోర్‌వీర్’. ఈ పేరు ఛత్తీస్‌గఢ్ సాంస్కృతిక వారసత్వంతో ముడిపడి ఉంది. రెండు పదాలతో ఇది రూపొందింది.. దీన్లో మోర్ అంటే ఛత్తీస్‌గఢ్ భాషలో ‘నా’ లేక ‘మన’ అని అర్థం. ఇక ‘వీర్’ అంటే సాహసానికీ, పరాక్రమానికీ సూచిక. మోర్‌వీర్ భారత గిరిజన సమాజాల ఉత్సాహం, గౌరవంలతో పాటు గుర్తింపునకు ప్రాతినిధ్యం వహిస్తుంది.
గిరిజన క్రీడాకారులకు అంకితం చేసిన ఈ కీలక జాతీయ కార్యక్రమానికి ఆతిథ్యాన్ని ఇస్తున్న మొదటి రాష్ట్రంగా ఛత్తీస్‌గఢ్ నిలిచింది. ఇది భారత క్రీడా ప్రస్థానంలో గిరిజన సాధికారితతో పాటు క్షేత్ర స్థాయిలో భాగస్వామ్యాన్ని ప్రోత్సహించే దిశలో ఒక కీలక ఘట్టాన్ని సూచిస్తుంది.
కేంద్ర ప్రభుత్వ యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖకు చెందిన ప్రసిద్ధ ఖేలో ఇండియా పథకంలో ఖేలో ఇండియా గిరిజన ఆటలు ఓ భాగం. ప్రజల భాగస్వామ్యాన్ని పెంచడమే కాకుండా, క్రీడల్లో ప్రావీణ్యాన్ని పెంపొందించడం కూడా ఈ పథకం ధ్యేయం. స్పోర్ట్స్ బ్రాడ్‌కాస్టింగ్ సిగ్నల్స్ చట్టం-2007లో భాగంగా ఖేలో ఇండియా గేమ్స్‌ను ‘ జాతీయ ప్రాధాన్యం కలిగిన కార్యక్రమం’గా 2020వ సంవత్సరంలో ప్రకటించారు.
***
(రిలీజ్ ఐడి: 2235946)
సందర్శకుల సూచీ సంఖ్య : : 40