రైల్వే మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

పరిశ్రమల సమగ్ర సామర్థ్యం, నైపుణ్యాలు, సాంకేతికతను అందిపుచ్చుకోవడం రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణకు కీలకం: శ్రీ అశ్వినీ వైష్ణవ్


· 2039-40 నాటికి 7,000 కిలోమీటర్లకు హైస్పీడ్ రైలు నెట్‌వర్కు విస్తరణ.. ఏటా 500 కి.మీ. నిర్మాణం ప్రభుత్వ లక్ష్యం

· మౌలిక సదుపాయాలు, లాజిస్టిక్స్, సరుకు రవాణా రంగాల్లో ఆర్థిక వృద్ధిని బలోపేతం చేయడంపై నిర్వహించిన వెబినార్‌లో కేంద్ర మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ప్రసంగం

· వివాదాలను తగ్గించి, సకాలంలో ప్రాజెక్టులను పూర్తి చేయడానికి మూడు కీలక సూత్రాలు: సమన్వయంతో సామర్థ్య విస్తరణ, బలమైన నాణ్యత ప్రమాణాలు, కాంట్రాక్టు సంస్కరణలు

· రైల్వే ప్రాజెక్టుల్లోని విభిన్న సంక్లిష్టతను వివరించిన కేంద్ర మంత్రి.. వాటి అమలులో ప్రత్యేక నైపుణ్యం, అనుభవం అత్యావశ్యకమన్న శ్రీ అశ్వినీ వైష్ణవ్

· ప్రభుత్వ ప్రాజెక్టుల్లో తక్కువ ధరలకే బిడ్లు వేయడం, న్యాయపరమైన వివాదాలను నివారించేలా.. కఠినతరమైన టెండర్ నిబంధనలు అవసరమన్న కేంద్ర మంత్రి... సబ్‌కాంట్రాక్టులను తగ్గించాలన్న శ్రీ అశ్వినీ వైష్ణవ్

నాడు పోస్టు చేయడమైనది: 03 MAR 2026 7:10PM by PIB Hyderabad

నిరంతర ఆర్థిక వృద్ధిఆర్థిక వ్యవస్థ బలోపేతంమౌలిక సదుపాయాలులాజిస్టిక్స్సరుకు రవాణా’ అంశంపై ఈ రోజు నిర్వహించిన రెండో బడ్జెట్ వెబ్‌నార్‌నుద్దేశించి కేంద్ర రైల్వేసమాచార ప్రసారఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక శాఖల మంత్రి శ్రీ అశ్వినీ వైష్ణవ్ ప్రసంగించారు.

సమన్వయంతో కూడిన పద్ధతుల్లో సామర్థ్యాన్ని పెంపొందించడంనాణ్యతఅర్హత ప్రమాణాలను బలోపేతం చేయడంవివాదాలను తగ్గించి ప్రాజెక్టులను సకాలంలో పూర్తి చేసేలా ఒప్పంద పత్రాలు (డాక్యుమెంటేషన్), కాంట్రాక్ట్ నిబంధనలను సంస్కరించడం... ఈ మూడు కీలక అంశాలను ఈ వెబినార్ సందర్భంగా కేంద్ర మంత్రి ప్రధానంగా ప్రస్తావించారు.

సమన్వయంతో రైల్వే మౌలిక సదుపాయాల విస్తరణ

గత దశాబ్ద కాలంలో భారత రైల్వే వ్యవస్థ అపూర్వ వృద్ధిని సాధించిందని శ్రీ వైష్ణవ్ అన్నారుదాదాపు 35,000 కిలోమీటర్ల కొత్త రైల్వే మార్గాలను నిర్మించామనీజర్మనీలోని మొత్తం రైల్వే నెట్‌వర్క్ కన్నా ఇది ఎక్కువనీ వివరించారుఅలాగే దాదాపు 99 శాతం నెట్‌వర్కు (దాదాపు 55,000 కి.మీ)కు సంబంధించి విద్యుదీకరణ పూర్తయిందనీ.. జర్మనీబెల్జియంస్విట్జర్లాండ్డెన్మార్క్ దేశాల మొత్తం రైల్వే నెట్‌వర్క్‌లను కలిపి చూసినా ఇదే ఎక్కువనీ తెలిపారు.

ఇంతటి వేగవంతమైన విస్తరణ ఒక ముఖ్యమైన సవాలును మన ఎదుట నిలిపిందని శ్రీ అశ్వినీ వైష్ణవ్ అన్నారుప్రభుత్వం చేపడుతున్న విస్తరణకు అనుగుణంగా పరిశ్రమల సామర్థ్యాన్నీవనరులనూ ఆ స్థాయిలో పెంపొందించడం ఆవవ్యకమన్నారురైల్వే అభివృద్ధి ప్రధానంగా పరిశ్రమప్రభుత్వం మధ్య భాగస్వామ్యమని ఆయన స్పష్టం చేశారుప్రాజెక్టుల పరిధుల్లో అకస్మాత్తుగా వచ్చే హెచ్చుతగ్గులు పరిశ్రమల సన్నద్ధతపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతాయన్నారుఅందువల్ల మౌలిక సదుపాయాల విస్తరణతోపాటు.. నైపుణ్యాభివృద్ధిపర్యవేక్షణనాణ్యత ప్రమాణాలుసాంకేతికతను అందిపుచ్చుకోవడం వంటివి కూడా సమన్వయంతో ముందుకు సాగాలన్నారుపరిశ్రమ వర్గాల నుంచి వచ్చే సూచనలు భవిష్యత్ సంస్కరణల రూపకల్పనలో దోహదపడతాయన్నారు.

హైస్పీడ్ రైలు సంకల్పంవిప్లవాత్మక ప్రాజెక్టులు

హైస్పీడ్ రైలు అభివృద్ధి గురించి మాట్లాడుతూ.. ముంబయి అహ్మదాబాద్ హైస్పీడ్ రైల్ కారిడార్‌ను సవాలుతో కూడిన అభ్యసన దశగా మంత్రి పేర్కొన్నారుగంటకు 160 కిలోమీటర్ల వేగానికి మించి రైళ్లను నడపడం వల్ల డిజైన్కార్యాచరణలో సంక్లిష్టత విపరీతంగా పెరుగుతుందని ఆయన పేర్కొన్నారు.

ఐఐటీలుపారిశ్రామిక భాగస్వాములురైల్వే ఇంజినీర్ల సహకారంతో భారత్ ఈ సవాళ్లను విజయవంతంగా అధిగమించిందిజపాన్ భాగస్వాములు మొదట్లో నెలకు రెండు కిలోమీటర్ల నిర్మాణాన్ని అంచనా వేయగా.. భారత్ నెలకు 15 కిలోమీటర్ల వేగంతో పనులు పూర్తి చేసిందిదీంతో భవిష్యత్తులోనూ కారిడార్ల నిర్మాణంలో పాలుపంచుకోవడానికి జపాన్ ఆసక్తి కనబరిచింది.

ఈ విజయం అందించిన స్ఫూర్తితో.. దాదాపు రూ16 లక్షల కోట్ల అంచనా పెట్టుబడితో 4,000 కిలోమీటర్ల మేర ఏడు కొత్త హైస్పీడ్ ప్యాసెంజర్ కారిడార్లకు గౌరవ ప్రధానమంత్రి ఆమోదం తెలిపారని కేంద్ర మంత్రి ప్రకటించారుమరో పదేళ్లలో ఇవి పూర్తవుతాయన్నారు.

ఇందుకోసం ఏటా దాదాపు 500 కిలోమీటర్ల మేర పనులు పూర్తి చేయాల్సి ఉంటుందిఇది ముంబయి అహ్మదాబాద్ కారిడార్‌తో సమానమైన పరిమాణంమరో 3,000 కిలోమీటర్ల పనుల మంజూరుకు ప్రణాళికలు సిద్ధమవుతున్నాయితద్వారా 2039–40 నాటికి 7,000 కిలోమీటర్ల నెట్‌వర్కును లక్ష్యంగా నిర్దేశించుకున్నారుఅలాగే దీర్ఘకాలిక లక్ష్యంలో భాగంగా 15,000 నుంచి 21,000 కిలోమీటర్ల హైస్పీడ్ రైలు మార్గాన్ని నిర్మించాలని భావిస్తున్నారు.

ఈ లక్ష్యాలను చేరుకోవాలంటే రైల్వేలుపరిశ్రమలుసరఫరా వ్యవస్థలుపరికరాల తయారీదారులుసేవలందించే సిబ్బందినిర్వహణ బృందాలుసిగ్నలింగ్ నిపుణులురవాణా సామగ్రి తయారీదారులుప్రత్యేక ఎలక్ట్రికల్ కండక్టర్ల ఉత్పత్తిదారుల మధ్య సమన్వయంతో కూడిన కృషి ఆవశ్యకమని శ్రీ అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారుఈ సవాళ్లపై చర్చించడానికి ప్రత్యేక వర్క్‌షాప్‌లు నిర్వహించాల్సిందిగా ముఖ్య నిర్మాణడిజైన్ సంస్థలను ఆయన ఆహ్వానించారు.

నాణ్యతఅర్హతటెండర్ నిబంధనల బలోపేతం

అర్హత ప్రమాణాలను కఠినతరం చేయడంమితిమీరిన సబ్‌కాంట్రాక్టింగును తగ్గించడం అత్యవసరమని శ్రీ అశ్వినీ వైష్ణవ్ స్పష్టం చేశారుటెండర్ నిబంధనలు సరళంగా ఉండడం వల్ల చాలాసార్లు 20 - 30 మంది బిడ్డర్లు పాల్గొంటున్నారనీఫలితంగా అంచనా వ్యయం కన్నా 20 నుంచి 30 శాతం తక్కువకే బిడ్లు దాఖలవుతున్నాయని ఆయన అభిప్రాయపడ్డారుఈ పద్ధతులు చాలావరకూ ఖర్చులను తగ్గించుకోవడానికీవివాదాలకూరాజీలకూ కారణమవుతాయన్నారు.

సబ్‌కాంట్రాక్టులు 40 శాతానికి మించకుండా చూడాలని శ్రీ వైష్ణవ్ స్పష్టం చేశారుప్రైవేటు రంగంలో క్లిష్టమైన ప్రాజెక్టుల్లో సాధారణంగా ఇది 20 నుంచి 30 శాతానికే పరిమితమై ఉంటుందని గుర్తుచేశారుప్రభుత్వ నిధులను సమర్థంగా వినియోగించాలనీవివాదాలను తగ్గించాలనీ చెబుతూ.. ప్రభుత్వ ప్రాజెక్టులు మరింత కఠినమైన నాణ్యతజవాబుదారీ ప్రమాణాలకు కట్టుబడి ఉండాలని స్పష్టం చేశారు.

బహుముఖీన సంక్లిష్టతలుసంబంధిత రంగంలో నైపుణ్యం ఆవశ్యకత

రైల్వే ప్రాజెక్టుల సంక్లిష్టతను వివరిస్తూ.. రహదారుల మాదిరిగా కాకుండా రైల్వే ప్రాజెక్టుల్లో ఆరు కీలకమైన అంశాలుంటాయని కేంద్ర మంత్రి వివరించారు:

·        ట్రాక్ నిర్మాణం

·        ఉపరితల విద్యుదీకరణ వ్యవస్థలు (వీటిని పవర్ గ్రిడ్‌లతో పోల్చవచ్చు)

·        సిగ్నలింగ్ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్కులు (టెలికాం మౌలిక సదుపాయాల వంటివి)

·        స్టేషన్ అభివృద్ధి (పెద్ద రియల్ ఎస్టేట్ వ్యవస్థ వంటిది)

·        రైలు ఇంజిన్లుకోచ్‌ల నిర్వహణ కార్యకలాపాలు

·        సమన్వయంతో కూడిన నిర్వహణపర్యవేక్షణ

కాంట్రాక్టుల కేటాయింపు కోసం ఆయా రంగాల్లో ప్రత్యేకానుభవంనిర్దిష్ట పరిజ్ఞానం అత్యావశ్యకమని ఆయన స్పష్టం చేశారుపౌర విమానయానజల రవాణా రంగాల్లోనూ ఇలాంటి విధానాలు అవసరమని అభిప్రాయపడ్డారుసంబంధిత నైపుణ్యం లేని సంస్థలు పనులు చేపడితే ప్రాజెక్టులు ఆలస్యం కావడంవ్యయం పెరిగిపోవడంన్యాయపరమైన చిక్కులు ఎదురవుతున్నాయని పేర్కొన్నారు.

పారిశ్రామిక సహకారంభాగస్వాముల ప్రమేయం

బడ్జెట్ అనంతర వెబినార్‌లో విలువైన అభిప్రాయాలను పంచుకున్న పరిశ్రమ నిపుణులువివిధ మంత్రిత్వ శాఖల ప్రతినిధులుప్రాజెక్టు అమలు సంస్థలుభాగస్వాములకు శ్రీ అశ్వినీ వైష్ణవ్ కృతజ్ఞతలు తెలిపారుఈ సందర్భంగా వారి సూచనలు ఈ రంగంలో సంస్కరణలకు పునాదిగా నిలుస్తాయన్నారు.

కేంద్ర మంత్రులు శ్రీ మనోహర్ లాల్ ఖట్టర్శ్రీ సర్బానంద సోనోవాల్శ్రీ కెరాంమోహన్ నాయుడుతోపాటు ఓడరేవులునౌకాయానంజలరవాణావిద్యుత్పౌర విమానయాన శాఖల కార్యదర్శులకు శ్రీ అశ్వినీ వైష్ణవ్ కృతజ్ఞతలు తెలిపారుకేంద్ర బడ్జెట్ ప్రకటనలకు అనుగుణంగా కీలక అంశాలపై చర్చించడానికివినూత్న పరిష్కారాలను రూపొందించడానికి ఈ వెబినార్ ఒక ప్రభావవంతమైన వేదికగా నిలిచిందన్నారు.  

 

***


(రిలీజ్ ఐడి: 2235258) సందర్శకుల సూచీ సంఖ్య : : 64
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Marathi , Gujarati , Kannada