ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

సౌదీ అరేబియా యువరాజు, ప్రధానితో చర్చించిన భారత ప్రధాని

నాడు పోస్టు చేయడమైనది: 02 MAR 2026 7:50PM by PIB Hyderabad

గౌరవ సౌదీ యువరాజుఆ దేశ ప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్‌తో భారత ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ చర్చించారు.

పశ్చిమాసియా పరిణామాలపై వారిద్దరూ చర్చించారుసౌదీ అరేబియాపై ఇటీవలి దాడులను తీవ్రంగా ఖండించిన ప్రధానమంత్రి శ్రీ మోదీ.. అది సార్వభౌమత్వాన్నీప్రాంతీయ సమగ్రతనూ ఉల్లంఘించడమేనని స్పష్టం చేశారు.

వీలైనంత త్వరగా పశ్చిమాసియా ప్రాంతంలో శాంతినీస్థిరత్వాన్నీ పునరుద్ధరించడమే ప్రస్తుతం అత్యంత ప్రధానమైన అంశమని వారిద్దరూ అంగీకారానికి వచ్చారు.

ఈ కష్ట కాలంలో సౌదీ అరేబియాలోని భారతీయులకు రక్షణ కల్పిస్తున్న గౌరవ యువరాజుకు భారత ప్రధానమంత్రి శ్రీ మోదీ కృతజ్ఞతలు తెలిపారు.

సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఇలా పేర్కొన్నారు:

‘‘పశ్చిమాసియాలో పరిణామాలపై గౌరవ సౌదీ అరేబియా యువరాజుప్రధానమంత్రి మహమ్మద్ బిన్ సల్మాన్‌తో చర్చించానుఆ దేశ సార్వభౌమత్వానికీప్రాదేశిక సమగ్రతకూ భంగం కలిగించేలా.. సౌదీ అరేబియాపై ఇటీవల జరిగిన దాడులను భారత్ తీవ్రంగా ఖండిస్తోందిపశ్చిమాసియా ప్రాంతంలో శాంతినీస్థిరత్వాన్నీ పునరుద్ధరించడమే ప్రస్తుతం అత్యంత ప్రధానమైన అంశమన్న ఏకాభిప్రాయానికి వచ్చాంఈ కష్టకాలంలో సౌదీ అరేబియాలోని భారతీయులకు రక్షణ కల్పిస్తున్న యువరాజుకు కృతజ్ఞతలు తెలియజేస్తున్నాను.’’ 

 

***


(రిలీజ్ ఐడి: 2234789) సందర్శకుల సూచీ సంఖ్య : : 5
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Manipuri , Gujarati , Tamil , Kannada