ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

బహ్రెయిన్ రాజుతో ఫోన్‌లో మాట్లాడిన ప్రధానమంత్రి

నాడు పోస్టు చేయడమైనది: 02 MAR 2026 7:32PM by PIB Hyderabad

బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఫోన్‌లో మాట్లాడారు.

ఈ సంభాషణ సందర్భంగా బహ్రెయిన్‌పై ఇటీవల జరిగిన దాడులను ప్రధానమంత్రి మోదీ తీవ్రంగా ఖండించారు. ఈ కష్టకాలంలో బహ్రెయిన్ ప్రజలకు భారత్‌  దృఢమైన సంఘీభావాన్ని తెలియజేస్తుందని ఆయన పేర్కొన్నారు.

బహ్రెయిన్‌లోని భారత ప్రజలకు అందిస్తున్న స్థిరమైన మద్దతు, సంరక్షణకు గానూ ప్రధానమంత్రి ధన్యవాదాలు తెలిపారు.

సామాజిక మాధ్యమం ఎక్స్‌ లో ప్రధానమంత్రి ఈ విధంగా పేర్కొన్నారు.

‘‘బహ్రెయిన్ రాజు హమద్ బిన్ ఇసా అల్ ఖలీఫాతో ఫోన్లో మాట్లాడాను. బహ్రెయిన్‌పై జరిగిన దాడులను భారత్ ఖండిస్తోంది. ఈ కష్టకాలంలో అక్కడి ప్రజలకు భారత్‌ అండగా నిలుస్తుంది. బహ్రెయిన్‌లోని భారతీయ సమాజానికి అందిస్తున్న స్థిరమైన మద్దతుకు ఆయనకు ధన్యవాదాలు తెలుపుతున్నాను’’.


(రిలీజ్ ఐడి: 2234754) సందర్శకుల సూచీ సంఖ్య : : 96