ప్రధాన మంత్రి కార్యాలయం
ఆత్మవిశ్వాసం, ఇచ్ఛాశక్తిల ప్రాధాన్యాన్ని చాటిచెప్పే ఒక సంస్కృత సుభాషితాన్ని పంచుకున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
02 MAR 2026 8:50AM by PIB Hyderabad
దేశంలో యువతకు ఉన్న సామర్థ్యాన్ని స్పష్టం చేస్తూ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఒక సందేశాన్ని ప్రజలతో పంచుకున్నారు. ఆత్మవిశ్వాసం, ఇచ్ఛాశక్తిల ప్రాధాన్యాన్ని చాటిచెప్పే ఒక సంస్కృత సుభాషితాన్ని ప్రధాని తన సందేశంలో పొందుపరిచారు.
భారతదేశ యువశక్తి దృఢ సంకల్పం సాటిలేనిదని ప్రధానమంత్రి ఉద్ఘాటించారు. మన యువ మిత్రులు ఏదైనా చేయాలని సంకల్పించుకున్నారంటే, దానిని పూర్తి చేసి తీరుతారు. మరి ఈ కారణంగానే దేశం ప్రస్తుతం తన కలల్ని నిజం చేసుకొంటోంది అని ఆయన అన్నారు.
సామాజిక మాధ్యమం ‘ఎక్స్’లో ప్రధానమంత్రి ఒక సందేశాన్ని పొందుపరుస్తూ -
‘‘భరతవర్షంలో యువశక్తి దృఢ సంకల్పం సాటిలేనిది. మన యువ సహచరులు దేనినైనా సాధించాలి అని సంకల్పించుకున్నారంటే, దానిని చేసి చూపిస్తారు. ఈ కారణంగానే ప్రస్తుతం దేశం తన స్వప్నాలను సాకారం చేసుకొంటోంది.
న వా ఉ మాం వృజనే వారయన్తే న పర్వతాసో యదహం మనస్యే
మమ స్వనాత్ కృధుకర్ణో భయాత్ ఎవేదను ద్యూన్కిరణ సమేజాత్’’
పై శ్లోకం ‘‘మీ ఆత్మవిశ్వాసానికున్న శక్తి అపారం. మీ ఆత్మవిశ్వాసాన్ని ఎవరూ అణగదొక్క జాలరు. పెద్ద పెద్ద పర్వతాలంత అవరోధాలు అయినా సరే, మిమ్మల్ని నిలువరించ జాలవు. సూర్యుని కన్నా ఎక్కువ శక్తిమంతులు మీరు. కావలసిందల్లా, మీ ఇచ్ఛాశక్తిని మీరు గుర్తించడం ఒక్కటే సుమా’’ అని చెబుతున్నది.
***
(రిలీజ్ ఐడి: 2234663)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు:
English
,
Urdu
,
Marathi
,
हिन्दी
,
Assamese
,
Bengali
,
Manipuri
,
Gujarati
,
Tamil
,
Kannada
,
Malayalam