ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

కేరళలోని త్రిశూర్‌లో చేతన గానాశ్రమానికి శంకుస్థాపన చేసిన ఉపరాష్ట్రపతి


‘‘భారత్‌లో సంగీతం ఒక ఆధ్యాత్మిక పయనం.. ఒక ధ్యానం.. ఒక ప్రార్థన.. జీవితాన్ని పండుగ చేసుకోవడం లాంటిది’’: ఉపరాష్ట్రపతి

‘‘సంగీతం మన నాగరికతలో పవిత్ర గంగ లాగా ప్రవహిస్తోంది’’: ఉపరాష్ట్రపతి

చేతన గానాశ్రమం.. ఒక పర్యావరణ మిత్ర పూర్వక సంగీత ప్రాంగణం..

ఇది సామాజిక, ధార్మిక సామరస్యాన్ని పెంపొందింప చేస్తుంది’’: ఉపరాష్ట్రపతి

‘‘సంగీతంలో ప్రతి ఒక్క స్వరానికీ తనదైన గుర్తింపు ఉంది.. అయితే అవన్నీ కలిసికట్టుగా ఉన్నప్పుడు శ్రావ్యతని పంచుతాయి. ఇదే మాదిరిగా, మానవులు.. వేరు వేరుగా ఉన్నా కూడా.. ఒక ఉన్నత పరమార్థ సాధన కోసం జట్టుగా కదిలారంటే, సామరస్యాన్ని సాధించగలుగుతారు’’: ఉపరాష్ట్రపతి

‘‘వేగంగా పయనిస్తున్న ఈ కాలంలో.. తరచు ఉద్రిక్తతలు చెలరేగుతున్న ఈ ప్రపంచంలో, సంగీతానికి ఉన్న చికిత్సాత్మక శక్తి

ఇదివరకటితో పోలిస్తే ఇప్పుడు మరింత ఎక్కువ సందర్భ శుద్ధిని సంతరించుకుంది’’: ఉపరాష్ట్రపతి

నాడు పోస్టు చేయడమైనది: 01 MAR 2026 1:24PM by PIB Hyderabad

కేరళలోని త్రిశూర్‌లో చేతన గానాశ్రమానికి ఉపరాష్ట్రపతి శ్రీ సి.పిరాధాకృష్ణన్ ఈ రోజు శంకుస్థాపన చేశారుఈ ఆశ్రమాన్ని అన్ని ధర్మాల ప్రజల ఆధ్యాత్మిక జాగృతికి ఉద్దేశించిన ఓ సంగీతసాంస్కృతిక ప్రాంగణంగా తీర్చిదిద్దుతారు.

చేతన గానాశ్రమం కురియాకోస్ ఎలియాస్ సర్వీస్ సొసైటీ (కేఈఎస్ఎస్చేపట్టిన ప్రాజెక్టుఅంతేకాదుఇది త్రిశూర్‌లోని సీఎమ్ఐ దేవమాత పబ్లిక్ స్కూల్ అమలు చేస్తున్న కార్యక్రమాల్లో ఒకటి.

ఈ సందర్భంగా సభను ఉద్దేశించి ఉపరాష్ట్రపతి ప్రసంగిస్తూ, భారత్‌లో వేల సంవత్సరాల నుంచీ సమృద్ధమైన సంగీత పరంపర అలరారుతోందన్నారు. ‘‘భారత్‌లో సంగీతం అంటే కేవలం శబ్దం కాదు.. అది ఒక ఆధ్యాత్మిక ప్రయాణంఓ ధ్యానంఓ ప్రార్థనఅంతేకాక జీవితాన్ని పండుగ చేసుకోవడం లాంటిది’’ అని ఉపరాష్ట్రపతి వర్ణించారుసంగీతమంటే భారత ప్రాచీన నాగరికతకు సంబంధించిన ఆత్మను అత్యంత శుద్ధంగా వ్యక్తీకరించడంలక్షలాది హృదయాల్ని పెనవేసే ఓ శక్తిమంతమైన బంధం అని ఆయన అన్నారు.

భారతీయ సంగీతానికున్న నాగరికతాపరమైన గాఢతను ఉపరాష్ట్రపతి ప్రస్తావిస్తూ, వేద మంత్రాల మొదలు సాధువుల భక్తిపూరిత ప్రబోధాల వరకూ.. సంగీతం పవిత్ర గంగ లాగా దేశమంతటా ప్రవహిస్తోందన్నారు.

దక్షిణ భారతదేశంలో ఎంతో కాలం నుంచీ చైతన్యవంతమైన సంగీత సంస్కృతి మనగలుగుతూ వచ్చిందనడానికి చరిత్రలో నిదర్శనాలు ఉన్నాయని ఉపరాష్ట్రపతి ప్రస్తావించారు. వాటిలో చోళ రాజులు నిర్మించిన బృహదీశ్వర ఆలయంలోని శిలాశాసనాలు భాగమని తెలిపారుఆ శిలాశాసనాలు వందలాది సంగీతకారులతో పాటు నృత్యకారుల నియామకానికీవారు పొందిన మద్దతుకూ నిరూపణలుగా నిలిచాయి అని ఆయన అన్నారుతేవరమ్ వంటి పవిత్ర స్తోత్రాలను ఆలయాల్లో క్రమం తప్పక ఆలపించే వారని వెల్లడించారుఇవన్నీ భారత సంగీత వారసత్వానికి ఉన్న శాశ్వతత్వాన్ని చాటిచెబుతున్నాయన్నారు.

భారత్‌లోని విభిన్న సంప్రదాయాల్ని గురించి ఉపరాష్ట్రపతి చెబుతూ.. హిందుస్తానీకర్నాటక శాస్త్రీయ సంగీతాల్ని ధ్వని తాలూకు లోతయిన విజ్ఞ‌ానశాస్త్రాలుగా వర్ణించారుశాశ్వతత్వాన్ని సంపాదించుకున్న త్యాగరాజు కీర్తనల్నీతాన్‌సేన్ అపార ప్రతిభనీఎమ్.ఎస్సబ్బులక్ష్మి అజరామర గాత్రాన్నీరవి శంకర్ ప్రపంచవ్యాప్తంగా ప్రసరించిన ప్రభావాన్నీ ఆయన గుర్తు చేశారుభారతీయ సంగీతం అనేక ఖండాల్లో శ్రోతలకు స్ఫూర్తిని అందించిందన్నారు.

పాశ్చాత్య సంగీతమైనాలేక భారతీయ సంగీతమైనా ఏడు స్వరాలతో రూపొందిందేనని ఉపరాష్ట్రపతి అన్నారుసప్త స్వరాల్లో మానవ భావోద్వేగాలు ప్రతిధ్వనిస్తాయి.. అవి శ్వాసను క్రమబద్ధం చేస్తాయి.. హృదయస్పందనను నిలకడగా ఉంచుతాయి.. ఒత్తిడిని తగ్గించడంతో పాటు ఏకాగ్రతను పెంపొందిస్తాయని ఆయన చెప్పారు. ‘‘ఉషోదయ సమయాన ఒక సుందర రాగం చెవి సోకినాలేదా ఓ భక్తిభావం నిండిన భజన ఏ పవిత్ర స్థలాన్నయినా ఆవరించినా.. సంగీతం ఔషధంలా మారుతుంది’’ అని ఆయన అన్నారు.

సంగీత ధ్యానానికీచికిత్సకీ అంకితమయ్యే పర్యావరణమిత్ర పూర్వక ప్రాంగణంగా చేతన గానాశ్రమాన్ని రూపుదిద్దాలని ప్రతిపాదించడం ప్రశంసనీయమని ఉపరాష్ట్రపతి అన్నారుసప్త స్వరాల్లో ప్రతి ఒక్క ప్రత్యేక స్వరమూ భిన్నత్వంలో ఏకత్వాన్ని కలిగి ఉందిఅయినప్పటికీ అవి కలిసికట్టుగా ఉంటూ మానవ జాతికి ఒక ప్రధాన పాఠాన్ని బోధిస్తున్నాయని ఆయన తెలిపారు.

గానాశ్రమంలో సమ్మిళిత నిర్వహణకు ఏర్పాట్లు చేయడం ప్రశంసనీయమని ఉపరాష్ట్రపతి అన్నారుదీనిలో వేరు వేరు ధర్మాల వారికి ప్రాతినిధ్యాన్ని కల్పించారు.. ఉదాహరణకు శ్రీ కె.జెయేసుదాస్ వంటి గాయకుడికి స్థానం కల్పించారంటూ ఉపరాష్ట్రపతి ప్రస్తావించారుసంగీతంధ్యానాల ఆధ్యాత్మిక గొడుగు నీడ లోకి ప్రజలను తీసుకు రావడానికి గానాశ్రమం చేస్తున్న ప్రయత్నాలను ఆయన ప్రశంసించారు.

అయిదు ఆలయాలను నిర్మించాలన్న ప్రతిపాదనను గురించి ఉపరాష్ట్రపతి తన ప్రసంగంలో ప్రస్తావించారు. వాటిలో ‘ధ్యానాలయం’ (దీనిని సంగీత ధ్యానానికి ఉద్దేశించారు), ‘సంగీతాలయం’ (దీనిని నాడీశాస్త్ర విజ్ఞ‌ాన సంబంధిత సంగీత చికిత్సకి ఉద్దేశించారు), ‘శబ్దాలయం’ (దీనిని ధ్వని చికిత్సకు ఉద్దేశించారు), ‘కళాలయం’ (దీనిని భారతీయ సంగీతనాట్యాలకు ఉద్దేశించారు), ‘యోగాలయం’ (దీనిని యోగ చికిత్సకు ఉద్దేశించారుఉన్నాయని వెల్లడించారుఈ సంస్థ ఎంతో మందిని మేలుకొలిపిస్వస్థతను చేకూర్చగలుగుతుందన్న విశ్వాసం తనకు ఉందని ఆయన చెప్పారు.

యోగాకు గల ప్రాచీన జ్ఞ‌ానం ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ దూరదర్శి నాయకత్వంలో ప్రపంచమంతటా మున్నెన్నడూ ఎరుగనంత గుర్తింపును సంపాదించుకోవడంతో పాటుభారత సాఫ్ట్ పవర్‌కు ఒక సంకేతంగా ఎదిగిందని ఉపరాష్ట్రపతి అన్నారుభారత నాగరికతలోని ‘వసుధైవ కుటుంబకమ్’ తాత్త్వికతను యోగా ప్రతిబింబిస్తోందని ఆయన చెప్పారుకేంద్ర ప్రభుత్వం సంగీత సంప్రదాయాల మార్పిడి కోసం చైతన్యవంతమైన వేదికల్ని రూపొందించిందనీవాటితో భిన్నత్వంలో ఏకత్వం బలోపేతమైందనీభారత సాంస్కృతిక వారసత్వానికి ప్రపంచం నలుమూలలా వేనోళ్ల ప్రశంసలు దక్కుతున్నాయనీ ఉపరాష్ట్రపతి అన్నారు.

వేగంగా ముందుకు సాగిపోతున్నతరచుగా ఒత్తిళ్లకు లోనవుతున్న నేటి ప్రపంచంలోసంగీతానికున్న చికిత్సాత్మక శక్తి ఇదివరకటి కన్న ప్రస్తుతం మరింత ఎక్కువ సందర్భ శుద్ధిని సంతరించుకొంది అని ఉపరాష్ట్రపతి తన ప్రసంగం ముగింపు సందర్భంగా స్పష్టం చేశారుచేతన గానాశ్రమం గొప్పగా విజయవంతమవ్వాలని ఆకాంక్షించారాయన. ‘రిని..’ ఈ ఏడు స్వరాల నిత్య తరంగాలు ప్రజల మనసులకు ఓదార్పునందిస్తూమానవ జాతి సద్భావన మార్గంలో సాగేలా మార్గదర్శనం చేస్తూనే ఉంటాయన్న ఆశాభావాన్ని ఉపరాష్ట్రపతి వ్యక్తం చేశారు.

ఈ కార్యక్రమంలో పాలుపంచుకొన్న వారిలో.. కేరళ గవర్నరు శ్రీ రాజేంద్ర విశ్వనాథ్ అర్లేకర్కేంద్ర పెట్రోలియమ్సహజ వాయువుల శాఖపర్యటక శాఖ సహాయ మంత్రి శ్రీ సురేశ్ గోపికేరళ ప్రభుత్వ ఉన్నత విద్య శాఖసాంఘిక న్యాయ శాఖ మంత్రి డాక్టర్ ఆర్బిందుత్రిశూర్ నగరపాలక సంస్థ మేయర్ డాక్టర్ నిజీ జస్టిన్త్రిశూర్ ముఖ్య క్రైస్తవ మత గురువు శ్రీ మార్ ఏండ్రూస్ థజాథ్ప్రావిన్సియల్త్రిశూర్‌లోని సీఎంఐ దేవమాత ప్రావిన్స్‌కు చెందిన ప్రావిన్సియల్ డాక్టర్ జోస్ నందిక్కారచేతన గాన-ఆశ్రమం కార్యనిర్వాహక డైరెక్టరు డాక్టర్ పాల్ పూవథింగల్ తదితర ప్రముఖులు ఉన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2234305) సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , हिन्दी , Tamil , Malayalam