ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్‌ ఫ‌ర్మేశన్‌ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
azadi ka amrit mahotsav

అధీకృత ఆధార్ కేంద్రాలను గూగుల్ మ్యాపుల్లో ప్రదర్శించడానికి గూగుల్‌తో చేయి కలిపిన యూఐడీఏఐ


సేవల వివరాలతో సహా సమీప ఆధార్ కేంద్రాల్ని గుర్తించే అవకాశం

నాడు పోస్టు చేయడమైనది: 26 FEB 2026 2:48PM by PIB Hyderabad

భారత విశిష్ట గుర్తింపు ప్రాధికార సంస్థ (యూఐడీఏఐ), గూగుల్ పరస్పరం చేతులు కలిపాయిదీంతో అధీకృత ఆధార్ కేంద్రాలను గూగుల్ మ్యాప్స్‌లో ప్రదర్శించడానికి అవకాశం ఏర్పడనుందిఇది ప్రజలకు దేశం నలుమూలలా సేవల లభ్యతను సరళతరం చేయడంతో పాటువారికి ఎంతో సౌకర్యవంతంగా కూడా ఉంటుంది.

ఆధార్ కేంద్రాలనూఅక్కడి సేవల్ని గుర్తించడానికి పౌరులకు వీలవుతుందిఉదాహరణకు.. ఆధార్ వ్యవస్థలో వయోజనులను చేర్పించడంపిల్లలను చేర్పించడం లేదా చిరునామామొబైల్ సంఖ్యను సరి చేయడం వంటి సేవల్ని అందిస్తున్న కేంద్రాల సమాచారాన్ని ప్రజలు తెలుసుకోవచ్చుదీనికి తోడుకేంద్ర లభ్యతకు సంబంధించిన సమాచారాన్ని కూడా తెలియజేయనున్నారుదివ్యాంగజనులకు ఏయే సదుపాయాలు కల్పించారువాహనాలను నిలిపి ఉంచడానికి ఏర్పాట్లుఆయా కేంద్రాల పని వేళల వంటి వివరాలను ఆయా సేవలు లభ్యతను బట్టి ఉంటుందిఫలితంగా స్థానికులకు ఇదివరకటితో పోలిస్తే ఎక్కువ సౌకర్యవంతంగా ఉంటుంది.

రాబోయే కొన్ని నెలల్లో ఈ సౌకర్యం అందుబాటులోకి వస్తుందని భావిస్తున్నారు.

దేశమంతటా అత్యాధునిక ఆధార్ సేవా కేంద్రాలు (ఏఎస్‌కేస్సహా 60,000 కన్నా ఎక్కువ ఆధార్ కేంద్రాలకు ఎలాంటి ఇబ్బందులనూ ఎదుర్కోకుండా ప్రజలు చేరుకొనేటట్లుగా చూసేఇప్పటితో పోలిస్తే ప్రజలకు అధిక సౌకర్యవంతంగా ఉండేదుష్ప్రచారాన్ని తిప్పికొట్టే ఉద్దేశాలతో ఈ సహకారాన్ని తీర్చిదిద్దనున్నారుదీంతో యూజర్లు గూగుల్ మ్యాప్స్‌ సాయంతో వెదకితే వారికి ధ్రువీకరించిన ఆధార్ కేంద్రాలు ఎక్కడ ఉన్నదీ తెలియజేయడం సాధ్యపడుతుంది.

యూఐడీఏఐ ముఖ్య కార్యనిర్వహణ అధికారి (సీఈఓశ్రీ భువనేశ్ కుమార్ మాట్లాడుతూ, ‘‘ఆధార్ సంఖ్యను కలిగి ఉన్న వారికి జీవన సౌలభ్యాన్ని మెరుగుపరచడంపై యూఐడీఏఐ సదా శ్రద్ధ తీసుకుంటోందిఈ సమన్వయాన్ని ఏర్పరుచుకోవడంతో అధీకృత ఆధార్ కేంద్రాలు ఎక్కడున్నదీ తెలుసుకోవడం ఇక సులభతరంవేగవంతం కావడంతో పాటు మరింత పారదర్శకంగా కూడా మారుతుంది’’ అన్నారు.
ఈ సమన్వయం తదుపరి దశలోకేంద్రం వారీగా సమాచారాన్ని నిర్వహించడానికీప్రజల స్పందన విషయంలో నేరుగా సమాధానమివ్వడానికీ గూగుల్ బిజినెస్ ప్రొఫైల్‌ను యూఐడీఏఐ ఉపయోగించుకోనుందిఫలితంగా పారదర్శకత్వంప్రతిస్పందన ప్రధాన సేవల తాలూకు అనుబంధ విస్తారిత వ్యవస్థ ఏర్పాటుకు మార్గం సుగమం అవుతుంది.

ఈ భాగస్వామ్యాన్ని ఉపయోగించుకొని రాబోయే కాలంలో గూగుల్ మ్యాప్స్ సాయంతో నేరుగా అపాయింట్‌మెంట్ బుకింగుకు అవకాశం ఉంటుందేమో పరిశీలిస్తారుఅదే జరిగితే పౌరులకు ఆధార్ కేంద్ర సందర్శనలో మరింత వెసులుబాటు దొరుకుతుంది.
‘‘
ధ్రువీకృత ఆధార్ కేంద్రాలను ఏకీకరించడానికి యూఐడీఏఐతో చేతులు కలపడం ద్వారాలక్షలాది నివాసులు నమ్మకమైన సేవలను అందుకోవడాన్ని మేం సులభతరం చేస్తున్నాంముఖ్యమైన ప్రభుత్వ సేవలకీఅవి అందాల్సిన ప్రజలకీ మధ్య నెలకొన్న అంతరాన్ని భర్తీ చేస్తున్నాం’’ అని గూగుల్ ఇండియా వ్యూహాత్మక భాగస్వామ్యాల విభాగం కంట్రీ హెడ్ రోలీ అగర్వాల్ అన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2233280) సందర్శకుల సూచీ సంఖ్య : : 15
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: English , Urdu , Marathi , हिन्दी , Gujarati , Tamil , Kannada , Malayalam