ప్రధాన మంత్రి కార్యాలయం
ఇజ్రాయెల్‌లో పర్యటించనున్న ప్రధానమంత్రి
నాడు పోస్టు చేయడమైనది:
24 FEB 2026 5:13PM by PIB Hyderabad
ఇజ్రాయెల్ ప్రధాని శ్రీ బెంజమిన్ నెతన్యాహు ఆహ్వానించడంతో, ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ 2026 ఫిబ్రవరి 25వ, 26వ తేదీల్లో ఇజ్రాయెల్‌లో అధికారికంగా పర్యటించనున్నారు. ప్రధానమంత్రి ఇజ్రాయెల్‌కు వెళ్లడం ఇది రెండో సారి కానుంది.
ప్రధానమంత్రి తన పర్యటనలో భాగంగా, ఇజ్రాయెల్ ప్రధాని శ్రీ బెంజమిన్ నెతన్యాహూతో భేటీ అవుతారు. ఇద్దరు నేతలూ భారత్ - ఇజ్రాయెల్ వ్యూహాత్మక భాగస్వామ్యంలో చోటు చేసుకున్న విశిష్ట పురోగతిని సమీక్షిస్తారు. దీంతో పాటు.. సహకారం, సైన్సు, టెక్నాలజీ, నవకల్పన, రక్షణ, భద్రత, వ్యవసాయం, జల నిర్వహణ, వాణిజ్యం, ఆర్థిక వ్యవస్థ, రెండు దేశాల ప్రజల మధ్య పరస్పర సంబంధాల వంటి విభిన్న రంగాల్లో ఇప్పటి కన్నా మరిన్ని ఎక్కువ అవకాశాలను సద్వినియోగపరుచుకునే దిశగా కూడా చర్చిస్తారు. నేతలు పరస్పర ప్రయోజనాలు ముడిపడి ఉన్న ప్రాంతీయ, అంతర్జాతీయ అంశాలపై తమ అభిప్రాయాలను పంచుకుంటారు.
ఇజ్రాయెల్ అధ్యక్షుడు శ్రీ ఇసాక్ హెర్జోగ్‌తో కూడా ప్రధానమంత్రి సమావేశమవుతారు.
ఈ పర్యటన రెండు దేశాల దీర్ఘకాలిక, గాఢతర వ్యూహాత్మక భాగస్వామ్యాన్ని పునరుద్ఘాటిస్తూ, సమష్టి సవాళ్లను సమీక్షించుకొనేందుకు ఒక అవకాశాన్ని అందిస్తుంది. దీంతోపాటు, ఆటుపోట్లను తట్టుకొని నిలుస్తున్న ఈ రెండు ప్రజాస్వామ్య దేశాల మధ్య దృఢతర భాగస్వామ్యాన్ని నెలకొల్పుకోవాలన్న ఉమ్మడి దృష్టికోణాన్ని అనుసరించే దిశగా ప్రయత్నాల్ని పునరేకీకరిస్తుంది.
(రిలీజ్ ఐడి: 2232306)
సందర్శకుల సూచీ సంఖ్య : : 4