ఉప రాష్ట్రప‌తి స‌చివాల‌యం
azadi ka amrit mahotsav

‘అటల్ బిహారీ వాజ్‌పేయి: ది ఎటర్నల్ స్టేట్స్‌మెన్’ కాఫీ టేబుల్ బుక్‌ను ఆవిష్కరించిన ఉపరాష్ట్రపతి శ్రీ సి.పి. రాధాకృష్ణన్

వాజ్ పేయితో తన వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తు చేసుకున్న ఉపరాష్ట్రపతి

అటల్ బిహారీ వాజ్‌పేయి నమ్మిన ఐక్యత, ప్రజాస్వామ్య విలువలను
యావత్ దేశం ముందుకు తీసుకెళ్లాలని ఉపరాష్ట్రపతి పిలుపు

నాడు పోస్టు చేయడమైనది: 21 FEB 2026 7:20PM by PIB Hyderabad

శ్రీ విజయ్ గోయల్ రచించిన “అటల్ బిహారీ వాజ్‌పేయిది ఎటర్నల్ స్టేట్స్‌మెన్”  కాఫీ టేబుల్ బుక్‌ను ఉపరాష్ట్రపతి శ్రీ సి.పిరాధాకృష్ణన్ నేడు న్యూఢిల్లీలోని డాక్టర్ అంబేద్కర్ ఇంటర్నేషనల్ సెంటర్‌లో  జరిగిన కార్యక్రమంలో ఆవిష్కరించారు.

తన ప్రసంగంలో ఉపరాష్ట్రపతి ఈ సందర్భాన్ని ఒక గౌరవ,  భావోద్వేగపూరితమైన క్షణంగా అభివర్ణించారుభారతదేశ అత్యున్నత నాయకులలో ఒకరైన భారతరత్న శ్రీ అటల్ బిహారీ వాజ్‌పేయి కి ఈ పుస్తకం  తగిన నివాళి అని ఆయన పేర్కొన్నారుఈ ప్రచురణ కేవలం ఛాయాచిత్రాల సంకలనం మాత్రమే కాదనిదేశానికి నిరంతరం స్ఫూర్తినిచ్చే ఒక గొప్ప రాజనీతిజ్ఞుడి జీవితం,  ఆయన వారసత్వానికి సంబంధించిన వేడుక అని ఆయన అన్నారు.

శ్రీ వాజ్‌పేయితో తనకున్న వ్యక్తిగత అనుబంధాన్ని గుర్తుచేసుకుంటూఅటల్ జీ ప్రధానమంత్రిగా ఉన్న కాలంలో 12, 13వ లోక్‌సభ సభ్యునిగా పనిచేసే భాగ్యం తనకు కలిగిందని ఉపరాష్ట్రపతి తెలిపారు. 1974లో కోయంబత్తూరులో శ్రీ వాజ్‌పేయి ప్రసంగించిన ఒక బహిరంగ సభను తాను నిర్వహించిన జ్ఞాపకాలను ఆయన పంచుకున్నారుతన రాజకీయ జీవితం ప్రారంభ దశలో ఆ అనుభవం ఎంతో స్ఫూర్తినిచ్చిందని ఆయన తెలిపారు

పార్లమెంటేరియన్‌గా ప్రారంభించి ప్రధానమంత్రి స్థాయికి ఎదిగిన శ్రీ వాజ్‌పేయి ప్రస్థానం భారత ప్రజాస్వామ్య గొప్పతనానికి నిదర్శనమని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారురాజకీయ పోరాటాలు తీవ్రంగా ఉన్న సమయాల్లో కూడా ఆయన తన నిజాయితీఅందరినీ కలుపుకునిపోయే గుణం,  హుందాతనంతో అన్ని రాజకీయ పార్టీల గౌరవాన్ని పొందారని ఉప రాష్ట్రపతి కొనియాడారు.

శ్రీ వాజ్‌పేయి నాయకత్వంలోని కీలక విజయాలను వివరిస్తూపోఖ్రాన్ అణు పరీక్షలుఢిల్లీ మెట్రో వంటి దూరదృష్టితో కూడిన మౌలిక సదుపాయాల కార్యక్రమాలను ఉపరాష్ట్రపతి ప్రస్తావించారుశక్తిసున్నితత్వం రెండూ కలిసి ఉండగలవని వాజ్‌పేయి నిరూపించారనిఆయన నిరంతరం చర్చలు ప్రజాస్వామ్యంఅభివృద్ధిని తన మార్గదర్శక సూత్రాలుగా పాటించారని ఆయన పేర్కొన్నారు.

శ్రీ వాజ్‌పేయిని  గొప్ప కవిగాదార్శనికుడిగా అసాధారణ పార్లమెంటేరియన్‌గా అభివర్ణిస్తూఆయన ప్రసంగాలు పార్లమెంటునుదేశాన్ని ఒకేలా ఉర్రూతలూగించాయని ఉపరాష్ట్రపతి అన్నారుఎవరితోనైనా విభేదించినప్పుడు కూడా ఎదుటివారిని ఒప్పించగలిగే అరుదైన సామర్థ్యం ఆయనకు ఉందనిఇది ప్రజా జీవితంలో చాలా అవసరమైన లక్షణమని ఆయన పేర్కొన్నారు.

కాఫీ టేబుల్ బుక్‌ను రూపొందించినందుకు శ్రీ విజయ్ గోయల్‌ను అభినందిస్తూఅరుదైన ఛాయాచిత్రాలువ్యక్తిగత కథనాలు,  పురావస్తు ఆధారాల ద్వారా ఈ పుస్తకం చరిత్రను ఒక సజీవ జ్ఞాపకంగా భద్రపరిచిందని ఉపరాష్ట్రపతి పేర్కొన్నారుఈ పుస్తకం దేశవ్యాప్తంగా ఉన్న ఇళ్లకుసంస్థలకు చేరువవుతుందనిముఖ్యంగా యువతలో జాతీయ ఐక్యతప్రజాస్వామ్యం,  సామాజిక సామరస్యం వంటి ఆదర్శాలను పెంపొందించడానికి స్ఫూర్తినిస్తుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

బీహార్ గవర్నర్ శ్రీ ఆరిఫ్ మహమ్మద్ ఖాన్హర్యానా గవర్నర్ ప్రొఫెసర్ అశిమ్ కుమార్ ఘోష్రాజస్థాన్ గవర్నర్ శ్రీ హరిభౌ కిసాన్‌రావ్ బాగ్డేమాజీ కేంద్ర మంత్రి డాక్టర్ మురళీ మనోహర్ జోషిగాంధీ స్మృతిదర్శన్ సమితి వైస్ ఛైర్మన్ శ్రీ విజయ్ గోయల్ తదితర ప్రముఖులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.

 

***


(రిలీజ్ ఐడి: 2231595) సందర్శకుల సూచీ సంఖ్య : : 2
ఈ ప్రకటనను ఇందులో చదవగలరు: Urdu , English , हिन्दी , Gujarati , Tamil , Malayalam