ప్రధాన మంత్రి కార్యాలయం
azadi ka amrit mahotsav

ఓ సంస్కృత సుభాషితాన్ని ప్రజలతో పంచుకుంటూ జ్ఞానానికి ఉన్న శాశ్వత సంపూర్ణత్వాన్ని వివరించిన ప్రధానమంత్రి

प्रविष्टि तिथि: 20 FEB 2026 9:29AM by PIB Hyderabad

అనంత జ్ఞానాన్ని ఇతరులతో పంచుకున్నా, లేదా మరింతగా విస్తరించినా అది తరిగిపోదని, జ్ఞాన పరిపూర్ణత్వం ఎలాంటి లోటుకూ తావు ఇవ్వక యథాపూర్వంగా మిగులుతుందని ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ అన్నారు.
జ్ఞాన భాండాగారంలో నుంచి విషయాలను నేర్చుకోవడం, దాంతో  కొత్త ఫలితాల్ని ఆవిష్కరించడం లెక్కపెట్టలేనన్ని అవకాశాలతో పాటు నవ కల్పనలకు బాటను పరుస్తుందని, అదే సమయంలో జ్ఞాన మూలం యథా పూర్వం గా ఉంటుందని ఆయన అన్నారు.
శాశ్వత జ్ఞానాన్ని గురించి ఈశా ఉపనిషత్తులో ఉన్న ప్రస్తావనను ప్రధానమంత్రి ఉదాహరిస్తూ, సంస్కృత భాషలో ఉన్న ఈ కింది పవిత్ర శ్లోకాన్ని ప్రస్తావించారు..:
“పూర్ణమద: పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే
పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే’’


(रिलीज़ आईडी: 2230641) आगंतुक पटल : 74
इस विज्ञप्ति को इन भाषाओं में पढ़ें: English , Urdu , Marathi , हिन्दी , Bengali , Assamese , Manipuri , Punjabi , Gujarati , Odia , Tamil , Kannada , Malayalam