ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026లో ప్రజాస్వామ్య, సమ్మిళిత ఏఐ భవిష్యత్తును వివరించిన గ్లోబల్ టెక్ లీడర్లు
ఏఐ ప్రజాస్వామీకరణే ముందుకు సాగేందుకు న్యాయమైన, సురక్షితమైన మార్గం: ఓపెన్ ఏఐ సీఈవో సామ్ ఆల్ట్మన్
గ్లోబల్ సౌత్‌కు ఏఐ సేవల నిర్ధారణకు మౌలిక సదుపాయాలు, నైపుణ్యాభివృద్ధి,
భాషా వైవిధ్యం చాలా అవసరం: మైక్రోసాఫ్ట్ వైస్ చైర్మన్, ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్
చరిత్రాత్మకంగా వెనకబడిన వర్గాల జీవితాలను మెరుగుపరచడమే
ఏఐ పనితీరుకు కొలమానం: గేట్స్ ఫౌండేషన్ ఆఫ్రికా-భారత్ కార్యాలయాల అధ్యక్షులు అంకుర్ వోరా
ప్రపంచ శ్రేయస్సు కోసం వృద్ధి ఇంజిన్‌గా ఏఐని ఉపయోగించడం ఏకైక మార్గం: యాక్సెంచర్ చైర్‌పర్సన్, సీఈవో జూలీ స్వీట్
నాడు పోస్టు చేయడమైనది:
19 FEB 2026 7:13PM by PIB Hyderabad
ఇండియా ఏఐ ఇంపాక్ట్ సదస్సు-2026లో భాగంగా ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట మన్, మైక్రోసాఫ్ట్ వైస్ చైర్మన్, ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్, గేట్స్ ఫౌండేషన్ ఆఫ్రికా-ఇండియా కార్యాలయాల అధ్యక్షులు అంకుర్ వోరా... యాక్సెంచర్ చైర్‌పర్సన్, సీఈవో జూలీ స్వీట్ ముఖ్యోపన్యాసాలు చేస్తూ... ప్రజాస్వామీకరణ, సమ్మిళితత్వం, ప్రపంచస్థాయి ప్రమాణాలు, మానవ నేతృత్వంలోని పునఃసృష్టిని ప్రస్తావిస్తూ కృత్రిమ మేధ పరివర్తన సామర్థ్యాన్ని స్పష్టం చేశారు. ఇండియా ఏఐ సదస్సును ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ ఈ రోజు ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ముఖ్యంగా గ్లోబల్ సౌత్ సాధికారత కోసం ఏఐ సదస్సు ఒక సాధనంగా మారాలని అన్నారు.
ఓపెన్ఏఐ సీఈవో సామ్ ఆల్ట మన్ తన ప్రసంగంలో సాంకేతిక పురోగతి అసాధారణ వేగం, దాని పథాన్ని రూపొందించడంలో పెరుగుతున్న భారత్ పాత్ర రెండింటినీ హైలైట్ చేస్తూ... "మన ప్రస్తుత పథంలో నిజమైన సూపర్ ఇంటెలిజెన్స్ ప్రారంభ వెర్షన్లకు మనం కేవలం రెండు సంవత్సరాల దూరంలో ఉండవచ్చని మేం నమ్ముతున్నాం. మనం సరిగ్గా ఆలోచిస్తే, 2028 చివరి నాటికి ప్రపంచంలోని మేధో సామర్థ్యంలో ఎక్కువ భాగం డేటా సెంటర్ల వెలుపల కంటే లోపలే ఉంటుంది." అన్నారు. సంసిద్ధత, సామాజిక సామర్థ్యాల ప్రాముఖ్యాన్ని ప్రధానంగా ప్రస్తావిస్తూ... "ఏఐ ప్రజాస్వామీకరణ మాత్రమే మనం ముందుకు సాగడానికి న్యాయమైన, సురక్షితమైన మార్గం. ఏఐ ప్రజాస్వామీకరణ మానవత్వం పరిమళించేందుకు ఉత్తమ మార్గం" అని అన్నారు.
ప్రపంచ సాంకేతిక అంతరాన్ని పరిష్కరించడంలో ఏఐ నిర్ణయాత్మక శక్తిగా మైక్రోసాఫ్ట్ వైస్ చైర్మన్, ప్రెసిడెంట్ బ్రాడ్ స్మిత్ అభివర్ణించారు, "ఈ శతాబ్దంలో ఆర్థిక అంతరాన్ని తగ్గించడం లేదా దానిని మరింత తీవ్రం చేయడంలో ఏఐ నిర్ణయాత్మక పాత్ర పోషిస్తుంది. నేడు మనకు ఉన్న ఏకైక ముఖ్యమైన ప్రశ్న... మనం ఎలా రాణించగలం?" ఏఐ... గ్లోబల్ సౌత్‌కు సేవ చేస్తుందని, విస్తృత శ్రేయస్సును అందిస్తుందని నిర్ధారించడానికి మౌలిక సదుపాయాలు, నైపుణ్యం, భాషా వైవిధ్యం అవసరమని ఆయన స్పష్టం చేశారు.
గేట్స్ ఫౌండేషన్ ఆఫ్రికా-ఇండియా కార్యాలయాల అధ్యక్షులు అంకుర్ వోరా మాట్లాడుతూ... ఆరోగ్యం, విద్య, వ్యవసాయ రంగ ఫలితాలను వేగవంతం చేయడంలో ఏఐ సామర్థ్యంపై దృష్టి సారించి, "చాలా మంది ఏఐ ప్రపంచం అందరికీ మెరుగ్గా ఉండటానికి సహాయపడుతుందని అంచనా వేస్తున్నారు. మరికొందరు ఇది విశేషమైన కొద్దిమందికి మాత్రమే ప్రయోజనం చేకూరుస్తుందని అంచనా వేస్తున్నారు. కానీ వాస్తవం ఏమిటంటే, ఇది అంచనాలకు సంబంధించిన విషయం కాదు. ఇది ఒక ఎంపిక." ఏఐ కొత్త దాతృత్వ కార్యక్రమాలను ప్రకటిస్తూ, చరిత్రాత్మకంగా వెనుకబడిన వర్గాల జీవితాలను స్పష్టంగా మెరుగుపరుస్తుందా లేదా అనేది దాని కొలమానం అని ఆయన స్పష్టం చేశారు.
యాక్సెంచర్ చైర్‌పర్సన్, సీఈవో జూలీ స్వీట్ మాట్లాడుతూ... "ప్రపంచవ్యాప్తంగా శ్రేయస్సు సాధించడానికి ఏఐని వృద్ధికి ఇంజిన్‌గా ఉపయోగించడం ఏకైక మార్గం" అని స్పష్టం చేశారు. కంపెనీలు, ప్రభుత్వాలు, వ్యక్తుల పునరావిష్కరణ కోసం ఆమె పిలుపునిచ్చారు. స్థిరమైన పురోగతికి నాయకత్వం, ప్రపంచ ప్రమాణాలు, శ్రామిక శక్తి పరివర్తన, మానవుల నియంత్రణలో ఏఐ వృద్ధిని నడిపించే నిబద్ధతలు అవసరమని ఆమె తెలిపారు.
సమష్టిగా నాలుగు ముఖ్య ప్రసంగాలూ అపూర్వమైన సాంకేతిక వేగం... బాధ్యత, సమ్మిళితత్వం, ప్రపంచ సహకారాల కోసం తక్షణ అవసరంగా ఏఐని వివరించాయి. సూపర్ ఇంటెలిజెన్స్, ప్రాంతీయ సామర్థ్యం నుంచి మౌలిక సదుపాయాలు, నైపుణ్యం, సామాజిక ప్రభావాల వరకు... ఏఐ విభజనలను తీవ్రతరం చేయకుండా అనుసంధానం ద్వారా వాటిని మరింత చేరువ చేయాలి, అధికార కేంద్రీకరణ చేయకుండా అవకాశాలను విస్తరించాలి, అంతిమంగా మానవ విలువలు, ప్రజాస్వామ్య సంస్థలు, ప్రజా ప్రయోజనకరమైన నాయకత్వం ద్వారా ఏఐని రూపొందించాలనే ఉమ్మడి ఎజెండా గురించి పరిశ్రమ దిగ్గజాలు చర్చించారు.
***
(రిలీజ్ ఐడి: 2230505)
సందర్శకుల సూచీ సంఖ్య : : 6