ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ ఫర్మేశన్ టెక్నాలజీ మంత్రిత్వ శాఖ
‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026’లో ఇంధనం
సౌలభ్య కల్పనపై ఏఐ ప్రభావ అధ్యయన ప్రచురణల ఆవిష్కరణ
ఇంధన మార్పిడిలో సాధికారత.. గరిష్ఠీకరణ దిశగా ఏఐ ద్వంద్వ పాత్రను వివరించిన సంకలనం
ఏఐ సంకలనం వర్ధమాన దేశాలకు మార్గదర్శక ప్రచురణగా ఉపయోగపడుతుంది: ఎలక్ట్రానిక్-ఐటీ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ అభిషేక్ సింగ్
ఏఐ ప్రభావ ప్రచురణల తోడ్పాటుతో వాతావరణం.. సామాజిక సార్వజనీనతపై సంయుక్త కార్యాచరణ బలోపేతం
నాడు పోస్టు చేయడమైనది:
17 FEB 2026 5:58PM by PIB Hyderabad
న్యూఢిల్లీలో నిర్వహిస్తున్న ‘ఇండియా ఏఐ ఇంపాక్ట్ సమ్మిట్-2026లో ఇంధనం, సౌలభ్య కల్పనపై దృష్టి సారించే ఏఐ ప్రభావ అధ్యయన ప్రచురణలను ఆవిష్కరించారు. సుస్థిర ప్రగతి, సమ్మిళిత వృద్ధి దిశగా కృత్రిమ మేధ వినియోగంపై ప్రపంచ దేశాల అనుభవాలను ఈ ప్రచురణలు వెల్లడిస్తాయి.

ఈ ప్రచురణలన్నీ ప్రభుత్వాల్లోని వివిధ మంత్రిత్వ శాఖలు, అంతర్జాతీయ ఏజెన్సీలు, పరిశోధన సంస్థలు, ఫౌండేషన్ల సహకారంతో ప్రచురితమయ్యాయి. ఆయా దేశాల విధాన రూపకర్తలతోపాటు అభ్యాసకులకు దీర్ఘకాలిక జ్ఞాన వనరులుగా ఇవి రూపొందాయి.
ఈ క్రమంలో అంతర్జాతీయ ఇంధన సంస్థ (ఐఈఏ) భాగస్వామ్యంతో ఇంధన అంశంపై సంకలనాన్ని తయారు చేశారు. ఇంధన మార్పిడిలో ఏఐ ద్వంద్వ పాత్రను ఇది ప్రముఖంగా వివరిస్తుంది. కంప్యూటింగ్ అవసరాలు పెరుగుతున్న నేపథ్యంలో అదనపు ఇంధన డిమాండ్‌కు చోదకంగా మారిన ఏఐ మరోవైపు ఇంధన వ్యవస్థలో పొదుపు మెరుగుదలలోనూ తోడ్పడుతుంది. గ్రిడ్ గరిష్ఠీకణ, పునరుత్పాదక ఇంధన ఏకీకరణ, డేటా సెంటర్ సామర్థ్యం, వాతావరణ నిబద్ధతల కారణంగా పెరిగే కంప్యూటింగ్ అవసరాల సమతౌల్యం దిశగా ఆధునిక పరిష్కారాల కోసం ఈ సంకలనంలోని పత్రాలు ఉపయోగపడతాయి.
దివ్యాంగులకు సహాయక పరికరాలు, ముందస్తు రోగ నిర్ధారణ, సానుకూల అభ్యాసం, అధునాతన కృత్రిమ అవయవాలు, మానసిక ఆరోగ్య మద్దతు దిశగా ఏఐ సారథ్యంలోని కార్యక్రమాలను సౌలభ్య సంబంధిత పుస్తకం అవగతం చేస్తుంది. అంతేకాకుండా గోప్యత రక్షణ, నైతికత విస్తరణ, సాంస్కృతికంగా సందర్భోచిత ఆవిష్కరణల ప్రాధాన్యాన్ని కూడా వివరిస్తుంది.

ఈ ప్రచురణల ఆవిష్కరణ సందర్భంగా ఎన్‌ఐసీ డైరెక్టర్ జనరల్-మంత్రిత్వశాఖ అదనపు కార్యదర్శి- భారత్ ఏఐ సీఈవో శ్రీ అభిషేక్ సింగ్ మాట్లాడుతూ- “సదస్సు సన్నాహక సంప్రదింపుల సమయంలో తీసుకున్న కీలక నిర్ణయాల్లో ఏఐ ప్రభావ అధ్యయనాల ప్రచురణ కూడా ఒకటి. దీంతోపాటు ఉత్తమ పద్ధతులు, ప్రపంచ ఆచరణల సంకలనం కూడా అందులో భాగం” అన్నారు. వివిధ దేశాలకు.. ముఖ్యంగా వర్ధమాన దేశాలు సహా ఒకేవిధమైన పలు అభివృద్ధి సవాళ్లు ఎదుర్కొంటున్న దేశాలకు ఈ ప్రచురణలు మార్గదర్శకం కాగలవని చెప్పారు. మరోవైపు ప్రభుత్వాలు, ఆవిష్కర్తలందరూ విజయవంతమైన పరిష్కారాలను పునరావృతం చేయడంలోనే కాకుండా అంకుర సంస్థలతో సంధానానికి, ప్రభావశీల కార్యక్రమాలను అమలు చేయడానికి ఈ జ్ఞాన భాండాగారం దోహదం చేస్తుందన్నారు.
అనంతరం ‘ఐఈఏ’ పరిధిలోని చీఫ్ ఎనర్జీ ఎకనామిస్ట్ కార్యాలయంలో వరల్డ్ ఎనర్జీ అవుట్‌లుక్ ప్రతినిధి శ్రీ సిద్ధార్థ్ సింగ్ మాట్లాడుతూ- ఏఐ సృష్టించిన ఇంధన డిమాండ్‌పై మరింతగా దృష్టి సారిస్తున్నప్పటికీ ఇంధన రంగంపై ఏఐ సానుకూల ప్రభావాన్ని గుర్తించడం కూడా అంతే ముఖ్యమన్నారు. ఆర్థిక వ్యవస్థతోపాటు సమాజానికి ప్రయోజనం చేకూర్చే ఏఐ ఉత్పాదక సామర్థ్యాలపై దృష్టి సారించడాన్ని ఇది ప్రోత్సహించగలదని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.
ఈ కార్యక్రమంలో విద్యుత్ మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి శ్రీ పీయూష్ సింగ్, నవ్య-పునరుత్పాదక ఇంధన మంత్రిత్వ శాఖ కార్యదర్శి శ్రీ సంతోష్ కుమార్ సారంగి; ఏఎల్ఐఎంసీఓ చైర్మన్-మేనేజింగ్ డైరెక్టర్ శ్రీ ప్రవీణ్ కుమార్, నేషనల్ గ్రీన్ హైడ్రోజన్ మిషన్ డైరెక్టర్ డాక్టర్ అభయ్ బక్రే తదితరులు పాల్గొన్నారు.
వివిధ దేశాల మధ్య అభ్యసనానికి మద్దతుతోపాటు నిరూపిత నమూనాల రూపకల్పన, వాతావరణ కార్యాచరణ, సార్వజనీనత సంబంధిత రంగాలలో ఏఐ అమలు తదితరాలకు పునాదిని బలోపేతం చేయడం ఈ ప్రచురణల ఉద్దేశం.
***
(రిలీజ్ ఐడి: 2229382)
సందర్శకుల సూచీ సంఖ్య : : 8